https://ciet.ncert.gov.in/activity/oere
Kindly register to join the programme at: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdjqlM-d3er9RQDpVFSAi1YsDC8WrZUlpBczVTQ0wB8wzntqA/viewform?usp=sf_link
See you online at this programme!
https://ciet.ncert.gov.in/activity/oere
Kindly register to join the programme at: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdjqlM-d3er9RQDpVFSAi1YsDC8WrZUlpBczVTQ0wB8wzntqA/viewform?usp=sf_link
See you online at this programme!
A1.* ♨️ బేగం పేట.
6వ నిజాం మహబూబ్ అలీ కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..
కూతురికి కట్నం కింద ఒక స్థలాన్ని కట్నంగా ఇచ్చాడు. ఆ స్థలానికి బషీర్ ఉన్నిసా బేగం పేరు మీదగా బేగంపేట అని పేరు వచ్చింది.
B2. *♨️చార్మినార్*
కులికుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి ప్రధాన ఆకర్షణ నాలుగు స్థంబాలు….
ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు… వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వచ్చింది!
H3. *♨️సికింద్రాబాద్*
మూడో నిజాం సికిందర్ ఝా పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది . అంతకుముందు సికింద్రాబాద్ ని లష్కర్ అని పిలిచే వారు.
I4.*♨️ఖైరతాబాద్*
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది
N5. *♨️శంషాబాద్*
షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వచ్చింది. షమ్స్ అంటే సూర్యుడు.
దీని అర్థం ప్రభువుల యందు సూర్యుడిలాంటి వాడని….
ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు కలదు.!
A6. *♨️నాంపల్లి*
నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్ నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.
V7. *♨️హిమయత్ నగర్*
1933 లో ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ ఆసఫ్ జా పేరు మీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది.
A8. *♨️అబిడ్స్*
ఆరో నిజాం కాలంలో అల్బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా యూదువ్యాపారి ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత కొంతకాలానికి ఆల్బర్డ్ అబిడ్ ఇంగ్లాండ్ కి వెళ్లిపోయినప్పటికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిరపడిపోయింది!కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.
S9. *♨️సోమాజిగూడ*
నిజాం కాలంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారైన సోనాజీకి కొన్ని భూములుండేవి .
సోనాజీ కాస్త సోమాజి అయింది. గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్ధం. రెండు కలిపి సోమాజిగూడ అయ్యింది!
A10 . *♨️మాసబ్ ట్యాంక్*
6వ కుతుబ్ షాహ్ భార్య హయత్ భక్షిభేగంను మాసాహెబా అని పిలిచేవారు. మాసాహెబా పల్లె భూములకు సాగునీరు ఇవ్వడానికి ఒక ట్యాంక్ నిర్మించింది .
ఆ ట్యాంక్ పేరు మాసాహెబా తలాబ్ అని పిలిచేవారు . చివరకు ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది .
N11. *♨️హైదరాబాద్*
కులీకుతుబ్ షా భార్య భాగమతి వివాహం తర్వాత తన పేరుని హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్ అంటే హైద్రా నగరం అని అర్ధం తర్వాత ఆ పేరు మీద హైదరాబాద్ గా మారింది .
T12 .*♨️మలక్ పేట్*
గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా యొక్క సేవకుడు మాలిక్ యాకుబ్ పేరు మీదగా ఈ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది.
H13 . *♨️బషీర్ బాగ్*
బసిరుద్దౌలాకు హైద్రాబాద్ లో ఒక ప్యాలెస్ ఉండేది .
ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద గార్డెన్ ఉండేది . బసిరుద్దౌలా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్ అనే పేరు వచ్చింది. బాగ్ అంటే గార్డెన్ అని అర్ధం .
O14. *♨️ఫలక్ నుమా:*
ఫలక్ అంటే ఆకాశం , నామ అంటే అద్దం . ఈ ప్రదేశం అంతా కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది . కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం వచ్చేలా ఫలక్ నామ అని పేరు పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!
S15 . *♨️సరూర్ నగర్*
రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.
H16.*♨️లంగర్ హౌజ్:*
గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్ హౌజ్ మారింది.
గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.
K17.*♨️చెంచల్ గూడ:*
చిచ్లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.
U18.*♨️కార్వాన్:*
ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.
M19.*♨️కవాడిగూడ:*
ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.
A20.*♨️దోమలగూడ:*
దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.
R21. *♨️బేగం బజారు:*
హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.
