తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్‌సీహెచ్‌ఈ).. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్)-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
పరీక్ష వివరాలు:
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్)-2024
కోర్సులు: బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.900 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500).
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-02-2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16-04-2024.
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: 22-04-2024.
రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: 28-04-2024.
పరీక్ష తేదీ: 06-05-2024.
No comments:
Post a Comment