Dear young, aspiring, new Film makers,
Here it's a good news for you...
*తెలంగాణ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి కథలపై లఘుచిత్ర పోటీలు - 2021 *
--- the first ever short film contest on the writings of late SRI SURAVARAM PRATHAPAREDDY GARU
--- a filmy tribute to the legend in connection with his 125th birth anniversary celebrations
--- last date of submission of entries is May 1, 2021.
--- prize distribution is on May 28, 2021
--- winners will get certificate, memento and attractive cash prizes
--- an initiative of the department of language and culture, Govt of Telangana.
కథా రచయిత, గోలకొండ పత్రికాధిపతులు, చరిత్రకారుడు, పరిశోధకుడు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి గారి 125వ జయంతిని పురస్కరించుకొని భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన కథలు, కథానికలను ఆధారం చేసుకొని నిర్మించే లఘుచిత్రాల పోటీలను నిర్వహించడానికి నిర్ణయించింది. ఔత్సాహిక సినీ నిర్మాత దర్శకుల నుంచి ఈ లఘుచిత్రాలను ఆహ్వానిస్తున్నాము. ఈ లఘు చిత్రాలలో విజయం సాధించిన వారికి 28 మే, 2021 నాడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి 125 వ జయంతి వేడుకల సందర్భంగా నగదు బహుమతులు, జ్ఞాపికలను మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా ప్రదానం చేస్తాము.
*ఈ పోటీలో పాల్గొనే లఘుచిత్రాల నియమ నిబంధనలు:-*
•ఈ లఘుచిత్రాలు సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన కథలు, నాటకాల ఆధారంగానే రూపొందించాలి.
లఘుచిత్రం ఏ కథ ఆధారంగా రూపొందిందో టైటిల్స్ లో ముందే వేయాలి.• లఘుచిత్రాల నిడివి 20 నుండి 30 నిమిషాల లోపు ఉండాలి.
• లఘుచిత్రాల నిర్మాణం నాణ్యతతో, మంచి కెమెరాతో చిత్రీకరించబడి ఉండాలి.• ఎంపికైన అన్ని లఘుచిత్రాలు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శింపబడతాయి.
* ఉత్తమ చిత్రాల ఎంపిక నిపుణులైన జ్యురీ చేత నిర్వహిస్తాము.
• ఎంపికైన అన్ని లఘుచిత్రాలకు భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుండి ధృవీకరణ పత్రాలు అంద చేయబడతాయి.విజేతలకు జ్ఞాపికలు, నగదు బహుమతులు, ధృవీకరణ పత్రాలు ప్రదానం చేయబడతాయి. 2021 మే 28 నాడు రవీంద్రభారతి మెయిన్ హాల్ లో విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుంది.-వివరాలకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాలయం ఫోన్ నెం.040-23212832 లేదా 9948152952 ను సంప్రదించవచ్చు.-మీ లఘుచిత్రాలను, వాటి వివరాలను పంపించాల్సిన ఈమెయిల్: suravaramfilms2021@gmail.com
-ఎంట్రీలు పంపించాల్సిన చివరి తేదీ: మే 01, 2021
No comments:
Post a Comment