Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

18 May 2025

*మీ పిల్లలకు నేర్పించాల్సిన 16 నైపుణ్యాలు* **********+++++*********** 1. ఆత్మవిశ్వాసం ( Self Confidence) – తన మీద నమ్మకాన్ని పెంపొందించుకోవడం. 2. భావ ప్రకటన సామర్థ్యం ( Communication skills) – తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం మరియు శ్రద్ధగా వినడం. 3. భావోద్వేగాల నియంత్రణ ( Emotional Balance )– తన భావాలను మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం , నిర్వహించడం. 4. సమస్య పరిష్కారం ( Problem Solving )– సృజనాత్మకంగా మరియు సమర్థవంతంగా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం. 5. సమయ పాలన (Time Management ) – పనులను చక్కబెట్టడం మరియు సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం. 6. ఆర్థిక అక్షరాస్యత ( Financial Literacy ) – డబ్బు నిర్వహణ, బడ్జెటింగ్ మరియు సేవింగ్ గురించి అర్థం చేసుకోవడం. 7. ఆత్మ గౌరవం ( Self Respect ) – తనను తాను గౌరవించడం, ఇతరులతో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం. 8. తదాత్మ్యం ( Empathy ) – ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం. 9. స్వీయరక్షణ ( Self Defence ) – శారీరక మరియు మానసిక ధృఢత్వం , ఆత్మ రక్షణ కళలు ప్రాధాన్యత ఇవ్వడం. 10. నిర్ణయ సామర్థ్యం (Decision Making )– ఆలోచింపబడిన, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం. 11. నాయకత్వ లక్షణాలు ( Leadership) – ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఇతరులను ప్రేరేపించడం. 12. లక్ష్యాలు నిర్దేశం (Goal setting ) – స్పష్టమైన, సాధ్యమైన లక్ష్యాలను నిర్ధేశించుకోవడం, వాటి కోసం కృషి చేయడం. 13. తార్కిక ఆలోచన( Logical Thinking) – ప్రతి విషయాన్ని , సమస్యను తార్కికంగా ఆలోచించడం దాని ద్వారా అధిగమించడం, సానుకూలంగా నిలబడటం. 14. చర్చించడం ( Negotion ) – సమర్థవంతంగా చర్చించడం మరియు ఒప్పందాలను కుదుర్చుకోవడం. 15. జట్టుగా సాధించడం ( Team work ) – ఇతరులతో సహకరించడం మరియు సాధారణ లక్ష్యాలను చేరుకోవడం. 16. శాస్త్రీయ, హేతుబద్ధమైన ఆలోచన ( Scientific & Rational thinking) తన చుట్టూ వున్న ప్రపంచాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం, దేనిని గుడ్డిగా అనుసరించడం కాకుండా ప్రశ్నించడం ద్వారా హేతువు ( కారణం) కనుగొనడం.

No comments:

Post a Comment