*💥మీకే ఎందుకు ఉద్యోగమివ్వాలి?*
*🍥ఇంటర్వ్యూకి వెళ్లిన అభ్యర్థికి అక్కడ తన లాంటి నిరుద్యోగులు పదుల సంఖ్యలో కనిపిస్తారు. మార్కెట్లో వ్యాపారికి తాను అమ్ముతున్న వస్తువుల్లాంటివే విక్రయించే దుకాణాలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. ఈ ప్రపంచమే పోటీమయం. నీకే ఎందుకు ఉద్యోగమివ్వాలి? నీ దగ్గరే ఎందుకు కొనాలి? అనే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగినవారిదే గెలుపు. మీకంటూ ఓ ప్రత్యేకత, మీదైన సొంత ముద్ర ఉన్నప్పుడే ఆ సమాధానం మీ వద్ద ఉంటుంది.*
*🎙️స్టిన్ నూర్మాన్, బిజినెస్ గ్రోత్ మెంటార్*
*💥సాధించడం కన్నా నిలబెట్టుకోవడం ముఖ్యం*
*🌀జీవితంలో డబ్బు, ఆరోగ్యం, ప్రతిష్ఠ లాంటి విలువైనవాటిని సొంతం చేసుకోవడం ఎంత కష్టమో వాటిని కాపాడుకోవడం అంతకన్నా కష్టం. నైపుణ్యాలకు తోడు శ్రమ తోడైతే ఎవ్వరైనా కోరుకున్నదాన్ని సాధించగలరు. కానీ వినయంగా వ్యవహరిస్తూ, వివేకంతో జీవించేవారే వాటిని నిలబెట్టుకోగలరు. అది చేతకాక తోకచుక్కలా రాలిపోయినవారు కోకొల్లలు.*
*🎙️డేనియల్ జహీద్, కాపీరైటర్*
*💥ఊహలతో మీ కలలను చంపుకోవద్దు*
*💠చాలా మంది అనవసర భయాలను ఊహించుకుంటూ తమ కలలను చంపేసుకుంటున్నారు. ఆ పని చాలా కష్టంగా ఉంటుందేమో, ఓడిపోతే నవ్వులపాలు అవుతామేమో అనుకుంటూ వచ్చిన అవకాశాలను దూరం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ మీ జీవితం గురించి పట్టించుకొనే తీరిక లేదని గ్రహించండి. ప్రతిదాన్ని ఎక్కువగా ఊహించుకోవడం వదిలేసి నిర్భయంగా మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి.*
*🎙️నిహారికా కౌర్ సోఢీ, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోచ్*
*💥బతకొద్దు.. జీవించండి*
*🥏మన జీవిత కాలం ఎంతనేది మన చేతుల్లో ఉండదు. కానీ మనం జీవించిన కాలం ఎంతనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. రెండింటి మధ్య తేడా ఏంటంటారా? ప్రాణం పోయినప్పుడు ముగిసిపోయేది జీవిత కాలం. కలలు, ఆశయాలనేవి లేకుండా, ఏదో సాధించాలన్న తపన, ఉత్సాహం కనిపించకుండా నిస్సారంగా రోజులు గడపడానికి అలవాటు పడిన క్షణంలోనే మనం జీవించిన కాలం ముగిసిపోయినట్లు. ఆ తర్వాత పేరుకు మాత్రమే బతుకుతుంటాం.*
*🎙️మథియస్ డెగర్డిన్, టెన్నిస్ ట్రైనర్*
No comments:
Post a Comment