Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

12 July 2022

GROUP1 Coaching schedule morning 6 to 10 am and 6 to 10 pm both Telugu and English medium

TSAT  గ్రూప్-1 పోటీ పరీక్షల పాఠ్యాంశ ప్రసారాలు టి-సాట్ లో మరో గంట 

🔴 తెలుగు-ఆంగ్ల పాఠ్యాంశాలు కలిపి సుమారు 1200 భాగాలు

🔴 టి-సాట్ ఛానళ్లలో ఉదయం 6 నుండి 10, సాయంత్రం 6 నుండి 10 గంటల వరక

  తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసే గ్రూప్-1 ఉద్యోగాల కోసం టి-సాట్ ప్రసారం చేస్తున్న పాఠ్యాంశాలు మరో గంట అదనం ప్రసారం చేస్తున్నామని టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ప్రతి రోజూ నాలుగు గంటలు-ఎనిమిది పాఠ్యాంశాలుగా ప్రసారం చేయనున్నామని ప్రకటించారు.


 ✍🏼టి-సాట్ నిపుణ ఛానల్ లో సాయంత్రం ఆరు గంటల నుండి 10 గంటల వరకు, విద్య ఛానల్ లో ఉదయం ఆరు నుండి 10 గంటల వరకు ప్రసారాలుంటాయని, గతంలో మూడు గంటలుగా ఉన్న ప్రసారాలను మరో గంట అదనంగా ప్రసారం చేస్తున్నామన్నారు. నాలుగు గంటల్లో గంట పాటు ఇంగ్లీష్ పాఠ్యాంశాలుంటాయని వివరించారు.

✍🏼టీఎస్పీయస్సీ ఆధ్వర్యంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యాక మే ఒకటవ తేదీ నుండే టి-సాట్ బోధనా పాఠ్యాంశ ప్రసారాలు ప్రారంభించిందని తెలిపారు. అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ఖరారు చేసినందున అదనపు పాఠ్యంశాలను ప్రసారం చేసి, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు మరింత వెసులుబాటు కలిగించాలని నిర్ణయించినట్లు శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఇప్పటికే సుమారు 180 పాఠ్యాంశ భాగాలు ప్రసారాలు చేశామని అక్టోబర్ 10వ తేదీ వరకు 620 పాఠ్యాంశ భాగాలను ప్రసారాలు చేయాలని నిర్ణయించామని, ఆంగ్ల భాష ప్రసారాలతో కలిపి మొత్తం 1200 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు.


✍🏼అనుభవం కలిగిన ఫ్యాకల్టీ, ఆధునిక సాంకేతికతో భోధించే పాఠ్యాంశాలను గ్రూప్-1 పోటీ పరీక్షల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సీఈవో శైలేష్ రెడ్డి కోరారు.


#press #TelanganaTSAT

#group1classes

#SHAILESHREDDY #PressNote

No comments:

Post a Comment