తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి టీజీహెచ్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసకోవాల్సి ఉంటుంది.మొత్తం 859 పోస్టులను భర్తీ చేస్తుండగా. వీటిల్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే.
*పోస్టు పేరు - ఖాళీలు*
ఆఫీస్ సబార్డినేట్: 319
జూనియర్ అసిస్టెంట్: 159
ప్రాసెస్ సర్వర్: 95
కాపిస్ట్: 63
ఫీల్డ్ అసిస్టెంట్: 61
ఎగ్జామినర్: 49
టైపిస్ట్: 42
రికార్డ్ అసిస్టెంట్: 36
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 35
*మొత్తం ఖాళీల సంఖ్య - 859*
*విద్యార్హత:*
*అర్హత:* సంబంధించిన విభాగంలో 7,పదో తరగతి తరగతి, ఇంటర్,డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.అలానే తప్పకుండా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
*ఎంపిక:* కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) మరియు కొన్ని పోస్టులకు నైపుణ్య పరీక్ష (Skill Test/Typing) ద్వారా ఎంపిక చేస్తారు.
*జీతం:* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,900 నుండి రూ. 96,890 వరకు (పోస్టును బట్టి) వేతనం లభిస్తుంది.
*వయోపరిమితి:* 18 నుంచి 46 ఏళ్లు లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
*దరఖాస్తు ప్రక్రియ:* ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.600.. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ,ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 జనవరి 24.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 13.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(సీబీటీ),స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష: 2026,ఏప్రిల్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
No comments:
Post a Comment