1️⃣ తమ తెలివితేటల గురించి మాట్లాడరు
అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు.
2️⃣ విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు
తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు.
3️⃣ పరిష్కారంలో ముందుంటారు
తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో, సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు.
4️⃣ ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు
'మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు' అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు, తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్ధం చేసుకుంటారు.
5️⃣ డాట్స్ ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు
తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని సలుపు-తెలుపులుగా, మంచి-చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్ ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్ధం చేసుకుంటారు.
6️⃣ చాలా ప్రశ్నలు అడుగుతారు
తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు.
7️⃣ చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధ పెడతారు
తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్జెక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి అర్ధంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు.
8️⃣ లోతుగా అధ్యయనం చేస్తారు
తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్ధంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు.
9️⃣ ఇతరుల పనుల గురించి ఆలోచించరు
తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు.
🔟 చేసేముందు ఆలోచిస్తారు
తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్ధం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు.
'ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి' అని ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు చెప్పినట్లు తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు.
No comments:
Post a Comment