Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

11 April 2025

జానపదసాహిత్యం - పునర్మూల్యాంకనం ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ #అంతర్జాల_జాతీయసదస్సు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పాండిచ్చేరి, గుజరాత్... అన్ని ప్రాంతాలూ తెలుగు జానపద సాహిత్యానికి కాపుగాస్తున్న కన్నతల్లులే. ఒకప్పుడు జీవనసూత్రంగా నిలిచిన జానపదం, ఆధునికసాహిత్యకాలంలో అశిష్టమని చిన్నబుచ్చబడ్డది. కానీ సర్వం విధ్వంసంగా మారుతున్న ప్రస్తుతకాలంలో మరోమారు ప్రజాసాహిత్యం వైపు మనం తొంగిచూస్తున్నము. కొత్త చూపుతో చూస్తున్నము. పాతదాన్నే కొత్తగచూసి ఊరటపడుతున్నము. కోల్పోయిన మంచిని తిరిగి పొందుటానికి ఆరాటపడుతున్నము. జానపదసాహిత్యంలోని వైజ్ఞానికసంపదను వెతుక్కుంటున్నము. జానపద విజ్ఞాన ప్రాసంగికతను పునర్వివేచన చేస్కుంటున్నము. ఈ ఆలోచనల సారసమాహారమే.. మన జానపదసాహిత్య అంతర్జాల సదస్సు. జానపదంలోని జ్ఞానపథాన్ని వెలికితీయగల పరిశోధకమిత్రులందరికీ... ఇదే మా సాదర ఆహ్వానం ! -తెలుగుశాఖ, ప్రభుత్వ డిగ్రీకళాశాల (స్వ.ప్ర.), సిద్దిపేట - తెలంగాణ.

 


No comments:

Post a Comment