Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

01 September 2025

🔴 బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షలకు టి-సాట్ ఆన్ లైన్ స్పెషల్ కోచింగ్ 🔰సెప్టెంబర్ ఒకటి నుండి అక్టోబర్ మూడవ తేది వరకు 🔰35 రోజుల పాటు 100 ఎపిసోడ్స్ ఉదయం-సాయంత్రం



🔴 బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షలకు టి-సాట్ ఆన్ లైన్ స్పెషల్ కోచింగ్

🔰సెప్టెంబర్ ఒకటి నుండి అక్టోబర్ మూడవ తేది వరకు 

🔰35 రోజుల పాటు 100 ఎపిసోడ్స్ ఉదయం-సాయంత్రం

🔰 నిపుణ, విద్య ఛానళ్లలో ప్రతి రోజూ ప్రత్యేక ప్రసారాలు

- సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

(టి.సాట్-సాఫ్ట్ నెట్)

ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్ కంటెంట్ అందించే టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షలకూ స్పెషల్ డిజిటల్ కంటెంట్ అందిస్తోంది . దేశ వ్యాప్తంగా నిర్వహించే ఐ.బి.పి.ఎస్ పోటీ పరీక్షలకు తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు షెడ్యూలు ఖరారు చేసింది. టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రసారాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు

ఐబిపిఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) ఆధర్వంలో భర్తీ చేసే 10,227 పోస్టులలో తెలంగాణా రాష్ట్రానికి 261, ఆంధ్రప్రదేశ్ కు 367 పోస్టులు మొత్తం 628 ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాలకు కేటాయించబడ్డాయన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల యువత పోటీపరీక్షల్లో సముచిత స్థానం సంపాదించాలన్నదే టి-సాట్ లక్ష్యమని, అందుకోసం తెలుగు, ఇంగ్లీష్ లో డిజిటల్ కంటెంట్ అందిస్తున్నామని వేణుగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. 

అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన కాంపిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటితో పాటు పజిల్స్, పారా జంబుల్స్ తదితర ప్రధాన సబ్జెక్టులపై డిజిటల్ ప్రసారాలుంటాయని సీఈవో తెలిపారు. 

సెప్టెంబర్ ఒకటవ తేదీన నిపుణలో సాయంత్రం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు ఉదయం విద్యలో ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రసారమయ్యే డిజిటల్ పాఠ్యాంశాలు అక్టోబర్ మూడవ తేది వరకు 35 రోజుల పాటు 100 ఎపిసోడ్స్ ప్రసారాలు కొనసాగనున్నాయని వేణుగోపాల్ రెడ్డి వివరించారు.

🔴 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎన్.ఎం.ఎం.ఎస్

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థుల కోసం ఎం.హెచ్.ఆర్.డి (మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవెలప్ మెంట్) ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి రాబోయే నవంబర్ లేదా డిసెంబర్ నెలలో నిర్వహించే ఎన్.ఎం.ఎం.ఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్) అర్హత పరీక్ష కోసం విద్యార్థుల మేధో సామర్థ్యాన్ని పెంచేందుకు కంటెంట్ అందిస్తున్నామని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ ఒకటవ తేది నుండి విద్య ఛానల్ లో ఉదయం 11 నుండి 12 గంటల వరకు అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశ భాగాల చొప్పున 100 ఎపిసోడ్స్ డిసెంబర్ నెలలో నిర్వహించే పరీక్షల వరకు ప్రసారం చేయనున్నామని, మ్యాట్ అండ్ స్యాట్ కు సంబంధించిన ప్రధాన సబ్జెక్టుల పాఠ్యాంశాలపై డిజిటల్ లెసన్స్ ప్రసారమౌతాయని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్రభుత్వం అందించే ఉపకారవేతనానికి అర్హత సాధించేందుకు సిద్ధం కావాలని వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment