Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

13 February 2019

TS ICET MBA/ MCA 2019

టీఎస్ ఐసెట్ -2019 షెడ్యూల్‌ విడుదల

కేయూ క్యాంపస్: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను నిర్వహించబోయే టీఎస్ ఐసెట్ -2019 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి విడుదల చేశారు.

                                        tsicet.nic.in             icet.tsche.ac.in

Education News
ఫిబ్రవరి 8న విలేకరుల సమావేశంలో ఐసెట్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. మార్చి 7 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ 450, బీసీ, ఓసీ అభ్యర్థులు రూ 650 చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల స్వీకరణకు రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 29 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
Last date for application : 29th April 2019
 రూ.500 అపరాధ రుసుముతో మే 6 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే 11 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 15 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 18 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న తర్వాత మే 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు మే 23, 24 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరో సెషన్‌కు అవకాశం ఉంటుందని, తక్కువగా వస్తే మూడు సెషన్లలోనే జరుపుతామన్నారు. ప్రిలిమినరీ కీ మే 29న విడుదల చేస్తామన్నారు. కీపై అభ్యంతరాలను జూన్ 1వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఫలితాలను జూన్ 13న విడుదల చేస్తామని పాపిరెడ్డి వెల్లడించారు.
Board NameTelangana state Council Of Higher Education
Exam LevelUniversity level
Apply ModeOnline
Notification Date21st February 2019.
Starting date to apply7th March 2019.
Last date to apply (Without Late Fee)29th April 2019.
Closing date to apply with late fee of Rs. 10,000/-18th May 2019.
Last date Of Application correctionLast week of April
Hall Ticket download9th May 2019.
TS ICET Exam Date23rd & 24th May 2019.
Answer key Release Date – Preliminary Key29th May 2019.
Objections on Preliminary KeyJune 2019.
Telangana ICET Results13th June 2019.
Rank Card Download June 2019.
 Counselling datesJuly 2019.
Allotment ResultJuly 2019.
Official Websiteicet.tsche.ac.in
Counselling Official Sitetsicet.nic.in

No comments:

Post a Comment