అధ్యాపక సోదర సోదరీమణులకు నమస్కారం 🌹🌹🤝🤝🙏.
03-01-2026 మాతా సావిత్రి భాయి ఫూలే 195 వ జన్మదినంను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించాలని భావిస్తున్నాం.
సావిత్రి భాయి ఫూలే గారి జీవితం గురించి నేటితరం యువత కు చేరాలనే ఉద్దేశ్యంతో
మరియు
ప్రతిభ, నైపుణ్యం ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలకు ఆర్థిక ప్రోత్సాహం చేస్తే ఉపయోగం పడుతుందని భావించి
మొదటి నగదు బహుమతి Rs. 50,000/- రెండవది 25,000/- మూడవది 15,000/- ఐదుమందికి ప్రోత్సాహక నగదు బహుమతులు 5,000/- రూపాయలు ఇవ్వాలని భావించాము.
కావున అందరం సమిష్టి బాధ్యత తీసుకొని కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరుకుంటున్నాం.
ప్రతి ప్రభుత్వ కళాశాల విద్యార్థినిలు వ్యాసరచన పోటీలో పాల్గొనేలా ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాం.
అలాగే గతంలో మాదిరిగా బీసీ మహిళా అధ్యాపకులకు సన్మానం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇంతటి మహత్తర కార్యక్రమంకు ప్రతి బీసీ బిడ్డ సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము.
ఇట్లు
వి నంద కుమార్
డా. బాల శ్రీనివాస్
No comments:
Post a Comment