యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి మేర యువభారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం ద్వారా దేశం లోని యువతకు దేశ అత్యున్నత నాయకత్వానికి దేశాభివృద్ధి, అభివృద్ధి చెందిన దేశాన్ని సాధించడం కోసం తమ విలువైన ఆలోచనలు, సూచనలు ఇచ్చే అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని *ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల* యువతకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఈ క్రింది లింకులో ఉన్న:
https://mybharat.gov.in/quiz/quiz_dashboard/UzZIZmhEeWt6bmtzcGg1ZHQ1dWc3QT09
Vikasit Bharat Young Leaders Dialogue (VBYLD) 2026 లో భాగంగా *ఆన్లైన్ క్విజ్* ప్రోగ్రామ్ ద్వారా - 10 వేల మంది యువతను క్విజ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంపిక చేసి వారికి వివిధ స్థాయిల్లో బహుమతులు ప్రధానం చేస్తామని తెలిపారు.
అత్యన్నత ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా, రాష్ట్ర, దేశీయ స్థాయిలో ప్రభుత్వ ఖర్చులతో ఢిల్లీకి తీసుకెల్లడం జరుగుతుందని, చివరి అంకంలో దేశాభివృద్ధి, అభివృద్ధి చెందిన భారత్ కోసం దేశం అనుసరించాల్సిన వ్యూహం పై గౌరవ ప్రధానితో చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు. క్విజ్ పోటీలో పాల్గొనడం కోసం ఇంగ్లీష్ తో పాటు 12 భారతీయ భాషల్లో ఏదైనా ఒక భాష ఎంచుకొనవచ్చు.
ఇందుకు అర్హతలు:
1. మై భారత్ వెబ్సైట్ లింకు ద్వారా ఆన్లైన్ క్విజ్ లో పాల్గొనడం.
2. సెప్టెంబర్ 1,2025 నాటికి 15-29 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు అర్హులు.
3. ఆన్లైన్ ద్వారా మైభారత్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వడం ప్రధానం.
క్విజ్ పోటీల్లో అడగబోయే ప్రశ్నల కోసం:
1. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలతో పాటు మన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రస్తావించిన అనేక అంశాలు.
2. 2014 నుండి దేశం సాధించిన విజయాలు, ఘనతల పట్ల అవగాహన కలిగివుండటం.
3. ఒబెసిటీ పై అవగాహన
4. మారకద్రవ్యాల నిర్మూల.
5. ఆత్మ నిర్భర భారత్
6. వోకల్ ఫర్ లోకల్ అంశం.
పై సునిశిత అవగాహన కలిగి ఉంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించే సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మై భారత్, మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి, టి ఐజయ్య రంగారెడ్డి జిల్లా గారు పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment