Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

17 July 2024

*'న్యాక్' గుర్తింపునకు సంస్కరణలు* • వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు అన్ని కాలేజీలకూ అక్రిడిటేషన్ తప్పనిసరి • కేంద్ర విద్యాశాఖ సమాలోచన నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపునకు సంబంధించి సంస్కరణలు తేవాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తున్నది. ప్రస్తుతం న్యాక్ నిబంధనలను మార్చి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చే ఆలోచన చేస్తున్నది. ఇందుకోసం ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మెన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన కేంద్రం కమిటీని నియమించింది. ఈ కమిటీలో 45 మంది విద్యాశాఖ అధికారులు, విద్యావేత్తలు, నిపుణులు ఉంటారు. న్యాక్ గుర్తింపునకు సంబంధించి తేవాల్సిన సంస్కరణల గురించి ఆ కమిటీ అధ్యయనం చేసి సిఫారసులను చేయనుంది. జాతీయ నూతన విద్యావిధానం- 2020కి అనుగుణంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిబంధనలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. దేశంలో అన్ని కాలేజీలూ, విశ్వవిద్యాలయాలకూ న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేయాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తున్నది. ప్రస్తుతం న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. అక్రిడిటేషన్ ఉన్న విద్యాసంస్థలు, అక్రిడిటేషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యాసంస్థలు, అక్రిడిటేషన్ లేని విద్యాసంస్థలుగా విభజిస్తారు. ప్రస్తుతం దేశంలో విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు ఒకే విధమైన నిబంధనల ప్రకారం న్యాక్ గుర్తింపు ఇస్తున్నారు. వాటిలో మార్పు తేవాలని విద్యాశాఖ భావిస్తున్నది. విశ్వవిద్యాలయాలు, అటానమస్ కాలేజీలు, గుర్తింపు పొందిన కాలేజీలకు వేర్వేరుగా న్యాక్ నిబంధనలను తయారు చేస్తారు. వాటి ఆధారంగా న్యాక్ గుర్తింపును ఇస్తారు. విశ్వవిద్యాలయాలకు మౌలిక వసతులు, అధ్యాపకులు, పరిశోధనలు, అంతర్జాతీయ, తీయ, జాతీయ జర్నల్స్ కు ప్రాధాన్యత ఉంటుంది. అటానమస్ కాలేజీలు, గుర్తింపు పొందిన కాలేజీలకు మౌలిక వసతులు, అధ్యాపకుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాక్ గుర్తింపును ప్రకటిస్తారు. *వంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్* రాష్ట్రంలో 135 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో వంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్ గ్రేడ్ వచ్చింది. మిగిలిన కాలేజీలకూ న్యాక్ గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసుకుంటే మౌలిక వసతుల కల్పన కోసం ఉన్నత విద్యామండలి రూ. లక్ష ఇస్తుంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, వృత్తి విద్యాకాలేజీలు సహా డిగ్రీ కాలేజీలతో కలిపి మొత్తం 1,988 కాలేజీలుంటే, వాటిలో 65 అటానమస్ కాలేజీలున్నాయి. ఇందులో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో 34, ఓయూ పరిధిలో 23, మిగిలిన 12 కాలేజీలు వివిధ వర్సిటీల పరిధిలో ఉన్నాయి. *న్యాక్ గ్రేడ్ ఇచ్చేదిలా...* న్యాక్ లో ఏ++, ఏ+, ఏ, బీ++, బీ+, బీ, సీ గ్రేడ్లున్నాయి. బోధన అంశాలకు 150 మార్కులు, బోధన, అభ్యసన, మూల్యాంకనానికి 200 మార్కులు, పరిశోధన, ఆవిష్కరణలకు 250 మార్కులు, - మౌలిక వసతులకు 100 మార్కులు, సుపరిపాలన, నాయకత్వ ప్రతిభకు 100 మార్కులు, విద్యాసంస్థలో విలువలు, అవార్డులకు 100 మార్కుల చొప్పున మొత్తం 1000 మార్కులుంటాయి. న్యాక్ బృందం విశ్వవిద్యాలయం లేదా కాలేజీని సందర్శించి ఆ అంశాలను పరిశీలిస్తుంది. వెయ్యి మార్కులను నాలుగు క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ)గా కుదించి గ్రేడ్ను కేటాయిస్తారు. 3.76 నుంచి 4 పాయింట్లు సాధిస్తే ఏ++ గ్రేడ్, 3.51 నుంచి 3.75 పాయింట్లు సాధిస్తే ఏ+ గ్రేడ్, 3.01 నుంచి 3.50 పాయింట్లు వస్తే ఏ గ్రేడ్ వస్తుంది. న్యాక్ గ్రేడ్ ఐదేండ్లపాటు ఉంటుంది. *అన్ని కాలేజీలకూ న్యాక్ గ్రేడ్ ఉండేలా ప్రోత్సాహం : లింబాద్రి* రాష్ట్రంలోని అన్ని కాలేజీలకూ న్యాక్ గ్రేడ్ ఉండేలా ప్రోత్సహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. న్యాక్ గ్రేడ్ వల్ల కలిగే ప్రయోజనాలను కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. కొత్త నిబంధనలను కేంద్ర విద్యాశాఖ రూపొందిస్తున్నదని వివరించారు. న్యాక్ గ్రేడ్ ఉన్న కాలేజీలు, న్యాక్ గ్రేడ్ లేని కాలేజీలుగా విభజిస్తామని చెప్పారు.

No comments:

Post a Comment