Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

06 February 2019

హైదరాబాద్‌లోని జాతీయ జీవ వైద్య పరిశోధన జంతు వనరుల సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌- 04, ల్యాబ్‌ అటెండెంట్‌- 12, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌- 04. మొత్తం ఖాళీలు- 20. అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 25.02.2019. వెబ్‌సైట్‌: www.narfbr.org సీడ్యాక్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌(డెవలపర్‌/ ఐఎస్‌ఎస్‌/ హైస్పీడ్‌ నెట్‌వర్కింగ్‌)- 07, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(ఈ లెర్నింగ్‌)- 01. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 37 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 15.02.2019. వెబ్‌సైట్‌: https://cdac.in/ అర్హత పరీక్ష సీటెట్‌-జులై 2019 జాతీయస్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హతకు నిర్వహించే సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-జులై 2019 ప్రకటనను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. అర్హత: పేపర్‌ 1, 2 పరీక్షను అనుసరించి సీనియర్‌ సెకండరీ, బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డీఈఎల్‌ఈడీ/ బీఈఎల్‌ఈడీ/ డీఎడ్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)/ బీఈడీ/ బీఎడ్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణత. బీఎడ్‌/ డీఎడ్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష విధానం: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. 1-5 తరగతుల(ప్రైమరీ స్టేజ్‌) అభ్యర్థులకు పేపర్‌ 1, 6-8 తరగతుల(ఎలిమెంటరీ స్టేజ్‌) అభ్యర్థులకు పేపర్‌ 2 రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 97 నగరాల్లో ఈ పరీక్ష జరుగనుంది. రాతపరీక్ష తేది: 07.07.2019. ఫీజు: జనరల్‌/ ఓబీసీలకు ఒక పేపర్‌కు అయితే రూ.700, రెండింటికి రూ.1,200; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ.350, రెండింటికీ రూ.600. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 05.02.2019. చివరితేది: 05.03.2019. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 08.03.2019. https://ctet.nic.in/ యూజీసీ నెట్‌- జూన్‌ 2019 దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అర్హత కోసం నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (యూజీసీ నెట్‌) జూన్‌-2019కు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో పేపర్‌-1, 2 ఉంటాయి. రిజిస్ట్రేషన్‌ తేదీలు: 2019 మార్చి 1 నుంచి 30 వరకు. ప్రవేశ పత్రాల డౌన్‌లోడింగ్‌ తేది: 15.05.2019. పరీక్ష తేదీలు: 2019 జూన్‌ 20, 21, 24, 25, 26, 27, 28. ఫలితాలు: 2019 జులై 9. వెబ్‌సైట్‌: https://ntanet.nic.in/ అప్రెంటిస్‌షిప్‌ మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌ఎల్‌) అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 73, డిప్లొమా అప్రెంటిస్‌- 07. ఇంజినీరింగ్‌ విభాగాలు: కెమికల్‌, కంప్యూటర్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, మెకానికల్‌, ప్రొడక్షన్‌. శిక్షణా కాలం: ఏడాది. అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 10.02.2019. వెబ్‌సైట్‌: http://mazagondock.in/ https://www.tejamedia.com/2019/02/0636.html?m=1

No comments:

Post a Comment