Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

07 January 2026

సోషల్ మీడియా... మంచి టీచర్ కూడా!📱 ఇంటి వాతావరణం ఎలా ఉంటే పిల్లలు అలా పెరుగుతారో, సోషల్ మీడియా వాతావరణం కూడా మన ఆలోచనలు, అలవాట్లు, లక్ష్యాలను అంతే వేగంగా మార్చగలదు. 🌱

 సోషల్ మీడియా... మంచి టీచర్ కూడా!📱

ఇంటి వాతావరణం ఎలా ఉంటే పిల్లలు అలా పెరుగుతారో, సోషల్ మీడియా వాతావరణం కూడా మన ఆలోచనలు, అలవాట్లు, లక్ష్యాలను అంతే వేగంగా మార్చగలదు. 🌱

ప్రపంచంలో 4.8 బిలియన్ మంది సోషల్ మీడియా వాడుతున్న ఈ సమయంలో దానిని చెడు అన్నవాళ్ళు ఒక వైపు. ❌

దాన్ని పూర్తిగా వదలలేని వాళ్ళు మరో వైపు. 🤷‍♂️

నిజం మాత్రం మధ్యలో ఉంది. ⚖️


సోషల్ మీడియా ఒక సాధనం మాత్రమే. 🛠️

అది మన సమయాన్ని, మనసును మింగేయగలదు లేదా మన ప్రగతిని వేగవంతం చేయగలదు. 🚀

దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే అసలు విషయం.


ఈ కాలమ్‌లో సోషల్ మీడియాను మన గ్రోత్, కెరీర్, మైండ్‌సెట్ అభివృద్ధి కోసం పాజిటివ్‌గా ఎలా మలచుకోవచ్చో చూద్దాం. 👇


1️⃣ సోషల్ మీడియా ఒక అద్దం 🪞

సోషల్ మీడియా ఎవరినీ కంట్రోల్ చేయదు.

అది కేవలం మిమ్మల్ని అద్దంలో చూపిస్తుంది.


మీరు ఏ కంటెంట్ చూస్తారో, ఆల్గోరిథం అదే రకమైన కంటెంట్ మీకు పంపిస్తుంది. 🔁

అందుకే నెగటివ్ కంటెంట్ ఉన్న పేజీలు, అసహ్యం, అవమానం, విభేదాలను పెంచే అకౌంట్లు, టైం వేస్ట్ చేసే మీడియా పేజీలు అన్‌ఫాలో చేయండి. 🚫


ఫీడ్‌ని శుభ్రం చేయడం అంటే మనసును శుభ్రం చేసుకున్నట్టే. 🧹🧠


2️⃣ మీ ఫీడ్ మీ కోచ్ 🎓

సైకాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, కెరీర్ గ్రోత్, లీడర్‌షిప్ వంటి అంశాలను నేర్పించగల పేజీలను ఫాలో చేయండి. 📚


అవి రోజూ మీకు ఎన్నో విషయాలు చేర్పిస్తాయి.

రోజుకు ఐదు నిమిషాలు నేర్చుకున్నా ఒక సంవత్సరం లో 30 గంటల విద్యను ఇస్తుంది. ⏳✨


3️⃣ తక్కువ చూడండి, ఎక్కువ క్రియేట్ చేయండి ✍️

సోషల్ మీడియాలో ఎక్కువ మంది కన్సూమర్స్, చాలా కొద్దిమంది క్రియేటర్స్.


మీరు నేర్చుకున్న పాయింట్లు, మీ ఫీల్డ్‌కు సంబంధించిన చిన్న చిన్న టిప్స్, మీ ప్రయాణం, మీ అభిప్రాయాలు, మీ పని ఫలితాలు, మీ స్కిల్స్… 🎯


ఇవన్నీ పంచుకోండి.

రోజుకు ఒక చిన్న పోస్టు రాసినా మీకు స్పష్టత వస్తుంది. 💡


4️⃣ మీ పోర్ట్‌ఫోలియో 💼

ఇప్పటి కంపెనీలు మీ రెస్యూమే కన్నా మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను ఎక్కువ చూస్తున్నాయి. 👀


మీరు ప్రతిరోజు నేర్చుకున్నది, చేసిన పని, మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్…

ఇవన్నీ పోస్ట్ చేస్తే మీ ప్రొఫైల్ ఒక చక్కని డిజిటల్ రెజ్యూమ్ అవుతుంది. 🌐


ఒక మంచి LinkedIn ప్రొఫైల్,

ఒక మంచి Instagram professional page,

ఒక మంచి YouTube ప్లేలిస్ట్ —

మీ భవిష్యత్ అవకాశాలను గట్టిగా మార్చగలవు. 🔑


5️⃣ కమ్యూనిటీలనుంచి నేర్చుకోండి 🤝

సోషల్ మీడియాలో మంచివాళ్ళు ఉన్నారు.

పొజిటివ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. 🌈


మీలా ఆలోచించే మంచి మైండ్‌సెట్ ఉన్నవాళ్లు ఉన్నారు.

రైటర్స్ గ్రూప్స్ ✍️

పేరెంటింగ్ కమ్యూనిటీలు 👨‍👩‍👧

సైకాలజీ పేజీలు 🧠

ఆంట్రప్రెన్యూర్ సర్కిల్స్ 🚀


ఇవి మీకు సపోర్ట్ ఇస్తాయి.

మీ ప్రయాణాన్ని ఒంటరితనం నుంచి బయటకు తీస్తాయి. 🌍


6️⃣ మంచి కామెంటేటర్ అవ్వండి 💬

కేవలం లైక్ కొట్టడం కంటే ఒక మంచి కామెంట్ చేయడం మీ డిజిటల్ ప్రెజెన్స్‌ను వేగంగా పెంచుతుంది.


మీ పేరును గుర్తుంచుకుంటారు.

మీ ఆలోచనల్ని గౌరవిస్తారు.

మీ ప్యాషన్‌ను చూడగలుగుతారు. 🔥


వంద అర్థంలేని లైక్స్ కన్నా ఒక అర్థవంతమైన కామెంట్ మీ గ్రోత్‌కి ఎక్కువ ఉపయోగపడుతుంది. 📈


7️⃣ లెర్నింగ్ ఇంజిన్ 🚂

YouTube, Instagram, LinkedIn —

ఇవన్నీ ప్రపంచంలోని ఉత్తమ నిపుణులు ఉచితంగా మార్గనిర్దేశం చేసే లైబ్రరీలాంటివి. 📚


రీల్స్‌లో సైన్స్ ఛానల్స్ 🔬

యూట్యూబ్‌లో కోచింగ్ 🎥

సైకాలజీ టాక్స్ 🧠

లింక్డిన్‌లో లీడర్షిప్ & కమ్యూనికేషన్ పోస్టులు 🗣️


ఇవి మీ ఆలోచనను మార్చుతాయి.


8️⃣ మీ మనసును కాపాడుకోండి 🛡️

సోషల్ మీడియా వల్ల పోల్చుకోవడం పెరుగుతుంది.

ఇదే డిప్రెషన్, యాంగ్జయిటీ, ఇన్‌సెక్యూరిటీకి మూలం. ⚠️


మనం చూసేది వాళ్ల హైలైట్ రీల్. 🎬

మనం అనుభవించేది నిజ జీవితం. 🌱


ఈ వాస్తవం గుర్తుంచుకుంటే సోషల్ మీడియా ప్రెజర్ 80 శాతం తగ్గుతుంది. 📉

9️⃣ సమయ పాలన ముఖ్యం ⏰

ఇంట్లో సింపుల్ రూల్ పెట్టుకోండి.

ఉదయం గంటసేపు — నో సోషల్ మీడియా 🌅

భోజన సమయంలో — నో స్క్రీన్ 🍽️

నిద్రకు గంటముందు — నో సోషల్ మీడియా 🌙

ఈ మూడు అలవాట్లు మీ

mental clarity ✨

emotional stability 💙

sleep quality 😴

అన్నింటినీ మెరుగుపరుస్తాయి.

✍️ సైకాలజిస్ట్ విశేష్

No comments:

Post a Comment