K22. *♨️అఫ్జల్ గంజ్:*
ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది
S23.*♨️హైదర్ గూడ:*
మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.
K24.*♨️తార్నాక:*
తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె..
నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.
25.*♨️శాలిబండ:*
శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు.
ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు.. కాలక్రమంలో అది శాలిబండగా మారింది
26.*♨️హబ్సిగూడ:*
నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు.
27.*♨️మదీనా:*
ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.
28.*♨️చిక్కడపల్లి:*
చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.
29.*♨️నౌబత్ పహాడ్:*
నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.
30.*♨️బాగ్‌లింగంపల్లి:*
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.
31.*♨️అడిక్‌మెట్:*
అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.
32.*♨️మీరాలంమండి:*
సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!
౩౩.*♨️బార్కాస్:*
నిజాం సైన్యంలో అరేబియన్ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.
34.*♨️తాడబండ్:*
తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్ బండ్‌గా మారిపోయింది.
35.*♨️ఎర్రమంజిల్:*
ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్ గా స్థిరపడింది.ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్ గా వాడేవారు.
36.*♨️కాచిగూడ:*
కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది.
37.*♨️లాడ్ బజార్:*
మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.
38.*♨️ముషీరాబాద్:*
హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.
39.*♨️ఫతే మైదాన్:*
ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు.
ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.
40.*♨️పబ్లిక్ గార్డెన్స్:*
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు.. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్
41.*♨️చాదర్ ఘాట్:*
మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.
42.*♨️ఆస్మాన్ గఢ్:*
1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్ పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.
43.*♨️ఉమ్దా బజార్:*
నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్‌గా ప్రసిద్ధిగాంచింది.
44.*♨️గౌలిగూడ:*
గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.
45,*♨️లల్లాగూడ:*
రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది.
46.*♨️సుల్తాన్ బజార్:* 1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక,
ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.
47.*♨️రికాబ్ గంజ్:*
రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.
48.*♨️డబిర్ పురా:*
నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.
49.*♨️అంబర్ పేట:*
అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్ పేటగా స్థిరపడిపోయింది.
50.*♨️చాంద్రాయణగుట్ట:*
చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.
51.*♨️చిలకలగూడ:*
చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!
52.*♨️మంగళ్ హాట్:*
మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.
53. *♨️సైదాబాద్:*
1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.
54.*♨️టప్పాచబుత్ర:*
టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.
55.*♨️తుకారాం గేట్:*
లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు.
ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.
56,*♨️యాఖుత్ పురా:*
హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు...
మీరు చదివాక మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
*సేకరణ*🤝🙏
Free Registration
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeE4F3JP7wWkF1VQe3Cain-v0ImLDKV1yKYVqRl4Wdb-FnxGw/viewform
Provide Participation Certificate
Platform: Google meet
Resource Person Dr. Chhavi Kiran, Assistant Professor, Department of Commerce and Management, Sanatan Dharma College, Ambala Cantt., Haryana
దీని తర్వాత AI మీ ఆధార్ మరియు పాన్‌తో లింక్ చేయబడిన లావాదేవీలను జోడించిన బ్యాంక్ ఖాతాలతో లెక్కిస్తుంది. ఇప్పుడు అది ఫిక్స్డ్ డిపాజిట్లు, క్రెడిట్ చేయబడిన త్రైమాసిక వడ్డీలు, షేర్ డివిడెండ్లు, షేర్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ మరియు షేర్లు, మీరు డిక్లేర్ చేసిన & మీరు దాఖలు చేసిన మీ ఇన్కమ్ ట్యాక్స్ ITR రిటర్న్స్‌తో పాటుగా జోడించిన అన్ని బ్యాంక్ ఖాతాల యొక్క దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక లాభాల యొక్క అన్ని వివరాలను సేకరిస్తుంది. ఇప్పుడు అది మీ పేరుపై మరియు *ఉమ్మడి పేరుతో -(ఖాతాను ఆపరేట్ చేయడానికి మీరు రెండవ లేదా మూడవ సభ్యుడిగా ఉన్న చోట)పై ప్రకటించని బ్యాంక్ ఖాతాలను లెక్కించడం ప్రారంభిస్తుంది. ఇది అన్ని సహకార బ్యాంకులు, స్థానిక క్రెడిట్ సంస్థలు (పతసంస్థ), పోస్టల్ ఫిక్స్ డిపాజిట్లు, ఆసక్తులు, పోస్టల్ RDలు, MIS, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లు మొదలైన వాటితో కూడిన పోస్టల్ ఖాతాలు మరియు బ్యాంక్ ఖాతాలను మీ పెట్టుబడులు చేసిన చోట సింగిల్ లేదా రెండవ పేరుతో శోధిస్తుంది. నమోదు కాని ITR ఫైలర్లు కుటుంబ సభ్యులతో.
