మేల్కొలిపిన ప్రజాకవి
నిత్య చైతన్యాన్ని రగిలించిన రవి
బ్రతుకంతా పోరాడిన ప్రజాకవి
కాళోజి అంటేనే ప్రశ్నించే తత్వం
కవిత్వంలో ఆయన కన్నీటి జలపాతం
ప్రజల గొడవనే తన గొడవగా
తెలంగాణ గుండెల మీద
ఉద్యమాల జెండగా ఎగిరేను
చరితకు విత్తనమై మొలకెత్తేను
ప్రజావాళికి రక్షణగా గొడుగై తీరేను
ఆపదొస్తే కరిగి కన్నీరయిండు
కోపమొస్తే బిగించి పిడికిలయిండు
భాష పట్ల బాధపడ్డోడు
తెలంగాణ యాసకు జీవం పోసిండు
కాళోజీ అంటే ఒక ఫినామినన్
పాలకుల గుండెల్లో నిద్రించిన
మరో ఫిరంగి
కాళోజీ అంటే సాక్షిభూతుడు కాదు
సాక్షాత్తు మానవుడు
ఆయనొక రస్సెల్
మరో ఖలీల్ జిబ్రాన్
ఈ కాలపు వేమన
అన్నింటికి మించి విశ్వ మానవుడు
--- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
ఫోన్ :9441561655
సెప్టెంబర్ 9 కాళోజి జయంతి సందర్భంగా....
No comments:
Post a Comment