Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

19 October 2025

#మనకు ఎవరూ చెప్పని 21 జీవిత సత్యాలు:* 1. సమయం తిరిగి రావడం అనేది కుదరదు. 2. ప్రతీ ఒక్కరు మంచివాళ్ళు కాదు. 3. పరాజయం కూడా ఓ పాఠం. 4. నీకు నచ్చిన పనే చేయి. 5. నీ అభిప్రాయాన్ని అందరూ అంగీకరించరు. 6. నువ్వు మారాలనుకుంటేనే నీ జీవితం మారుతుంది. 7. పోటీ నీకు నీతోనే ఉండాలి. 8. కాసిన ప్రతి చెట్టుకు రాళ్లు పడతాయి 9. అందరూ నీ సక్సెస్‌ చూసి సంతోషించరు. 10. సంక్షోభాలు నిజమైన స్నేహితులను గుర్తించేస్తాయి. 11. పని అంటే చెప్పేది కాదు, చేసి చూపించాలి. 12. నువ్వు ఒప్పుకుంటేనే ఎవరైనా నిన్ను భాద పెట్టగలరు 13. అవకాశాలు నీకు ఎవరూ అందించరు. 14. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది. 15. అనుభవం అనేది గొప్ప గురువు. 16. అత్యాశ పతనానికి మార్గం. 17. నీ ఎదుగుదల చూసి కొందరు అసూయ పడతారు. 18. అరాచకుల మాటలు పట్టించుకోకు. 19. వేల మాటల కంటే ఒక్క పని గొప్పది. 20.ఎవరికీ నీ జీవితాన్ని కంట్రోల్ చేసే పని ఇవ్వకు 21. సంతోషం అనేది పుస్తకాలలో, మీడియాలో కాదు, నీలోనే ఉంది..*

 #మనకు ఎవరూ చెప్పని 21 జీవిత సత్యాలు:*

 1. సమయం తిరిగి రావడం అనేది కుదరదు.

 2. ప్రతీ ఒక్కరు మంచివాళ్ళు కాదు.

 3. పరాజయం కూడా ఓ పాఠం.

 4. నీకు నచ్చిన పనే చేయి.

 5. నీ అభిప్రాయాన్ని అందరూ అంగీకరించరు.

 6. నువ్వు మారాలనుకుంటేనే నీ జీవితం మారుతుంది.

 7. పోటీ నీకు నీతోనే ఉండాలి.

 8. కాసిన ప్రతి చెట్టుకు రాళ్లు పడతాయి 

 9. అందరూ నీ సక్సెస్‌ చూసి సంతోషించరు.

 10. సంక్షోభాలు నిజమైన స్నేహితులను గుర్తించేస్తాయి.

 11. పని అంటే చెప్పేది కాదు, చేసి చూపించాలి.

 12. నువ్వు ఒప్పుకుంటేనే ఎవరైనా నిన్ను భాద పెట్టగలరు 

 13. అవకాశాలు నీకు ఎవరూ అందించరు.

 14. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది.

 15. అనుభవం అనేది గొప్ప గురువు.

 16. అత్యాశ పతనానికి మార్గం.

 17. నీ ఎదుగుదల చూసి కొందరు అసూయ పడతారు.

 18. అరాచకుల మాటలు పట్టించుకోకు.

 19. వేల మాటల కంటే ఒక్క పని గొప్పది.

 20.ఎవరికీ నీ జీవితాన్ని కంట్రోల్ చేసే పని ఇవ్వకు 

 21. సంతోషం అనేది పుస్తకాలలో, మీడియాలో కాదు, నీలోనే ఉంది..*

నిత్యజీవితంలో 

మనచుట్టూ ఉన్నవారితో 

మనకుండే అభిప్రాయ బేధాలు చాలు.

ఇక్కడ కూడా అవెందుకు మనకు!?

తెలిసో,తెలియకో 

అపార్ధాలతోనో,

అనుమానాలతోనో 

మనం మన బంధాలను దూరంచేసుకొనే ముందు                           మన అంతరాత్మను 

ఏ కారణంతో మనం వీళ్ళతో వైరం పెంచుకుంటున్నాం                     అన్నది ప్రశ్నించుకుంటే 

సమాధానం ఖచ్చితంగా దొరికుతుంది.

లోపం ఎటువైపు ఉన్నా సరిదిద్దుకోవచ్చు.

అది సరిదిద్దుకోలేని లోపమే ఐతే 

మౌనంగా వారికి దారిచ్చి 

మనం ప్రశాంతంగా ఉండటమే ఉత్తమం!

అంతేతప్ప -

మన దైనందిన జీవితాల్లో

నిత్యం మనం ఎదుర్కొనే ఆటుపోట్లకు తోడు

ఇక్కడ కూడా మనకు తలపోట్లెందుకు!?

