Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

12 December 2024

*🔊📚19 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌* *🔶సొసైటీ ప్రతినిధుల వెల్లడి*

 ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను ఈ నెల 19 నుంచి 29వతేదీ వరకు నగరంలో నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో జరగనున్న ఈ పుస్తక ప్రదర్శనను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్టు సొసైటీ అధ్యక్షుడు యాకూబ్‌ షేక్, కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ తదితరులు బుధవారం వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికిపైగా ప్రచురణకర్తలు, పంపిణీదారులు  పుస్తకాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. ‘బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య, సభా కార్యక్రమాల వేదికకు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్‌ పేర్లతో నామకరణం చేశాం. సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాం. రచయితలు సొంత రచనలు, ప్రచురణలను పాఠకులకు పరిచయం చేసుకునేందుకు ప్రత్యేకంగా రైటర్స్‌ స్టాళ్లు కేటాయించాం. కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, విశ్రాంత ప్రొఫెసర్‌ ఆచార్య రమా మేల్కోటేలతో సలహా కమిటీని ఏర్పాటు చేశాం. తెలంగాణ రుచులతో ఫుడ్‌ స్టాళ్లనూ ఏర్పాటు చేస్తున్నాం. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నాం’ అని వెల్లడించారు.*

No comments:

Post a Comment