Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

25 December 2019

*టీఎస్ సెట్స్-2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి
* టిఎస్ ఈ సెట్ పరీక్ష మే 2 వ తేదిన. నిర్వహణ జెన్టీయుఎచ్. *టిఎస్ ఎంసెట్ పరీక్ష మే 5, 6, 7వ తేదీలలో ఇంజనీరింగ్.
 *9.10వ తేదిలలో అగ్రికల్చర్ నిర్వహణ జెన్టీయుహెచ్
* టిఎస్ పిఈ సెట్ పరీక్ష మే 13 నుండి వారం రోజుల‌పాటు నిర్వహణ. మహాత్మ గాంధీ యూనివర్శిటీ
 టిఎస్ ఐ సెట్ పరీక్ష మే 20, 22న. నిర్వహణ కేయు.
 టిఎస్ ఎడ్ సెట్ పరీక్ష మే 23న నిర్వహణ ఓయు
 టిఎస్ లా సెట్ పరీక్ష మే 25. నిర్వహణ ఓయు
 టిఎస్ పిజి లాసెట్ పరీక్ష మే 25న. నిర్వహణ ఓయు టిఎస్ ఫిజి ఈ సెట్ మే 27 నుండి 30 వరకు. నిర్వహణ ఓయు జూన్ చివరి నాటికి అడ్మిషన్ల ప్రకియ పూర్తి.

05 December 2019

Digital Employment Exchange of Telangana

ఉద్యోగవేటలో ఉన్నారా? అయితే మీకు సాయం చేయడానికి తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ (DEET) సిద్ధంగా ఉంది. DEETను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యోగావకాశాలు, నియామకాలు, ఉద్యోగ ఇంటర్వ్యూల సమాచారాన్ని DEET ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. దీనికోసం DEET appను అభివృద్ధి చేసి నిర్వహిస్తున్నది స్టోరీటెక్ ప్రైవేట్ లిమిటెడ్. కింది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే నిరుద్యోగులు DEET appను డౌన్‌లోడ్ చేసుకుని అందులో మీ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి


Phone- 8688519317
Email: help@tsdeet.com
DEET

Combined Higher Secondary level 2019



సీహెచ్‌ఎస్‌ఎల్ 2019
ఇంటర్ పాసై జీవితంలో త్వరగా ప్రభుత్వ కొలువులో చేరాలనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం. గ్రేడ్ ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కొలువు. మంచి జీతభత్యాలు, భద్రమైన జీవితం. వీటన్నింటి సమాహారమే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామ్. 2019కి సంబంధించిన ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణు పాఠకుల కోసం...

సీహెచ్‌ఎస్‌ఎల్: కేంద్రంలోని పలు శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) పోస్టులను, పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం ప్రతి ఏటా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్)ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహిస్తుంది.

ఎవరు అర్హులు?

-ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, పీఏ/ఎస్‌ఏ, డీఈవో (సీ&కాగ్‌లో డీఈవో పోస్టులు తప్ప) పోస్టులకు ఇంటర్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
-సీ&కాగ్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మ్యాథ్స్‌తో సైన్స్ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత.
-18-27 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పేస్కేల్:-ఎల్‌డీసీ/జేఎస్‌ఏ పోస్టులకు రూ.5,200-20,200+ గ్రేడ్ పే రూ.1,900/-
-పోస్టల్ అసిస్టెంట్/ఎస్‌ఏ, డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.5,200-20,200+గ్రేడ్ పే రూ.2,400/-
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1), డిస్క్రిప్టివ్ పేపర్ (టైర్-2), స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్ (టైర్-3) ద్వారా చేస్తారు.
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

ముఖ్యతేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: 2020, జనవరి 10
-వెబ్‌సైట్: https://ssc.nic.inhttps://ssc.nic.in

టైర్-1 పరీక్ష విధానం:

-నాలుగు పార్ట్‌లుగా ఉంటుంది. కాలవ్యవధి 60 నిమిషాలు.
-పార్ట్-1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
-పార్ట్-2లో జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
-పార్ట్-3లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
-పార్ట్-4లో జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
-టైర్-1 పూర్తిగా ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులను కోతవిధిస్తారు.
-టైర్-1 పరీక్షను 2020, మార్చి 16 - 27 మధ్య నిర్వహిస్తారు.

20 November 2019

T-SAT Press Release 19.11.2019 విద్యుత్ ఉద్యోగ అభ్యర్థులకు టి-సాట్ ఉద్యోగ గైడ్ • నేటి నుండి నెల రోజుల పాటు పాఠ్యాంశాల ప్రసారాలు • 10 ప్రధాన, 15 అనుబంధ సబ్జెక్టుల్లో బోధన • 160 గంటలు-30 రోజులు ఉదయం-సాయంత్రం వేళల్లో ప్రసారాలు • టి-సాట్ సీఈవో శైలేష్ రెడ్డి (టి.సాట్-సాఫ్ట్ నెట్) తెలంగాణ ప్రభుత్వం టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్న సుమారు 3,025 వేల పోస్టులకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు అవగాహన పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నాయి. నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ ఉద్యోగ గైడ్ పేరుతో ప్రసారాలు అందనున్నాయి. నెల రోజుల పాటు సుమారు 160 గంటలు వివిధ సబ్జెక్టుల్లో అభ్యర్థులకు బోధన పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు మంగళవారం టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవగాహన పాఠ్యాంశాలను టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోని పేద, మారు మూల ప్రాంత నిరుద్యోగులకు ఉచితంగా పోటీ పరీక్షల పాఠ్యంశాలను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ సంస్థల ఉద్యోగాల భర్తీ ప్రకటనకు అనుబంధంగా పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నామని సీఈవో తెలిపారు. నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు 31 రోజులు సుమారు 160 గంటల ప్రసారాలు చేయనున్నామన్నారు. ఈ ప్రసారాలు ఉదయం ఏడు గంటల నుండి 10 గంటల వరకు మూడు గంటల పాటు విద్య ఛానల్, సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మూడు గంటలు నిపుణ ఛానల్లో ప్రసారాలుంటాయని సీఈవో వివరించారు. టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన 10 ప్రధాన సబ్జెక్టులతో పాటు 15 అనుంబంధ సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ప్రసారం చేస్తున్నామని శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రసారాలు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు టి-సాట్ నిపుణ, విద్యతో పాటు టి-సాట్ సోషల్ మీడియాలో భాగమైన యాప్ TSAT.TV, వెబ్ సైట్ SOFTNET.TELANGANA.GOV.IN అందుబాటులో ఉంటాన్నాయన్నారు. విద్యుత్ ఉద్యోగ సంస్థల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టి-సాట్ ప్రసారాలను వినియోగించుకుని మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

30 October 2019

BIRED FREE SELF HELP TRAINING PROGRAMME ON MOBILE REPAIR , MS OFFICE, ACCOUNTING PACKAGE GST.APPLY THROUGH www.bired.org 
25 10 2019 to 5 11 2019 apply dates