*ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒకే పరీక్ష*
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. జాతీయ నియామక సంస్థ ( NATIONAL RECRUITING AGENCY) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి ప్రవేశ నిర్వహించడానికి ఈ సంస్థ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ’ ఏర్పాటు నిర్ణయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో మైలురాయి వంటిదని మంత్రి ప్రకాష్ జవదేకర్ అభివర్ణించారు. ఉద్యోగాల కల్పనకు చేపట్టిన సంస్కరణలలో అతి ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే దేశ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని
ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువకులు ఎన్నో పరీక్షలు రాయాల్సి వస్తోంది…జాతీయ స్థాయిలో 15 సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటికి బదులుగా ఇకపై ఒకే సంస్థ ఉద్యోగాల భర్తీని చేపడుతుంది.
No comments:
Post a Comment