కాలేజి పోరడంటే కాసు గీటు వీడు,
ముచ్చటైన మొనగాడు ముత్యమంటివాడు
ఇంటికెళ్లి బతిమాలితే కానీ,
ఇటువైపుకు చూడడు
అడిగినన్ని వాటికి ఔనంటే గాని అసలిక్కడ చేరడు ll
ప్రతిరోజూ రమ్మంటే కుదరనే కుదరదు
హాజరు ఫుల్లుగ ఇవ్వకుంటే నడవదు
ఎప్పుడంటే అప్పుడు లోనికిరానియ్యాలి
లేటు ఎందుకయ్యిందని నిలదీయ కూడదుll
మాటవరసకైనా ఫీజు మాట ఎత్తరాదు
స్కాలర్షిప్ లో మాత్రం రూపాయీ తగ్గరాదు
యూనిఫారంలో రమ్మని ఇబ్బంది పెట్టరాదు
చిరుగుల జీన్సు కసలు నో చెప్పనే చెప్పరాదుll
మీ పాటికి మీరు, చెప్పుకు పోవాలి తప్ప
ఏ నాడు మమ్మల్ని ప్రశ్నలు అడగరాదు
టెస్టులని మిడ్లు అని హింసించరాదు
మార్కులని, గ్రేడులని మనసు బాధపెట్టరాదు ll
అమ్మాయిలనేమన్నా అడ్డు చెప్పరాదు
అల్లరెంత చేసినా అదుపు చేయరాదు
సెల్ ఫోనులు తేవద్దని సూక్తి చెప్పరాదు
అవధి లేని అంతర్జాలం హక్కుగా ఇవ్వాలి ll
ఆటలకు పాటలకు అధిక సమయమివ్వాలి
పార్టీలకు మ్యాట్నీలకు పర్మిషన్లు ఇవ్వాలి
ఫంక్షన్లకు స్టేజీపైన గంతులెయ్యనియ్యాలి
ఏమున్నా లేకున్నా పరీక్షకి పంపించాలి
పాసైనా ఫెయిలైనా ప్లేస్ మెంటు చూపాలిll
రచన: టీ.యస్.వి.పద్మనాభం
No comments:
Post a Comment