Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

21 May 2020

ఏసీఎస్‌ఐఆర్‌ పీజీ, పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ 2020

            ప్రపంచంలో మానవాళి మనుగడ కోసం నిత్యం పరిశోధనలు తప్పనిసరి. సాధారణ సమస్యల మొదలు విపత్తుల నుంచి రక్షణ కోసం పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. దేశంలో ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పరిశోధకుల కోసం ప్రవేశ ప్రకటన విడుదలైంది. దీనిలో ఎంపికైనవారికి ప్రతినెలా స్టయిఫండ్‌ ఇస్తూ దేశంలోని 42 ప్రఖ్యాత పరిశోధనాలయాల్లో, నిపుణుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయడానికి అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించిన ఏసీఎస్‌ఐఆర్‌ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..

ఏసీఎస్‌ఐఆర్‌ 2010లో జాతీయ ప్రాధాన్య సంస్థగా అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ రిసెర్చ్‌ (ఏసీఎస్‌ఐఆర్‌) పార్లమెంట్‌ చట్టం ద్వారా ఆవిర్భవించింది. 2458 మంది శాస్త్రవేత్తలు ఫ్యాకల్టీలకు తోడుగా మరో 36 మంది అనుబంధ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్నారు. సీఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ల్యాబొరేటరీల్లో పరిశోధనలకు ఏసీఎస్‌ఐఆర్‌ విద్యార్థులను అనుమతిస్తారు. http://acsir.emli.in

అందిస్తున్న కోర్సులు : పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ -పీహెచ్‌డీ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సులు.

  • స్టయిఫండ్‌: ప్రతి నెలా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టయిఫండ్‌ ఇస్తారు.

ప్రత్యేకతలు

  • సాధారణ విశ్వవిద్యాలయాలకు భిన్నమైన విభాగాల్లో పరిశోధనలకు ఏసీఎస్‌ఐఆర్‌ ప్రాధాన్యం ఇస్తుంది. 
  • ఇందుకోసం పరిశోధనాత్మక, సరికొత్త పాఠ్యప్రణాళికను రూపొందించింది. 
  • బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్సెస్‌లలో కోర్సులను అందిస్తుంది.
  • దేశవ్యాప్తంగా 37 ప్రయోగశాలలు, 6 సీఎస్‌ఐఆర్‌ యూనిట్లు వివిధ సబ్జెక్టుల కోసం ఈ సంస్థ వాస్తవ క్యాంపస్‌లుగా వ్యవహరిస్తాయి. 

ఎవరు అర్హులు?

  • పీహెచ్‌డీ: ఇంజినీరింగ్‌, సైన్స్‌ సబ్జెక్టులు ఉన్నాయి.
  • అర్హతలు: బీటెక్‌/ ఎంటెక్‌ లేదా సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సీఎస్‌ఐఆర్‌-యూజీసీ, డీఎస్‌టీ, డీబీటీ వంటి జాతీయస్థాయి పరీక్షలలోనైనా జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించి ఉండాలి.
  • ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ పీహెచ్‌డీ 
  • అర్హతలు: బీటెక్‌ లేదా ఎమ్మెస్సీ పూర్తిచేసినవారు అర్హులు. 
  • జేఆర్‌ఎఫ్‌/ గేట్‌ లేదా నెట్‌లలో అర్హత సాధించాలి.

ఎంటెక్‌  అర్హతలు: బీటెక్‌ లేదా నాలుగేళ్ల సైన్స్‌ డిగ్రీ లేదా ఎమ్మెస్సీ ఉండాలి. నెట్‌, గేట్‌ ఇలా ఏదైనా జాతీయపరీక్షలో అర్హత సాధించాలి. ఎమ్మెస్సీ 

  • అర్హతలు: సైన్స్‌, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ తదితరాల్లో ఎందులోనైనా కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
  • ఎంపిక విధానం, ప్రతి ప్రోగ్రామ్‌కి ఒక దరఖాస్తు మాత్రమే పంపాలి. 
  • దరఖాస్తు చేసుకున్నవారిని పరిశీలించి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. తర్వాత అభ్యర్థులకు ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ /ఇంటర్వ్యూ లేదా రెండింటికీ పిలుస్తారు. 
  • వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నోట్‌: పైన చెప్పిన అర్హతలు కలిగి ఉండి ప్రస్తుతం ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోలు, గ్రూప్‌-4 సైంటిస్టులు, సీఎస్‌ఐఆర్‌లోని గ్రూప్‌-3 టెక్నికల్‌ సిబ్బంది తమ అర్హతలను అనుసరించి ఏసీఎస్‌ఐఆర్‌ నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యతేదీలు దరఖాస్తు: ఆన్‌లైన్‌లో,చివరితేదీ:  28 మే-2020

No comments:

Post a Comment