Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

30 December 2025

హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నాం. ఈ నేపథ్యంలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)లో పౌరసేవలకు పునరంకితమవుతూ... పరిపాలనా యంత్రాంగానికి ఈ రోజు స్పష్టమైన దిశానిర్దేశం చేశాను.

 హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నాం. ఈ నేపథ్యంలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)లో పౌరసేవలకు పునరంకితమవుతూ... పరిపాలనా యంత్రాంగానికి ఈ రోజు స్పష్టమైన దిశానిర్దేశం చేశాను.

కీలకాంశాలు :

* నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో అతి సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. ఈ విషయంలో అలసత్వం వద్దు. జోనల్ కమిషనర్లు దీనికి బాధ్యత తీసుకోవాలి. ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే.


* నగరంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించాం. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి. 


* CURE పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని నిర్ణయించాం. నగరంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలి. 


* చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నెలకు మూడు రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదు. రోడ్లపై గుంతలు కనిపించొద్దు.


* జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర పౌరసేవలకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి.


* కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలి.


* హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు సమన్వయంతో పని చేయాలి. జనవరిలో నాలాల పూడిక తీత పనులు మొదలు పెట్టాలి. నగరంలో వీధి దీపాల నిర్వహణలో లోపం ఉండొద్దు. CURE ఏరియాలో వివిధ విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకోవాలి. 


*  దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్లు వారి పరిధిలో చర్యలు చేపట్టాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వీలయినంత వేగంగా స్పందించాలి. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి.


#VisionHyderabad #UrbanGovernance #TelanganaRising #cmrevanthreddy #anumularevanthreddy

No comments:

Post a Comment