1. Socialism (సామ్యవాదం)
నాకు రెండు మేకలు ఉన్నాయి. నేను నీకు ఒకటి ఇస్తే అది సోషలిజం. అంటే సమానంగా పంచుకోవడం. నీకు అవసరం ఉందని భావించి, నా వద్ద ఉన్నదాన్ని పంచుకున్నాను.
2. Communism (కమ్యూనిజం)
ప్రభుత్వం నా రెండు మేకలను తీసుకెళ్ళి ప్రతిరోజూ నాకు రెండు కప్పుల పాలు ఇస్తే అది కమ్యూనిజం. అంటే వ్యక్తిగత ఆస్తి ఉండదు. రాజ్యం ఆస్తిని సొంతం చేసుకుని అవసరానికి అనుగుణంగా ప్రతివ్యక్తికి సమానంగా పంచుతుంది.
3. Capitalism (పెట్టుబడిదారీ విధానం)
నా మేకను నీకు అమ్మేస్తాను, నువ్వు దానిని ఎక్కువ ధరకు అమ్మి లాభం పడతే అది క్యాపిటలిజం. అంటే మార్కెట్, డీల్, వ్యాపారం.. లాభం కోసం తీసుకోవడం–ఇవ్వడం. ఇరువురూ లాభం చూసుకోవాలి. కానీ లోలోపల లాభనష్టాలు అసమానంగా ఉండే అవకాశం ఉంది.
ఉదా: రైతు 20 రూపాయలకు టమాటా అమ్ముతాడు.. మార్కెట్‌లో దానిని 100 రూపాయలకు అమ్మేస్తారు.
4. Imperialism (సామ్రాజ్యవాదం)
నేను నీ మేకను రహస్యంగా దొంగిలిస్తే, అది సామ్రాజ్యవాదం. అంటే నేరుగా దోపిడీ, దౌర్జన్యం. బలవంతం లేకుండా, మోసం చేసి దోచుకోవడం.
ఉదా: ఒక పెద్ద దేశం బలహీన దేశం దగ్గర ఉన్న బంగారం, చమురు లాక్కుంటుంది.
5. Fascism (ఫాసిజం)
నిన్ను ఒక్క దెబ్బతో చంపి నా మేకలను తీసుకెళ్తే, అది ఫాసిజం. అంటే నిరంకుశ హింసా పాలన. ఎవరు ఎదిరించినా సజీవంగా ఉంచరు. సూటిగా, రక్తపాతం ద్వారా దోచుకోవడం.
ఉదా: డిక్టేటర్ నా మాట వినకపోతే ప్రాణం వుండదు అని హింసతో పాలన నడిపిస్తాడు.
6. Democracy (ప్రజాస్వామ్యం)
మేకల మేత ఖర్చు వాటి పాల విలువ కంటే ఎక్కువైతే ఆకలితో ఉన్న మేకలను చంపి వాటి మాంసం, చర్మం అమ్ముతారు. రెస్టారెంట్ యజమాని దానిని 80% చౌక గొడ్డు మాంసంతో కలిపి చికెన్ చాప్స్‌గా అమ్మి లాభం పొందటం ప్రజాస్వామ్యం.. అంటే ఇక్కడ వాస్తవానికి ప్రజల అవసరాల కంటే మార్కెట్ లాజిక్, కార్పొరేట్ లాభమే ముఖ్యమవుతుంది. తప్పుడు లేబుల్స్, మోసాలు, కల్తీ చేసే వ్యవస్థ.
Socialism/Communism → పంచుకోవడం మీద దృష్టి.
Capitalism/Imperialism/Fascism → దోపిడీ, హింస మీద దృష్టి.
Democracy → మోసం, కల్తీ మీద దృష్టి.
తెలుగు అనువాదం
Joyful Jayakrishna
No comments:
Post a Comment