Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

25 March 2022

* *నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యస్.ఐ మరియు కానిస్టేబుళ్లు కు పోటీ పడే పురుష మరియు మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణా* *జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి IPS **ఈ నెల తేదీ 28,29 రోజులలో మేకల అభినవ స్టేడియం లో ఉదయం 6 గంటలకు ఫిజికల్ టెస్టులు* . **తేదీ 31.03.2022 రోజున యన్.జి కళాశాల నందు రాత పరీక్షా* **ఎన్నికైన అభ్యర్థులకు తేదీ 06 .04 .2022 రోజు నుంచి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నందు ఇండోర్ మరియు ఔట్ డోర్ శిక్షణా తరగతులు* . ** తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా మన రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున గౌరవ డి.జి.పి మహేందర్ రెడ్డి IPS గారి ఆదేశాల మేరకు యస్.ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు 30 రోజుల పాటు భోజన మరియు నివాస వసతితో కూడిన ఇండోర్ మరియు ఔట్ డోర్ ఉచిత శిక్షణా ఇవ్వనున్నట్లు జిల్లా యస్.పి గారు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ నెల తేదీ 28, 29 రోజులలో ఉదయం 6.00 గంటలకు మేకల అభినవ స్టేడియం నందు మొదట పిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి తద్వారా తేదీ 31.03.2022 రోజున యన్.జి కళాశాల నందు రాత పరీక్ష నిర్వహిస్తారు. తద్వారా ఎన్నికైన అభ్యర్థులకు తేదీ 06.04.2022 నుండి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నందు ఇండోర్ మరియు ఔట్ డోర్ కు సంబందించిన తరగతులు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్ ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. **అభ్యర్థులు గమనించవలిసిన విషయాలు..* *ఈ నెల 28,29 రోజులలో మేకల అభినవ స్టేడియంలో ఉదయం 6 గంటలకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు దీనిలో భాగంగా పోటీలో పాల్గొనే పురుష అభ్యర్థులకు మొదటగా ఎత్తు, 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించబడును. *మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించబడును. * అభ్యర్థులు తమ వెంట యస్.ఐ మరియు కానిస్టేబుళ్లు కు సంభందించిన అర్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ సెట్ తీసుకరాగలరు