Educational News

డిగ్రీ లో ఆన్ లైన్ కోర్సులు : వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు,శ్రీకారం చుట్ట నున్న కళాశాల విద్యా శాఖ 2019-2020 విద్యా సంవత్సరం నుండి అమలు సిలబస్ రూపకల్పనలో అంబేడ్కర్ వర్సిటీ తో ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ కళాశాల విద్యాశాఖ ,త్వరలోనే డిగ్రీ లో ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయబోతున్న ట్లు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.ఇది కేంద్ర ప్రభుత్వ పథకమైన SWAYAM( Study Webs of Active learning for Young Aspiring Minds) పథకం లో భాగమైన MOOCS(Massive Open Online Courses ) విధానంలో అందించ బోతున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా ముందుగా సివిల్ సర్వీస్ పరీక్ష కు సన్నద్ధం కావడానికి తోడ్పడే సబ్జెక్టు లను ముందు గా చేర్చబోతున్నారు.ముఖ్యంగా జాగ్రఫీ,సైకాలజీ,పబ్లిక్అడ్మినిస్ట్రేషన్,జియాలజీ,సోషియాలజీ,లిటరేచర్ సబ్జెక్ట్ లను ముందుగా ఆన్ లైన్ ద్వారా అందించ బోతున్నారు.దీనివల్ల ఒక విద్యార్థి ,తన రెగులర్ డిగ్రీ సబ్జెక్ట్ ల కు అదనంగా పై సబ్జెక్టు లలో ఏదైనా ఒకటి గానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టు లను ఆన్ లైన్ లో నేర్చుకుని,ఆన్ లైన్ లో పరీక్ష ఉత్తీర్ణత సాధిస్తే,తన రెగులర్ సబ్జెక్టు మెమో లో ఈ ఆన్ లైన్ సబ్జెక్టు మార్కులు కూడా కలిపి సర్టిఫిగ్ట్ వస్తుంది.ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇప్పటికే ,సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ లకు JNTUH లో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది#విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) స్వయం ప్రతిపత్తి పొందిన కళాశాలల సంఖ్యలో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. యూజీసీ తాజా గణాంకాల ప్రకారం దేశంలో గత నవంబరు వరకు 106 విశ్వవిద్యాలయాల పరిధిలో 658 కళాశాలలు స్వయం ప్రతిపత్తి హోదా దక్కించుకున్నాయి. 183 కళాశాలలతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. 97 కళాశాలలతో ఏపీ రెండో స్థానం దక్కించుకుంది. 70 కళాశాలలతో కర్ణాటక 3వ, 59 కళాశాలలతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచాయి.#తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆయా పరీక్షలకు కన్వీనర్లను జ‌న‌వ‌రి 11న‌ నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్‌ కన్వీనర్‌గా ఎన్‌.యాదయ్య (జేఎన్‌టీయూహెచ్‌), ఈసెట్‌ కన్వీనర్‌గా ఎ.గోవర్దన్‌ (జెఎన్‌టీయూహెచ్‌), పీఈసెట్‌ కన్వీనర్‌గా వి. సత్యనారాయణ (ఎంజీయూ), ఐసెట్‌ కన్వీనర్‌గా సీహెచ్‌. రాజేశం (కేయూ), లాసెట్‌ కన్వీనర్‌గా జి.బి.రెడ్డి (ఓయూ), పీజీఈసెట్‌ కన్వీనర్‌గా ఎం.కుమార్‌ (ఓయూ), ఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా టి. మృణాళిని (ఓయూ)ను నియమించారు.#కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల తర్వాత ఒకేసారి 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి జనరల్‌ కేటగిరిలో 10% కోటా కేటాయించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా భారీగా నియామకాలకు రంగం సిద్ధం చేస్తోంది.#బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్ (బీఆర్క్‌) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్‌ ఆర్కిటెక్చర్ (నాటా)కు ఆంధ్రప్రదేశ్‌లో ఏడు, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.#దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో జనరల్‌ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యుఎస్‌)కు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జ‌న‌వ‌రి 17న‌ ఉత్తర్వులు జారీ చేసింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులు సమకూరుస్తున్న విద్యాసంస్థలన్నింటిలోనూ ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ ఛైర్మన్లు, ఉన్నత విద్యాశాఖలో వివిధ విభాగాలకు నేతృత్వం వహిస్తున్న అధికారులు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆఫీస్‌ మెమోరాండం జారీచేసింది.#త్వరలో 13 నూతన కేంద్ర విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు మూడేళ్ల కాలపరిమితిని నిర్దేశించుకుంది. బిహార్, గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం, 2009 కింద ఇవి ఏర్పాటవుతాయి.