అందుకే మనకిక్కడ సరిపడని

బలవంతపు స్నేహాలూ వద్దు,

కలహాలను నింపే శత్రుత్వాలూ వద్దు.

మనసులు కలిస్తే

మమేకమై ప్రయాణించడం,

సరిపడదు అనుకుంటే

చిరునవ్వుతో పక్కకు వైతొలగడం

మనం అలవరచుకుందాం..*

 ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు అందరిలోనూ

ఏదో ఒక బాధ,కసి,టెన్షన్,భయం.

వాటి ప్రభావం ఎలా ఉంటుంది అంటే

 ఎవరి మీద నమ్మకం ఉండదు

ఎవరు అర్థం కారు అసలు వాళ్లకు వాళ్లే అర్థం అవ్వరు.ఎవరన్నా ప్రేమగా మాట్లాడినా నటిస్తున్నారేమో అనే అనుమానం మోసం చేస్తారేమో అనే భయం.అలా అని వాళ్ళని ఇంట బయట ఎవరు పట్టించుకోకపోతే నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనే కసి. తనకి ఏం కావాలి తన వాళ్లు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని నిర్ణయించుకోలేక

 నానా విధాలుగా మనిషి సతమతమవుతున్నాడు.

 ఈ బాధలకు కారణం ఎవరు ఆలోచించండి

మీకు అర్థమవుతుంది.అర్థం అవ్వట్లేద.

 అయితే చెప్తా వినండి.

ఇంకా ఎవరు మన జీవితం అలా అవటానికి కారణం మనమే.  ఎలా అంటారా దానికి కారణం

మన ఆలోచన విధానం మన కోరికలే.

 జీవితం అంటే మనల్ని మనం చూసుకోవడం కాదు మనల్ని మనం రూపుదిద్దుకోవడం.

జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండటానికి

నా శివయ్య నాకు ఇచ్చినా ఆలోచన 

మీకు చెబుతాను మీరు ఆచరించండి.


నటన అబద్దం ఈ రెండు నా జీవితంలో

ప్రాణం పోయినా నటించను ఆడను.


 నేను చేసేది మంచి అనుకోని కొన్ని సందర్భాల్లో నటిస్తాం.ఆ ఆలోచన చాలా తప్పు

నటన మానేయండి మీకోసం ఎవరో ఏదో అనుకుంటారని లేదా ఎవరికో మంచి జరుగుతుందని

 పిచ్చి పిచ్చి ఆలోచనలతో నటించకండి.

 నటనను మనస్సాక్షి ఒప్పుకోదు అది ఒప్పుకోక పోతే ఏమవుతుంది మనసు పదేపదే బాధపడుతూ ఉంటుంది అందుకే చెబుతున్న నటించకండి. ఆదిత్యయోగీ.

 చీటికీ మాటికీ చాలామంది అబద్ధాలు ఆడుతుంటారు చాలా పాపం తప్పు

అబద్ధాలు ఆడకండి. ఎక్కువగా డబ్బుల విషయంలో బంధాల విషయంలో అబద్ధాలు ఆడుతూ ఉంటారు.

ప్రాణం పోయిన ఆర్భాటాల కోసం గొప్పల కోసం డబ్బులు దగ్గర అబద్ధం ఆడకండి.

 డబ్బు ఉన్న  స్థాయిని బట్టి

 5 వేలతో తో బతకొచ్చు

50 వేలతో బతకొచ్చు

5 లక్షలతో బతకొచ్చు 

 లేనివాళ్ల 5 వేలు తో బతుకుతారు

ఉన్న వాళ్ళు 5 లక్షలతో బతుకుతారు

5 లక్షలు ఉన్న వాళ్ళు 5 వేల వాళ్ళని చూడొచ్చు

కానీ 5 వేల వాళ్లు 5 లక్షల వాళ్ళను చూడకండి.

5 వేల వాళ్లు 5 లక్షల వాళ్ళను ఎందుకు చూడకూడదు అంటారేమో.

 అయ్యో అందరినీ చూడొద్దు అనటంలేదు 

చూడొచ్చు ఎప్పుడు అంటే సంపాదించగలను సంపాదించాలని ఆ స్టేజ్ కి రావాలి అనే 

ఆత్మస్థైర్యం పట్టుదల ఉన్నప్పుడు.


 ఆ ఆత్మస్థైర్యం పట్టుదల లేనప్పుడు

 అబద్ధాలతో మోసాలతో డబ్బుకేసి చూడకండి 

ఉన్నంతలోనే హాయిగా ఉండండి.డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది మనిషిని అన్ని విధాలుగా ఆడిస్తుంది మనశ్శాంతి కోల్పోయేలా చేస్తుంది.


