CHSL - Preparation Plan
ఎస్ఎస్‌సీ - సీహెచ్ఎస్ఎల్ 2018
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్ఎల్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో వీటికి పోటీపడవచ్చు. తపాలా శాఖతోపాటు వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో క్లరికల్ స్థాయి పోస్టుల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. మూడు దశల్లో నిర్వహించే పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
విద్యార్హత: ఇంటర్ ఉత్తీర్ణత. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌లోని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు మాత్రం మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి.
వయసు: ఆగస్టు 1, 2019 నాటికి 18-27 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1992 కంటే ముందు; ఆగస్టు 1, 2001 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 5 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
టయర్-1 పరీక్షలు: జులై 1 నుంచి 26 వరకు
టయర్-2 పరీక్ష తేదీ: సెప్టెంబరు 29
పరీక్ష కేంద్రాలు: ఏపీలో...చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఎంపిక ఇలా...
టయర్-1 కంప్యూటర్ బేస్డ్, డిస్క్రిప్టివ్ పేపర్ టయర్-2, స్కిల్ టెస్టు/ టైపింగ్ టెస్టు (టయర్ 3)

టయర్-1: ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వంద ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్), జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ప్రాథమికస్థాయి అరిథ్‌మెటిక్ నైపుణ్యాలు), జనరల్ అవేర్‌నెస్. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ అర మార్కు చొప్పున తగ్గిస్తారు. టయర్ -1 అర్హులకు టయర్ 2 నిర్వహిస్తారు.
టయర్-2: ఈ పరీక్షను పేపర్‌పై రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం 100 మార్కులు. డిస్క్రిప్టివ్ విధానం. ఇందులో భాగంగా ఇచ్చిన అంశానికి సంబంధించి 200-250 పదాల్లో ఒక వ్యాసం, 150-200 పదాల్లో ఒక ఉత్తరం లేదా దరఖాస్తు రాయాలి. హిందీ లేదా ఇంగ్లిష్‌లో రాసుకోవచ్చు. ఈ విభాగంలో అర్హత సాధించడానికి కనీసం 33 మార్కులు తప్పనిసరి. ఇందులో వచ్చిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
టయర్-3: టయర్-2 పరీక్షలోనూ కనీస అర్హత మార్కులు సాధించినవారికి టయర్-3 స్కిల్‌టెస్టు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించడం తప్పనిసరి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 15 నిమిషాల్లో 2000-2200 అక్షరాలను పద రూపంలో తప్పులు లేకుండా టైప్ చేయాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీఏజీ) పోస్టుకు 15 నిమిషాల్లో 3700-4000 అక్షరాలను పదరూపంలో తప్పులు లేకుండా టైప్ చేయాలి.
ఎల్‌డీసీ, జేఎస్ఏ, పోస్టల్ అసిస్టెంట్, సోర్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు టైప్ పరీక్ష ఉంటుంది. ఇందుకోసం ఆంగ్లం లేదా హిందీలో టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి. ఇంగ్లిష్ అయితే నిమిషానికి 35, హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి. అంటే ఆంగ్లంలో గంటకు 10500, హిందీలో 9000 అక్షరాలు టైప్ చేయాలి. ఏదైనా ప్యాసేజ్ ఇచ్చి పది నిమిషాల్లో టైప్ చేయమంటారు. ఆ వ్యవధిలో కనీస అక్షరాలు టైప్ చేశారో లేదో పరిశీలిస్తారు.

సన్నద్ధత...
జనరల్ ఇంగ్లిష్
ఈ విభాగంలో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్నే పరిశీలిస్తారు. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలగా మార్చడం, కాంప్రహెన్షన్..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. 8,9,10 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.

జనరల్ ఇంటలిజన్స్
ఈ విభాగంలో వెర్బల్, నాన్ వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి. నంబర్ ఎనాలజీ, నెంబర్ క్లారిఫికేషన్, ఫిగర్ ఎనాలజీ, వెన్ డయాగ్రమ్స్, నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్...మొదలైన విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. తర్కాన్ని ఉపయోగించి వీటికి జవాబులు గుర్తించవచ్చు. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుంటే ఈ విభాగం ఎవరికైనా సులువుగానే ఉంటుంది. వీలైనన్ని నమూనా ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ సమయంలో జవాబు గుర్తించే నైపుణ్యం అలవడుతుంది.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
నంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, త్రికోణమితి, అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌లో శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం -పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ దాదాపు దిగువ తరగతుల్లో చదువుకున్నవే. అందువల్ల గణితం పుస్తంలోని ఈ విభాగాలను మరోసారి మననం చేసుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే ముఖ్య సూత్రాలు వాటిని ఉపయోగించడం తెలుసుకోవాలి. వీటిని నోట్సుగా రాసుకోవాలి.

జనరల్ ఎవేర్‌నెస్
సాధారణ పరిజ్ఞానంతో ఈ విభాగంలో ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటన (వర్తమాన వ్యవహారాలు)లే ప్రశ్నలగా వస్తాయి. వీటితోపాటు భారత్- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. 8,9,10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన పాయింట్లను నోట్సు రాసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలించి ప్రశ్నలు అడిగే విధానం తెలుసుకోవచ్చు. వర్తమాన వ్యవహాల కోసం నవంబరు, 2018 నుంచి నుంచి జూన్, 2019 వరకు ముఖ్య సంఘటనలు మననం చేసుకోవాలి. దినపత్రిక చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నవాటిని నోట్సు రూపంలో రాసుకుంటే గుర్తుంచుకోవడం సులువవుతుంది.

పరీక్షకు ముందు వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి. అరవై నిమిషాల్లో వంద ప్రశ్నలకు జవాబు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు 36 సెకెన్ల సమయం మాత్రమే ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటలిజెన్స్‌ల్లో పలు ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు. సెక్షన్లవారీ సమయాన్ని నిర్ణయించలేదు కాబట్టి ఇంగ్లిష్, జనరల్ ఎవేర్‌నెస్ విభాగాలను తక్కువ వ్యవధిలో ముగించి క్వాంట్, ఇంటలిజెన్స్ అంశాల్లో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలకు వెచ్చించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ వ్యవధిలో ముగించడం అలవడుతుంది.
No comments:
Post a Comment