Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

09 September 2019

UGC NET (Dec.)-2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం* *నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం (సెప్టెంబరు 9) విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.* *సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 10 వరకు పీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000; ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 2 నుంచి 6 వరకు యూజీసీ నెట్(డిసెంబరు)-2019 పరీక్షలు నిర్వహించనున్నారు.* *పరీక్ష విధానం..* ✦ *ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది.* ✦ *పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.* ✦ *ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.* ✦ *ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ముఖ్యమైన తేదీలు..* ✦ *ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019* ✦ *ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.09.20'po19* ✦ *దరఖాస్తుల సవరణకు అవకాశం: 18 - 25.10.2019 వరకు.* ✦ *అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: 09.11.2019* ✦ *నెట్ పరీక్ష తేదీలు: డిసెంబరు 2 - 6 వరకు.* ✦ *ఫలితాల వెల్లడి: 31.12.2019* 🍁🍃🍁🍃🍁🍃🍁

No comments:

Post a Comment