Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

15 August 2024

"Intinta Innovator District Level Award-2024" Ravulapenta Kota. Naveen Kumar received the "District Innovator Award Nalgonda from Collector Narayana Reddy and SP Saratchandra Pawar ,IPS" Today 15th August On the occasion of 78th Independence Day in Nalgonda pared grounds, a Intinta innovato project :"Low Cost High Efficiency Agriculture Drone Sprayer" In today's era of technology integration in agriculture especially by spraying chemical fertilizers on crop by drone, timely and lowest cost to the farmers in the field of agriculture. Kota Naveen, Lecturer in Chemistry (PGT) Model School Bommalararam said that the agricultural yield can be obtained by using drones, the effect of the crop grown by spraying chemical fertilizers through drones is less on humans, the value of this drone in the market is almost high, and this device bringing in a form of Device will be available at a very low price. Villagers of Ravulapenta, and many co-teachers and friends of the Model School congratulated them by receiving this award.


ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా స్థాయి అవార్డును రావులపెంట కోట.నవీన్ కుమార్, నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి మరియు ఎస్పీ శరత్చంద్ర పవార్ చేతుల మీదుగా "డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డును" అందుకున్నారు. ఈ రోజు నల్గొండలో 78వ ఇండిపెండెంట్ దినోత్సవం సందర్భంగా ఇంటింటా ఇన్నోవేటర్- ఇంటికి ఒక శాస్త్రవేత్త ప్రాజెక్టు :"తక్కువ ధరలో ఎక్కువ సామర్థ్యం గల వ్యవసాయ డ్రోన్ పిచికారి విధానం" ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా వ్యవసాయం చేయడంలో ముఖ్యంగా రసాయనిక ఎరువులు డ్రోన్ ద్వారా పంటపై పిచికారి చేయడం ద్వారా, రైతులకు సకాలంలో అతి తక్కువ ధరలోనే వ్యవసాయ రంగంలో డ్రోన్లని వినియోగించుకొని వ్యవసాయ దిగుబడిని తెచ్చుకోవచ్చని, డ్రోన్ల ద్వారా రసాయనిక ఎరువులు పిచికారి చేయడం ద్వారా పండిన పంట మానవులపై ప్రభావం తక్కువగా ఉంటుందని , మార్కెట్లో ప్రస్తుతం వినియోగిస్తున్న డ్రోన్ల విలువ ఎక్కువగా ఉంటుందని , అతి తక్కువ ధరలోనే ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నానని కోట నవీన్, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ(PGT) మోడల్ స్కూల్ బొమ్మలరామారం తెలిపారు. రావులపెంట గ్రామస్తులు, మరియు మోడల్ స్కూల్ సహాధ్యాపకులు, మిత్రులు పలువురు ఈ అవార్డు రావడం ద్వారా అభినందించారు


No comments:

Post a Comment