ప్రస్తుత మరియు మునుపటి మూడేళ్లలో ఏదైనా *భూమి మరియు స్థిరాస్తి లావాదేవీల* కోసం ఇప్పుడు ప్రభుత్వ రిజిస్ట్రీ కార్యాలయంతో PAN కార్డ్ తనిఖీ చేయబడుతుంది.
వీటన్నింటి తర్వాత, వారు డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీలు, పాస్‌పోర్ట్, వీసా అటాచ్డ్ టూర్ వివరాలు, టూ & ఫోర్ వీలర్ కొనుగోలు లేదా అమ్మకం మొదలైన వాటిని వర్కవుట్ చేస్తారు.
సేకరించిన పూర్తి డేటా మీ ఆదాయపు పన్ను రిటర్న్ ద్వారా మీరు అందించిన/ప్రకటించిన డేటాతో సమానంగా ఉంటుంది. AS26 డేటాలో TDS కట్‌తో కూడా లెక్కించబడుతుంది.
ప్రకటించిన మరియు *ప్రకటించని* వాస్తవ ఆదాయపు పన్ను స్వయంచాలకంగా లెక్కించబడుతుంది మరియు సెక్షన్ 143(i) కింద మీకు డిమాండ్ పంపబడుతుంది.
పూర్తి ప్రూఫ్ ఆటోమేటెడ్ AI-ITR ప్రోగ్రామ్ విజయవంతంగా ఖరారు చేయబడింది & పరీక్షించబడింది మరియు *ఈ సంవత్సరం* నుండి మొదటిసారిగా అమలు చేయబడుతుంది. కాబట్టి ఆదాయపు పన్ను ప్రాసెసింగ్ కొంత ఆలస్యం అవుతుంది. అన్ని ఐటీఆర్‌లు జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రాసెస్ చేయబడతాయని భావిస్తున్నారు. *ఎందుకంటే ప్రత్యేకంగా రూపొందించిన ఈ AI-ITR ప్రోగ్రామ్ ఈ పనులన్నింటినీ సెకన్ల వ్యవధిలో పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ITR ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా..
ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు.
కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉంటే..
దానిని వేరొకరికి ఇచ్చేశారు...
ఇక తానెలా చదువుకునేది? అన్న ఆందోళన
కాలేజీ విద్యార్థులకు అవసరం లేదు.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలను
ఎలా కొనాలనే ఆలోచనా వద్దు. ఇప్పుడివన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి! ఇవే కాదు..
ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు
అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా
అన్నీ అందుబాటులో ఉన్నాయి.
ఆన్లైన్లో చదువుకోవచ్చు.
వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన
వీడియోలు చూడవచ్చు. ఆడియోలను వినవచ్చు. పీడీఎఫ్ కాపీలను కూడా పొందొచ్చు.
ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకం అయినా చదువుకోవచ్చు. ఒకటి కాదు.. రెండు కాదు.. కోటికిపైగా పుస్తకాలను, ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు..
నెట్ ఉంటేచాలు నట్టింట్లో ఉన్నట్లే.
ఐఐటీ ఖరగ్‌పూర్ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ భారీ కసరత్తును చేసింది.
https://ndl.iitkgp.ac.in
పై క్లిక్ చేసి అవసరమైన పుస్తకాన్ని చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
అదనంగా నయా పైసా ఖర్చులేదు..
ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కటుంటే చాలు...
అదనంగా నయాపైసా ఖర్చు లేకుండా
డిజిటల్ పుస్తకాలు, ఆర్టికల్స్, వీడియోలు, ఆడియోలు చూడొచ్చు.
సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు.
ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు.
అన్ని రంగాల పుస్తకాలూ..
దేశంలోని పలు యూనివర్సిటీలు,
పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఈ డిజిటల్ గ్రంథాలయంలో ఉంచారు.
సాధారణ విద్య నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు.. చరిత్ర నుంచి సాహిత్యం వరకు..
