Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

09 February 2019

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సంస్థ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకుల కోసం ఈ నెల 12వ తేదీన ఉచిత శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్నట్లు బండ్లగూడ న్యాక్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నిజ లింగప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. 18 నుంచి 35 ఏండ్ల మధ్య నిరుద్యోగ యువతకు ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌, శానిటేషన్‌ విభాగాల్లో 3 నెలలపాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్‌లతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను ఎన్‌ఏసీ ట్రైనింగ్‌ సెంటర్‌ వికాస్‌ హై స్కూల్‌ ఎదురుగా ఉప్పుగూడ డివిజన్‌ నర్కీపూల్‌బాగ్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9440410459లో సంప్రదించాలని తెలిపారు.  

No comments:

Post a Comment