*🔊డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు*
*🍥ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇకపై ప్రతి విద్యార్థి సైబర్ సెక్యూరిటీ కోర్సు (నాలుగు క్రెడిట్లుగా)ను అదనంగా చదవాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల మదింపునకు పరీక్షల నిర్వహణ విధానాన్ని, ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్నీ కొత్త విధానంలో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆర్.లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాలలు, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, ఓయూ వీసీ డి.రవీందర్‌తోపాటు వివిధ వర్సిటీ వీసీలు పాల్గొన్నారు. ఐఎస్‌బీ నుంచి ఆచార్య చంద్రశేఖర్ శ్రీపాద, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య గరిమ మాలిక్ హాజరై ఐఎస్‌బీ అధ్యయనం చేసిన ‘అసెస్‌మెంట్, ఎవాల్యుయేషన్ సిస్టం’ నివేదికను సమర్పించారు. సమావేశంలో డిగ్రీలో చేపట్టబోయే సంస్కరణలు, నూతన కోర్సులు, ఇతర అకాడమిక్ అంశాలపై చర్చించారు.*
*🌀ఎక్కువ సంఖ్యలో డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య ఆధారిత కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. బీఎస్సీ(ఆనర్స్) కంప్యూటర్ కోర్సునూ ప్రారంభిస్తారు. డిగ్రీ చదివే ప్రతి విద్యార్థీ వాల్యూ అడిషన్‌లో భాగంగా సైబర్ సెక్యూరిటీ కోర్సును నాలుగు క్రెడిట్లుగా చదవాల్సి ఉంటుంది. ప్రధాన కోర్సులతోపాటు దీన్ని అదనంగా చదవాలి.*
No comments:
Post a Comment