Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

26 May 2025

సెల్ఫోన్ల నుంచి పిల్లల్ని కాపాడుకోవడం ఎలా? 📱🚫 'మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు' 😣📵 — ఒక తండ్రి ఆవేదన. 'మా పాపకు ఇన్స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు' 😩📸 — ఒక తల్లి ఆక్రోశం. 'స్కూల్కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు' 🎮📲 — ఒక టీచర్ ఫిర్యాదు. 'వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్ఫోన్లో చూసి నేర్చుకుంటున్నాం. ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నాం. చూస్తున్నాం. తప్పేంటీ?' 🤔📱 — ఈ తరం విద్యార్థి ప్రశ్న. --- సోషల్ మీడియాతోనే చిక్కు పిల్లల మీద స్మార్ట్ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. 🧠 న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హైద్ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. 📵 పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. 📊 వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది. 💔 --- సమస్య ఎక్కడ మొదలైంది? 🧩 ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. 🏃‍♂️ ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. 🧘‍♀️ కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. 🏢 ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. 🎮 పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. 👍 ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ ను ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. 🌐 పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. 🌪️ ఫలితంగా పిల్లలు స్మార్ట్ఫోన్ వలలో చిక్కుకుపోయారు. 🕸️📱 --- మారకపోతే ప్రమాదమే ⚠️ ప్రస్తుతం స్మార్ట్ఫోన్లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు Instagram, snapchat లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. 👦👧 అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. 💓 ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. 😟📉 ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 😔💔 ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. 📈 --- ఐదు అంచెల్లో పరిష్కారం ✅ 1️⃣ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. 🚫 పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది. ☎️ 2️⃣ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. ❌📱 బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. 💢 కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 👨‍👩‍👧‍👦🛡️ 3️⃣ పాఠశాలల్లోకి స్మార్ట్ఫోన్ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు. 📚✨ స్నేహితులతో సమయం గడుపుతారు. 👬👭 4️⃣ ఫోన్ దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్‌పై కోపం పెరుగుతుంది. 😠📵 ప్రాజెక్ట్ వర్క్ కోసం విద్యార్థులందరూ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి. 💻🎓 5️⃣ పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి. ⚽🏏 స్మార్ట్ఫోన్ కంటే స్వేచ్ఛాయుత ఆటవిడుపు గొప్పదని పిల్లలకు చూపించాలి. ✨ సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com 26.05.2024


 

No comments:

Post a Comment