Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

05 December 2019

Combined Higher Secondary level 2019



సీహెచ్‌ఎస్‌ఎల్ 2019
ఇంటర్ పాసై జీవితంలో త్వరగా ప్రభుత్వ కొలువులో చేరాలనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం. గ్రేడ్ ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కొలువు. మంచి జీతభత్యాలు, భద్రమైన జీవితం. వీటన్నింటి సమాహారమే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామ్. 2019కి సంబంధించిన ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణు పాఠకుల కోసం...

సీహెచ్‌ఎస్‌ఎల్: కేంద్రంలోని పలు శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) పోస్టులను, పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం ప్రతి ఏటా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్)ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహిస్తుంది.

ఎవరు అర్హులు?

-ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, పీఏ/ఎస్‌ఏ, డీఈవో (సీ&కాగ్‌లో డీఈవో పోస్టులు తప్ప) పోస్టులకు ఇంటర్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
-సీ&కాగ్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మ్యాథ్స్‌తో సైన్స్ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత.
-18-27 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పేస్కేల్:-ఎల్‌డీసీ/జేఎస్‌ఏ పోస్టులకు రూ.5,200-20,200+ గ్రేడ్ పే రూ.1,900/-
-పోస్టల్ అసిస్టెంట్/ఎస్‌ఏ, డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.5,200-20,200+గ్రేడ్ పే రూ.2,400/-
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1), డిస్క్రిప్టివ్ పేపర్ (టైర్-2), స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్ (టైర్-3) ద్వారా చేస్తారు.
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

ముఖ్యతేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: 2020, జనవరి 10
-వెబ్‌సైట్: https://ssc.nic.inhttps://ssc.nic.in

టైర్-1 పరీక్ష విధానం:

-నాలుగు పార్ట్‌లుగా ఉంటుంది. కాలవ్యవధి 60 నిమిషాలు.
-పార్ట్-1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
-పార్ట్-2లో జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
-పార్ట్-3లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
-పార్ట్-4లో జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
-టైర్-1 పూర్తిగా ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులను కోతవిధిస్తారు.
-టైర్-1 పరీక్షను 2020, మార్చి 16 - 27 మధ్య నిర్వహిస్తారు.

No comments:

Post a Comment