N-CET ప్రవేశాలకు నోటిఫికేషన్
NIN NATIONAL INSTITUTE OF NUTRITION
ICMR-NINలో పీజీలో ప్రవేశాలకు ఆల్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్- 2025(N-CET)కు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్లో అర్హత సాధించినవారు ఎంఎస్సీ (అప్లైడ్ న్యూట్రీషన్), ఎంఎస్సీ( స్పోర్ట్స్ న్యూట్రీషన్) చేయవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో బీఎస్సీ అప్లైడ్ న్యూట్రీషన్, క్లినికల్ న్యూట్రీషన్& డైటిటిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషన్, ఫుడ్ సైన్స్ & క్వాలిటీ కంట్రోల్, హోంసైన్స్, హ్యూమన్ న్యూట్రీషన్, న్యూట్రీషన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్, స్పోర్ట్స్ న్యూట్రీషన్, స్పోర్ట్స్ సైన్స్, ఎంబీబీఎస్, బీడీఎస్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, EWS అభ్యర్థులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష జులై 6న నిర్వహిస్తారు. జులై 14న ఫలితాలు విడుదల చేస్తారు. అడ్మిషన్ కౌన్సెలింగ్ ఆగస్టు 19న నిర్వహిస్తారు.
NIN
No comments:
Post a Comment