 అలాగే బంధల దగ్గర అబద్దం అసలు ఆడకండి 

ఏ బంధం అయినా  వదిలేయాల్సిన సమయం వస్తే

  రీజన్ చెప్పి వదిలేయండి. ఒకవేళ ఎదుటి వాళ్ళు వదిలేస్తే ఏ తప్పు జరిగింది అడగండి చెప్తే చెప్పారు లేకపోతే లేదు. అలా అడగటం అలా చెప్పటం తప్పేమీ కాదు భగవంతుడు ఆడించే ఆట ఆడుతున్నాం.వాళ్లు మనతో ఆడే ఆట అయిపోయింది.చక్కగా నవ్వుతు చేయి ఊపుతూ by చెబుదాం.అంతేగాని పదేపదే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ జీవితాన్ని నరకం చేసుకోవద్దు.

మీకు ఇష్టం అయితే ఎప్పుడున్న ఎక్కడన్నా కనిపిస్తే పలకరించండి.తప్పులేదు ఒకప్పుడు మన వాళ్లే కదా

మనం కోరుకున్న బంధమే కదా..*


#హద్దులు లేని విద్య *


పూర్వం అయోధ్యలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే గురువు ఒకడుండేవాడు. ఆయన దగ్గర ఎందరో శిష్యులు శిక్షణ పొందేవారు. ఆ గురువు రాజు గారి ఆస్థానంలో ఉద్యోగి కూడా. ఆయన శిష్యుల్లో మాణవకుడు అనే వాడొకడున్నాడు. వాడు గురువు దగ్గర శిక్షణంతా నేర్చుకున్నాడు. గురువు గారు కూడా తన దగ్గర ఎలాంటి విద్యామర్మం దాచుకోకుండా పూర్తిగా నేర్పాడు.


ఒకరోజు "గురువుగారూ! నేను రాజుగారి కొలు మలో చేరతాను" అని అడిగాడు మాణవకుడు. సరేనని గురువు ఈ విషయం రాజుతో చెప్పాడు. రాజు ఒప్పుకుని 'మీకు ఇచ్చే వేతనంలో సగం మాత్రమే ఇస్తాను' అని అన్నాడు. రాజు చెప్పిన మాటే శిష్యునితో చెప్పాడు గురువు.


"ఆచార్యా! ఇది అన్యాయం. నేనూ అన్ని విద్యలు నేర్చుకున్నాను. మీకు ఇచ్చేంత వేతనం ఇస్తేనే నేను కొలువులో చేరతాను" అన్నాడు శిష్యుడు.


ఈ విషయం రాజుకు తెలిసి శిష్యుణ్ణి పిలిపించి అడిగాడు. "అవును మహారాజా! నేను నా గురువుతో సమానమైన వాణ్ణి. కావాలంటే మీరు పరీక్షించి చూసుకోండి" అన్నాడు. "అయితే రేపే మీరిద్దరూ నా ముందు విద్యాప్రదర్శన చేసి చూపాలి" అన్నాడు రాజు. "అలాగే మహారాజా! ఈ విషయం చాటింపు వేయించండి. మహాజనం ముందు నా విద్యాప్రదర్శన చూపి స్తాను" అన్నాడు శిష్యుడు. శిష్యుని అహంకారం పోగొట్టి కళ్ళు తెరిపించాలనుకునానడు గురువు. తనకు వచ్చినదంతా నేర్పాడు. కాబట్టి ఏదైనా కొత్త విద్య కనిపెట్టాలనుకున్నాడు. వెంటనే ఏనుగుకి రాత్రికి రాత్రే 'విలోమచర్య' అనే విద్యను నేర్పాడు. విలో మచర్య అంటే వ్యతిరేక చర్య. 'నిలబడు' అంటే పడుకోవడం, పడుకోమంటే నిలబడటం. 'ముందుకు' వెళ్లమంటే వెనక్కి వెళ్ల డం...ఇలా నూతన శిక్షణ ఇచ్చాడు.ఆదిత్యయోగీ.


మరుసటి రోజు గురుశిష్యుల విద్యాప్రదర్శన జరిగింది. గురువు చేసినవన్నీ చేసి చూపాడు శిష్యుడు. కానీ విలోమ విద్య చూపలేకపోయాడు. తలదించుకున్నాడు.


"నాయనా! విద్యకు హద్దులు లేవు. పోటీ వల్ల మనం మరిన్ని నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి. నైపుణ్యాల్ని సృజించుకో వాలి. అలాంటి సృజనే విద్యకు అసలైన నిర్వచనం. నీవు మెలకువలు నేర్చుకున్నావు. సృజన పెంచుకోవాలి. దానికి అను భవం, ఓర్పు, నేర్పు కావాలి. అహంకారం లేని విద్యాభ్యాసకుడు మాత్రమే దాన్ని సాధిస్తాడు. నిన్నటి వరకు నా దగ్గరున్న దంతా నేర్పాను. ఈనాడు నీవల్ల నేను ఒక కొత్త విధానం రూపొందించుకున్నాను. ఈ విషయంలో నీవే నా గురువు" అన్నాడు. గురువు వినయంగా!.*

No comments:

Post a Comment