Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

28 January 2020

ఖర్చులేకుండా నాణ్యమైన కోర్సులు
* సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు
భోజనం, వసతి సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే గురుకుల కళాశాలలు నిరుపేద వర్గాలకు వరం లాంటివి. వీటిలో ఇంటర్‌తో పాటు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశపరీక్షలకూ మెరుగైన శిక్షణ లభిస్తుంది. తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన విద్యార్థులు సంబంధిత ప్రవేశపరీక్ష రాసి, ప్రతిభను ప్రదర్శిస్తే.. సీటు సంపాదించుకోవచ్చు!
తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారికి ఉచిత విద్య అందించడంతో పాటు వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. జేఈఈ, నీట్‌, ఎంసెట్‌లకు శిక్షణ అందిస్తారు. రాత పరీక్ష ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా 41 బాలురు, 84 బాలికల సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలల్లో 10,960 సీట్లను భర్తీ చేస్తారు. ఎంపికైనవారిని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వొకేషనల్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. అన్ని కళాశాలల్లోనూ 75 శాతానికి పైగా సీట్లను ఎస్సీ విద్యార్థులతో భర్తీ చేస్తారు.
అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఆగస్టు 31, 2020 నాటికి 17 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించరాదు.
పరీక్ష తీరు
ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 ప్రశ్నలు వస్తాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. మ్యాథ్స్‌ 30, ఫిజికల్‌ సైన్స్‌ 30, బయాలజీ 30, సోషల్‌ స్టడీస్‌ 30, ఇంగ్లిష్‌ 15, జనరల్‌ నాలెడ్జ్‌, కరంట్‌ అఫైర్స్‌ 15 మార్కులకు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. పదో తరగతి సిలబస్‌ నుంచే సబ్జెక్టు ప్రశ్నలన్నీ వస్తాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 28
పరీక్ష తేదీ: మార్చి 1
హాల్‌ టికెట్లు: ఫిబ్రవరి 22 నుంచి 29 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment