*ఈసీఐఎల్ 111 పోస్టుల భర్తీ నోటిఫికేషన్*.
*డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఐటీఐ పాస్ అయినవారికి గుడ్ న్యూస్*
*ఖాళీల వివరాలు ఇవే.*
జూనియర్ ఆర్టిసన్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 111 ఖాళీలున్నాయి. మైసూరులోని ఈసీఐఎల్ యూనిట్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. నాలుగేళ్ల కాలానికి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈసీఐఎల్. నాలుగేళ్ల తర్వాత ప్రాజెక్ట్ అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 17, 18 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది. ఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ http://www.ecil.co.in/ లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ఇంటర్వ్యూకు హాజరు కావాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment