🔴 పత్రిక ప్రకటన | 15.02.2025
🔷విద్యార్థుల భవిష్యత్ కోసం అనుభవం కలిగిన హ్యాండ్ రైటింగ్ నిపుణుల చే ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రసారం చేయనున్నట్టు సీఈవో వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
🔷జర్మనీ లో విద్యనభ్యసించే ఇంజనీరింగ్ విద్యార్థులనుద్దేశించి ఇప్పటికే జర్మన్ లాంగ్వేజ్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని టి-సాట్ ప్రసారం చేసిందని గుర్తు చేశారు.
☎️ కాలిగ్రఫి పై సందేహాలకు 040-23540326/726 టోల్ ఫ్రీ నంబర్ 1800 425. 4039 లకు కాల్ చేయాలని సూచించారు.
📚 బుక్ రివ్యూ - ‘ పుస్తక సమీక్ష’
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచే విధంగా పుస్తకాల సమీక్ష (‘బుక్ రివ్యూ’) కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల నుండి నామినేషన్లు ఆహ్వానించిందని, రచయిత రచించిన పుస్తక సారాంశాన్ని సంక్షిప్తంగా వివరిస్తే, విద్యార్థులకు అదనపు జ్ఞానాన్ని అందించినవారమౌతామని, పుస్తక సమీక్షపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ తమ పేర్లతో కూడిన వివరాలను tsatnipuna@gmail.com కు మేయిల్ చేయడం లేదా 7337558051 ఫోన్ చేసి అందచేయాలని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్ది సూచించారు.
#TSAT #HandwritingSkills #Calligraphy #BeautifulHandwriting #EducationForAll #TelanganaEducation #BookReview #ReadingSkills #StudentDevelopment #TelanganaSchools #TSATInitiatives
No comments:
Post a Comment