ఒంటరిగా మనం చదవడం
నేర్చుకుంటే సమాజానికి నిన్ను
ఆత్మీయులుగా మార్చుతుంది
నలుగురితో కలిసి పంచుకుంటే
సమాజాన్ని మనకు స్వంతం చేస్తుంది
తనలో పొందు పరిచిన
ఒక్కొక్క అక్షరం
మన అభ్యున్నతికి మూలమంత్రం
ప్రతి పుట ఉన్నత మార్గానికి దిక్సూచి
అధ్యయనమైనా పరిశోధనైనా
వికాసమైనా వినోదమైనా
ఒకసారి తన హృదయాన్ని
ఆవిష్కరించి పరిశీలిస్తే..పఠిస్తే
కొత్త అనుభూతి..అభివృద్ధి తథ్యం
మనం ఇంకొకరిని గమనించాలన్నా
మనం మనల్ని అన్వేషించుకోవాలన్నా
పుస్తకాన్ని చదవడం కన్నా
గొప్ప అభిరుచి లేదన్నది వాస్తవం
జరిగిన తాతల ముచ్చట నీకు
నీ మాట భావితరాలకు తెలిపే
మహోన్నత వారధి పుస్తకం.
*ప్రపంచ పుస్తక దినోత్సవం*
సందర్భంగా..
మీకు శుభాకాంక్షలు.
**
23-4-2024
No comments:
Post a Comment