Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

17 June 2019

గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ 

గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ - ఈ నెల 20 లోగా దరఖాస్తు చేసుకోండి సిద్దిపేట ఎడ్యుకేషన్ , జూన్ 16: వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థులకు స్థానిక టీఎస్ ఎస్సి స్టడీ సర్కిల్ లో గ్రూప్ 1,2,3,4, ఎస్సై, కానిస్టేబుల్, ఎస్సెస్సి, ఆర్ ఆర్ బి తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా ఐదున్నర నెలలపాటు ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు టీఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ లో ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .ఈ ఫౌండేషన్ కోర్సుకు బీసీ ,ఎస్సీ ,ఎస్టీ , మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు . ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఆదాయం 3 లక్షలు మించరాదని తెలిపారు. ఈ శిక్షణ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలకు 33 శాతం, వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 30 న సిద్దిపేట లో ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడిన 100 మంది అభ్యర్థులకు జులై 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఐదున్నర నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో శిక్షణ తో పాటు ఉచిత వసతి, భోజనం, హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. రు.2500 విలువగల స్టడీ మెటీరియల్స్ అందజేస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు వెబ్సైట్ www.tsscstudycircle.telangana.gov.in www.tsscstudycircle.telangana.gov.in  లో చూడాలని తెలిపారు. వివరాలకు ఫోన్ నెంబర్ 9182220112, 8686835282, 9553167760 లలో సంప్రదించాలని చెప్పారు .

Telugu UNIVERSITY PG Notification

http://www.pstucet.org

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

🔳ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జారీ 17-06-2019 02:40:00 25 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం 27న తొలి దశ సీట్ల కేటాయింపు హైదరాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలతో పాటు ఇతర ప్రభుత్వ ఫండింగ్‌ ఆధారిత ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సంయుక్త సీట్ల కేటాయింపు సంస్థ (జోసా) ఆదివారం విడుదల చేసింది. విద్యార్థుల రిజిస్ట్రేషన్‌కు ఆదివారం నుంచే అవకాశం కల్పించింది. ప్రతిష్ఠాత్మకమైన 107 విద్యాసంస్థల్లో సీట్ల మిగులుకు అడ్డుకట్ట వేసేందుకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను మొత్తం ఏడు దశల్లో పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఆయా విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్య, గత ఏడాది ఏయే బ్రాంచిలో ర్యాంకు కటాఫ్‌ అయ్యింది? తదితర వివరాలు జోసా అధికారిక వెబ్‌సైట్‌ www.josaa.nic.inwww.josaa.nic.in లో అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు రిపోర్ట్‌ చేసేందుకుగానూ దేశంలోని 18 ఐఐటీల్లో రిపోర్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.