Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

17 March 2026

New courses 2026 | తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టే డిగ్రీ పీజీ కోర్సులివే..! తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

 New courses 2026 | తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టే డిగ్రీ పీజీ కోర్సులివే..!

తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి డిగ్రీ, పీజీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వస్తున్న మార్పులు, పరిశ్రమల అవసరాలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కోర్సులను తీసుకొస్తున్నారు. కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, డిఫెన్స్, ఏవియేషన్, టూరిజం, హెల్త్‌కేర్, బయోమెడికల్, మారిటైమ్‌ తదితర రంగాల్లో ఈ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలలు, యూనివర్సిటీలో కొత్తగా ప్రవేశపెట్టే ఈ కోర్సుల వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు.



డిగ్రీలో కొత్త కోర్సులు ఇవే..

బీఏ- డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌

బీఏ- ల్యాండ్‌, అగ్రికల్చర్‌ & రూరల్‌ డెవలప్‌మెంట్‌

బీబీఏ- హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ & హెల్త్‌ మేనేజ్‌మెంట్‌

బీబీఏ- ఎయిర్‌పోర్ట్‌, ఎయిర్‌లైన్‌, ఎయిర్‌స్పేస్‌ & ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌

బీబీఏ - మారిటైం టెక్నాలజీ, కామర్స్‌ & మేనేజ్‌మెంట్‌

బీబీఏ- ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సెక్యూరిటీ & మేనేజ్‌మెంట్‌

బీబీఏ- ట్రావెల్‌, టూరిజం & హాస్పిటాలటీ మేనేజ్‌మెంట్‌

బీకాం - ఫైనాన్స్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌)

బీకాం- ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ & అకౌంట్స్‌

బీకాం- ఈ- కామర్స్‌, ఎం-కామర్స్‌ & డిజిటల్‌ మార్కెటింగ్‌

బీఎస్సీ - డేటా సైన్స్‌& ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

బీఎస్సీ- క్లైమెట్‌ సైన్స్‌ & ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌

బీఎస్సీ - ఇన్‌స్ట్రుమెంటేషన్‌ (ఆనర్స్‌)- 4 ఏళ్లు

బీఎస్సీ - బయో ఇన్ఫార్మేటిక్స్‌ (ఆనర్స్‌) -4 ఏళ్లు

బీఎస్సీ - మెడికల్‌ మైక్రో బయాలజీ (ఆనర్స్‌) - 4 ఏళ్లు

బీఎస్సీ - బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్‌, బోటనీ/మైక్రో బయాలజీ/జువాలజీ/బయో కెమిస్ట్రీ/కెమిస్ట్రీ/న్యూట్రిషన్‌ & డైటిక్స్‌/ఫుడ్‌ సైన్స్‌ (ఏవైనా మూడు సబ్జెక్టులు)

బీఎస్సీ- కంప్యూటర్‌ సైన్స్‌ & సైబర్‌ సెక్యూరిటీ/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌/రోబోటిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్‌/డేటా సైన్స్‌ (మూడు సబ్జెక్టులు). ఈ సందర్భంగా ఆచార్య బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచం శరవేగంగా మారుతోంది. ఏఐ రాకతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యారంగంలో మూస, పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి సారథ్యం, మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. సముద్ర గర్భం నుంచి ఆకాశం వరకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే విద్యావ్యవస్థ అందుకనుగుణంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఈ క్రమంలో మారుతోన్న ప్రాధాన్యతలు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు కృషి చేస్తున్నాం. ఏఐ ట్యూటర్లనూ కొంత మేరకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఐఐటీ మద్రాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు అందించి, వారికి గొప్ప అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్‌ 2047 నినాదంతో ముందుకెళ్తున్నాం.  నీతి ఆయోగ్‌, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌, యునెస్కో, నాస్కామ్‌, ఓఈసీడీ వంటి ప్రఖ్యాంత సంస్థల అధ్యయనాలు, చేసిన కీలక సూచనల ఆధారంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త కోర్సులను రూపొందిస్తున్నాం.  2026 - 27 విద్యా సంవత్సరం నుంచే వీలైనంత వరకు ఈ కోర్సులను ప్రవేశపెట్టాలనే సంకల్పంతో కృషి చేస్తున్నాo అని అన్నారు. ఈ కార్యక్రమంలో  విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ ఈ. పురుషోత్తం, మహమూద్‌ అలీ, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్‌ పాల్గొన్నారు.

పీజీలో కొత్త కోర్సులు ఇవీ.. 

ఎంఏ- అడ్వాన్స్‌ డిఫెన్స్‌ & సెక్యూరిటీ స్టడీస్‌

ఎంఏ - ల్యాండ్‌ గవర్నెన్స్‌, అగ్రికల్చర్‌ & రూరల్‌ డెవలప్‌మెంట్‌

ఎంఏ- అడ్వాన్స్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ & హెల్త్‌ మేనేజ్‌మెంట్‌

ఎంఏ- మారిటైం టెక్నాలజీ & మారిటైం గవర్నెన్స్‌

ఎంఏ- ట్రావెల్‌, టూరిజం & హాస్పిటాలటీ మేనేజ్‌మెంట్‌

ఎంఏ- అడ్వాన్స్‌ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌లైన్‌, ఎయిర్‌ స్పేస్‌ & ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌

ఎంకాం: ఫైనాన్స్ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) & ఎమర్జింగ్‌ ఛాలెంజెస్‌

ఎమ్మెస్సీ- క్లైమెట్‌ సైన్స్‌ & ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌

ఎమ్మెస్సీ - మెడికల్‌ మైక్రో బయాలజీ

ఎమ్మెస్సీ - మెడికల్‌ ఇమ్యునాలజీ

ఎమ్మెస్సీ- సైబర్ సెక్యూరిటీ.

No comments:

Post a Comment