Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

16 July 2026

యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున ఫ్రీ కోచింగ్! యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువత కోసం ప్రత్యేకంగా ఫ్రీ కోచింగ్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్నామని, దీనికి సంబంధించిన అప్లికేషన్ లను ఆన్లైన్ ద్వారా 17వ జూలై నుంచి 7 ఆగష్టు వరకు స్వీకరిస్తారని, స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పది నెలల పాటు ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కలిగిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అన్నారు.

 యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున ఫ్రీ కోచింగ్!


యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువత కోసం ప్రత్యేకంగా ఫ్రీ కోచింగ్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్నామని,  దీనికి సంబంధించిన అప్లికేషన్ లను ఆన్లైన్ ద్వారా 17వ జూలై నుంచి 7 ఆగష్టు వరకు స్వీకరిస్తారని,  స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పది నెలల పాటు ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కలిగిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అన్నారు.


 తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి మార్గదర్శకత్వంలో సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధమవుతున్న యువతలో బిసి స్టడీ సర్కిల్ ద్వారా ఎంపికైన వారికి నెలకు 5 వేల రూపాయలను ,  పుస్తకాల కోసం ఏకమొత్తంగా 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోందని,  నిపుణులైన అధ్యాపక బృందం తో పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల సబ్జెక్టులపై సంపూర్ణ అవగాహన కలిగించే విధంగా కృషి చేస్తున్నామని,  కనుక తెలంగాణ యువత బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైటు tgbcstudycircle.cgg.gov.in సంప్రదించడం ద్వారా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ కలలను సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 


బోనాలు పండుగ ప్రారంభోత్సవ సందర్భంగా 

హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో "తెలంగాణ బోనాలు- చేతివృత్తుల వస్తువుల ప్రదర్శన" ను భారీ ఎత్తున ప్రారంభించిన మంత్రి వర్యులు ఇందులో ఏర్పాటు చేసిన బిసి స్టడీ సర్కిల్ స్టాల్ ను సందర్శించి వారు ప్రచురించిన "వార్షిక" పుస్తకాలను ప్రముఖులకు అందించారు. అలాగే బిసి స్టడీ సర్కిల్ కార్యకలాపాలు, ప్రవేశ సమాచారానికి  సంబంధించిన ప్రత్యేక బ్రోచర్ ను విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి యువత 

ఈ దిశగా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో సన్నద్ధం కావాలని, తెలంగాణ ప్రజా ప్రభుత్వం యువత కోసం వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లతో ముందుకు వస్తుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో  బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి బాలమాయాదేవి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, ఇతరులు పాల్గొన్నారు.

#tgbcesdtc

No comments:

Post a Comment