Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

02 April 2025

*నల్లగొండ వన్ టౌన్ పిఎస్ పట్టణ పరిధి నిరుద్యోగ యువతీ యువకులకు ఒక గొప్ప అవకాశం* నల్లగొండ జిల్లా గౌరవ ఎస్ పి శ్రీ. శరత్చంద్ర పవార్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో *మిషన్ పరివర్తన్ యువ తేజం* కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తారీఖున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతీ యువకుల కోసం నిర్వహించబడుతుంది. ఇట్టి జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ యొక్క నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు పొందాలని వన్ టౌన్ పోలీస్ వారు కోరుతున్నారు. దీనికి నిరుద్యోగ యువతీ యువకులు చేయవలసింది 1. కనీస విద్య అర్హత పదవ తరగతి ఉండి వారి యొక్క వివరాలను పోలీస్ స్టేషన్లో వెంటనే నమోదు పరుచుకోవాలి. 2. వందకు పైగా కంపెనీలు, 2500 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించ నున్నాయి. 3. జాబ్ లో సెలెక్ట్ అయిన వారందరికీ, ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే అపాయింట్మెంట్ లెటర్ మంచి శాలరీ ప్యాకేజ్ తో ప్రకటించ బడుతుంది. 4. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రతి వార్డు నుండి కనీసం 20 మంది పైగా జాబ్ మేళాలో పాల్గొని అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తున్నాము 5. యువత ఖాళీగా ఉంటూ చెడు ధోరణి వైపు వెళ్లకుండా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ, వారి కుటుంబానికి సమాజానికి మేలు చేసేలా ఈ అవకాశం కలగజేస్తుందని ఆశిస్తున్నాము. ఇట్లు *వన్ టౌన్ ఇన్స్పెక్టర్* *నల్గొండ వన్ టౌన్ పిఎస్*

 


No comments:

Post a Comment