Announcement!
కాళోజీ, దాశరథి, సినారె వంటి ఎంతోమంది సాహితీ సార్వభౌములకు నిలయమైనది మన తెలంగాణ!
ఈ గడ్డపై పుట్టి ఒక వెలుగు వెలిగిన అతిరథ మహారథులు ఎందరో.... అలాగే ఎంతో ప్రతిభ ఉండి కూడా చీకట్లో మగ్గుతున్న రచయితలెందరో..
అలాంటి తెలంగాణ రచయితలందరికీ ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవాల సందర్భంగా ఒక అద్భుత అవకాశం!
ఆపన్నహస్తం ఆధ్వర్యంలో..
“ తెలంగాణ యంగ్ రైటర్స్ కాంపిటీషన్-2025”
మీ ప్రతిభతో ఆకట్టుకునే కథనాలను రాసి, నగదు బహుమతిని గెలుచుకోవడంతో పాటు మాతో కలిసి పనిచేసే అవకాశం!
పోటీలో పాల్గొనేవారు ఈ మూడు విభాగాల్లో మీ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది.
1. సృజనాత్మక వ్యాసం
తెలంగాణ అంటే మీ దృష్టిలో ఏమిటి?
అనాదిగా ఈ నేల తన ప్రత్యేకతను ఎలా నిలుపుకుంటున్నదో మీ సొంత భావనలో వివరిస్తూ, 500 పదాలు మించకుండా వ్యాసాన్ని రాయండి
2. కాల్పనిక రచన
ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన కింది వాటిలో ఏదో ఒకదానిని ఎంచుకుని.. భవిష్యత్ తెలంగాణను అది ఏ విధంగా ఆవిష్కరిస్తుందని అనుకుంటున్నారో 500 పదాలు మించకుండా మీ అభిప్రాయాన్ని రాయండి
▪️భారత్ ఫ్యూచర్ సిటీ
▪️ మూసీ పునరుద్ధరణ
▪️ రీజినల్ రింగ్ రోడ్ (RRR)
▪️ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్
▪️ హైడ్రా
3. కవిత/పాట:
ప్రజా ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి, పాలనను వివరిస్తూ కవిత లేదా పాటను రాయండి. మీ పాట లేదా కవితను స్వయంగా మీరే పాడి కూడా పంపవచ్చు..
📌మీ రచనలను ఈ కింద లింక్ ద్వారా పంపగలరు.
https://forms.gle/Rg4V7TsuJDDRjMWdA

No comments:
Post a Comment