Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

17 August 2025

బాల్యపు గాయాలే భవిష్యత్ నిర్ణేతలు! పిల్లల భవిష్యత్తుకోసం తల్లిదండ్రులు చాలా తపన పడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కోచింగ్... ఇలా చేయాల్సిన దానికి మించి చేస్తారు. మార్కులు, ర్యాంకులతో పిల్లల విజయాన్ని కొలుస్తారు. కానీ మీ బిడ్డ జీవితంలో అతిపెద్ద విజయం ఎగ్జామ్ హాల్లో కాదు, తన మనసులో జరుగుతుంది. ప్రతి బిడ్డ మనసులో ఒక రిపోర్ట్ కార్డ్ ఉంటుంది. అది మార్కులకు సంబంధించినది కాదు, భావాలకు, అనుభవాలకు సంబంధించినది.

 

ఆ రిపోర్ట్ కార్డ్ లో భయం, నిర్లక్ష్యం, అవమానం లాంటివి ఉంటే, అవే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వీటినే సైకాలజీలో ‘కనిపించని గాయాలు’ అని పిలుస్తారు.

గత ఏడాది ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ ఫోబియాతో కౌన్సెలింగ్ కోసం వచ్చాడు. ఆ స్టూడెంట్ తో మాట్లాడాక తెలిసింది అతని భయానికి కారణం సబ్జెక్ట్ కాదు, 90శాతం కంటే తక్కువ మార్కులు వస్తే ‘నువ్వెందుకూ పనికిరావు’ అని తండ్రి తిట్టడమని. అందుకే అతనితో పాటు తండ్రికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చాను. మూడు నెలల్లో ఫోబియా మాయమైంది. 10 జీపీఏతో పదోతరగతి పాసయ్యాడు.

పరిశోధనలేం చెప్తున్నాయి?

అనుభవాలను బట్టి మెదడు వైర్ అవుతుంది. సురక్షితమైన, ప్రేమతో కూడిన వాతావరణంలో ఫోకస్, డెసిషన్ మేకింగ్ కు కారణమయ్యే మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ బాగా అభివృద్ధి చెందుతుంది. 

నిరంతరం భయంతో ఉంటే భయాన్ని నియంత్రించే అమిగ్డలా హైపర్ యాక్టివ్ అవుతుంది. 

బాల్యంలో అవమానం, నిర్లక్ష్యం, శారీరక లేదా భావోద్వేగ దౌర్జన్యం ఎదుర్కొన్న పిల్లలు నాలుగు రెట్లు ఎక్కువగా డిప్రెషన్, ఆందోళనకు గురవుతారని 17 వేల మంది పిల్లలపై జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు చదువులో వెనకబడతారు. పెరిగి పెద్దయ్యాక, కెరీర్ లో స్థిరత్వం లేకపోవడం, సంబంధాలలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 

బాల్యంలో ఎమోషనల్ కనెక్షన్ ఉన్న పిల్లలకే జీవితంలో, కెరీర్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువని హార్వర్డ్ స్టడీలో కూడా వెల్లడైంది. ఫార్చ్యూన్ 500 సీఈఓలలో 70శాతం మందికి సెక్యూర్ చైల్డ్‌హుడ్ ఉండటమే ఇందుకు పెద్ద ఉదాహరణ. 

కొనసాగే గురుతులు...

బాల్యంలో మనసుకైన గాయాలు కనిపించవు. కానీ వాటి పాటర్న్ పెద్దయ్యాక కూడా కనిపిస్తుంది.

🔹 బాల్యంలో ప్రేమ షరతులతో కూడినదైతే పెద్దయ్యాక అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. 

🔹 ఓటమిని అంగీకరించడం నేర్పించకపోతే, టాపర్ అయినా ఎగ్జామ్ ఫెయిల్ అవుతాననే భయంతోనే బ్రతికేస్తుంటాడు. 

🔹 ‘నువ్వెందుకూ పనికిరావు’ అనే మాటల మధ్య పెరిగిన బిడ్డకు ఎంత టాలెంట్ ఉన్నా పెద్ద అవకాశాలను తప్పించుకునే వ్యక్తిగా మారతాడు. 

తల్లిదండ్రుల అపోహలు

🔸 పిల్లల మంచికోసమే తిడుతున్నాం అనుకుంటారు. కానీ ప్రేమంటే భయమనే ప్రోగ్రామ్ ను బ్రెయిన్ లో ఇన్ స్టాల్ చేస్తున్నారనేది నిజం.

🔸 తిట్టినా పిల్లలు మర్చిపోతారనుకుంటారు. అది తప్పు. వాళ్లు మర్చిపోరు. అవి వారి అన్‌కాన్షస్ లో చేరి, జీవితంలో రిపీట్ అవుతాయి.

🔸 భారీ ఫీజులు చెల్లించి మంచి స్కూల్ లో చేర్పిస్తే సక్సెస్ గ్యారంటీ అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ఎమోషనల్ సేఫ్టీనే మొదటి పాఠశాల. అది పేరెంట్స్ నుంచే రావాలి. 

సెవెన్ స్టెప్స్...

1️⃣ ప్రతి పేరెంట్ తప్పులు చేస్తారు. అలాగని అపరాధభావంతో కుంగిపోకండి. ఆ ప్యాటర్న్ ను బ్రేక్ చేయండి.

2️⃣ మీరు ఈ రోజు మాట్లాడే మాటలు, మీ బిడ్డ ఇన్నర్ వాయిస్ అవుతుంది. అందుకే ఆ వాయిస్ ‘ఐ యామ్ గుడ్’ అని చెప్పేలా చూసుకోండి. 

3️⃣ మీరు మీ బిడ్డను ఇతరులతో పోల్చుతున్నారా? చిన్న చిన్న విషయాలకే తిడుతున్నారా? గాయం ఇక్కడే మొదలవుతుందని గుర్తించండి. 

4️⃣ విమర్శను కనెక్షన్ తో మార్చండి. ‘నువ్వు లేజీ’ అని కాకుండా, ‘నువ్వు అలిసిపోయినట్టున్నావ్, మళ్లీ మాట్లాడదాం’ అని చెప్పండి. కనెక్షన్ = కరెక్షన్ అని గుర్తుంచుకోండి. 

5️⃣ ఇంటిని సురక్షిత ప్రదేశంగా మార్చండి. నో జడ్జ్మెంట్ జోన్ క్రియేట్ చేయండి. ఫలితాలకే కాదు, ప్రయత్నానికీ సెలబ్రేషన్ చేయండి. 

6️⃣ ఏఐ యుగంలో మార్కులు కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ గెలిపిస్తుంది. పాత గాయాలు నయం చేయకపోతే, మీ బిడ్డ భవిష్యత్తనే సాఫ్ట్ వేర్ బగ్స్ తో నడుస్తుందని గుర్తించండి. 

7️⃣ మీ గతం మీ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తుంది. మీ ప్రవర్తన మీ బిడ్డ మనసుకు గాయాలు చేయవచ్చు. అందుకే మీ గాయాలు హీల్ అయ్యేందుకు థెరపీ తీసుకోండి. ఇదేమీ బలహీనత కాదు. బలం.


సైకాలజిస్ట్ విశేష్

17.08.2025

⭐ ఈ పోస్ట్ అవసరమైన వారికి చేరేందుకు షేర్ చేయండి. 

🤝 మరిన్ని సైకాలజీ, పేరెంటింగ్ పోస్టులకోసం నా ప్రొఫైల్ ఫాలో అవ్వండి. 


📲 WhatsApp Circle లో చేరండి – లింక్ https://chat.whatsapp.com/FEKI9OmR3d5DLQGvMuO4EW?mode=ac_t


👉 కౌన్సెలింగ్ కోసం www.psyvisesh dot com లో సెషన్ బుక్ చేసుకోండి.


#PsyColumn #PsyVisesh #PsyVishesh #GeniusMatrix #geniusmatrixhub #breakbuildbeyond #psychology #psychologyfacts #ParentingTips #parentinghacks #parenting #parents #parenthood #marks #mindset #mindsetmatters #mindsetiseverything #mindsetshift #children #childhood #childcare #childhoodmemories #childdevelopment

No comments:

Post a Comment