Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

10 June 2025

దివ్యాంగులకు సహాయ ఉపకరణముల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కొత్తగూడెం జూన్ 10 ( తెలంగాణ చరిత్ర ):జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కొరకు అర్హులైన వారి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనిన పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు.రిట్రో ఫిట్టేడ్ మోటార్ వాహనాలు 51, బ్యాటరీ వీల్ చైర్లు 15 , మొబైల్ బిజినెస్ బ్యాటరీ వీల్ చైర్లు20 ,బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో 1 , హైబ్రిడ్ వీల్ చైర్ 5 , లాప్టాప్స్ 23 , టాబ్స్ 13 , 5G స్మార్ట్ ఫోన్ 3 ట్రై సైకిల్ వీల్ చైర్లు వినికిడి యంత్రాలు కొరకు ఆన్లైన్ ద్వారా https://tgobmms.cgg.gov.in దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు, అర్హతను అనుసరించి సహాయ ఉపకరణముల కొరకు ఈనెల 18లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చేసుకున్న దరఖాస్తులను జిల్లా సంక్షేమ శాఖ అధికారి మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం ఐ డి ఓ సి , గ్రౌండ్ ఫ్లోర్ 1 నందు దరఖాస్తులు అందించవలసిందిగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు ఇతర వివరముల కొరకు 63019 81960 .83310 06010. నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని వారు కోరుతున్నారు.

No comments:

Post a Comment