అన్ని రంగాలకు చెందిన పుస్తకాలు డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు
తమకు కావాల్సిన భాషలో డిజిటల్ పుస్తకాలను చదువుకోవచ్చు. ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) పుస్తకాలన్నింటినీ కూడా కంప్యూటరీకరించి ఇందులో ఉంచారు.
అంతేకాదు త్వరలో మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డిజిటల్ లైబ్రరీ ప్రత్యేకతలు ఎన్నెన్నో...
► 70కి పైగా భాషల్లో... కోటికి పైగా ఈ–పుస్తకాలు
► 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్
► లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు
► రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు
► 18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు
► 33 వేలకు పైగా గత ప్రశ్నాపత్రాలు
► యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నాపత్రాలు, జవాబులు
► వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్ కోర్సులు
► సమాచార నిధి, వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు
► సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి ప్రయోజనం ఎంతో...
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు ఈ డిజిటల్ లైబ్రరీతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వాటిని ఎలా పరిష్కరించారో తెలుసుకోవచ్చు. అయితే వాటికి సంబంధించి మార్కెట్లో ఉన్న పుస్తకాలను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో వాటిని పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ సులభం
డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం
చాలా సులభం. ఈ–మెయిల్ ఐడీ,
తాము చదువుతున్న కోర్సు, యూనివర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు.
ఈ వివరాలను నమోదు చేసిన తరువాత
తాము పేర్కొన్న ఈ–మెయిల్ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ఆ తరువాత ఈ–మెయిల్ ఐడీ, పాస్వర్డ్
నమోదు చేసి లైబ్రరీలో లాగిన్ కావచ్చు.
విద్యార్థులు, అభ్యర్థులు తమకు అవసరమైన విభాగాల వారీగా పుస్తకాలు, వీడియో, ఆడియో పాఠాలు, లెక్చర్లు, ఉపన్యాసాలు వెతికి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click Here to Download
MHRD National Digital Library
Meet our esteemed resource persons:
Prof. Shivaram Rao (PI & Associate Professor, CUHP)
Ms. Devika Goel (UX/UI Designer OJS, PKP Team)
Mr. Rupinder Sharma (Assistant Librarian, CUP)
Dr. Mohit Garg (PKP Member & Assistant Librarian, IITD)
Ms. Priya (PI, Associate Editor, DOAJ & RS, CUHP)
This is a fantastic opportunity to explore the future of academic publishing with expert-led sessions, interactive discussions, and hands-on activities. Enhance your knowledge and skills in open journal systems with us!
Limited spots available, so register now to secure your place! Click the link below to register: https://forms.office.com/r/ny4ukpUMbi
#OpenJournalSystems#AcademicWorkshop#onlineevent#ResearchCommunity #workshop #workshops2024 #BennettUniversity #ScholarlyPublishing #OJS#academicwriting#greaternoida
Reasons Why Reading Books Should Be Part of Your Life:
1. Knowledge Highway: Books offer a vast reservoir of knowledge on virtually any topic imaginable. Dive deep into history, science, philosophy, or explore new hobbies and interests.
2. Enhanced Vocabulary: Regular reading exposes you to a wider range of vocabulary, improving your communication skills and comprehension.
3. Memory Boost: Studies suggest that reading can help sharpen your memory and cognitive function, keeping your mind active and engaged.
4. Stress Reduction: Curling up with a good book can be a form of mental escape, offering a temporary reprieve from daily anxieties and a chance to unwind.
5. Improved Focus and Concentration: In today's fast-paced world filled with distractions, reading strengthens your ability to focus and concentrate for extended periods.
6. Empathy and Perspective: Stepping into the shoes of fictional characters allows you to develop empathy and gain a deeper understanding of different perspectives.
7. Enhanced Creativity: Reading exposes you to new ideas and thought processes, potentially sparking your own creativity and problem-solving skills.
8. Stronger Writing Skills: Immersing yourself in well-written prose can improve your writing style, sentence structure, and overall communication clarity.
9. Improved Sleep Quality: Swap screen time for a book before bed. The calming nature of reading can help you relax and unwind, promoting better sleep quality.
10. A Portal to New Worlds: Books transport you to different times, places, and realities. Experience thrilling adventures, historical events, or fantastical journeys from the comfort of your armchair.
11. Lifelong Learning: Reading is a journey of continuous learning and self-discovery. There's always something new to learn, regardless of your age or interests.
12. Conversation Starter: Books provide a treasure trove of topics for conversation, fostering connections and enriching discussions with others.