టీవీ న్యూస్ చానల్స్ లో మొత్తం 5 రకాలు
*1)శాటిలైట్ చానల్*
*2)వెబ్ చానల్*
*3)ఆండ్రాయిడ్ చానల్*
*4)సోషల్ మీడియా చానల్*
*5)కేబుల్ టీవీ చానెల్*
*1)శాటిలైట్ చానల్* : ప్రసార కేంద్రం నుంచి శాటిలైట్ కు చేరి అక్కడ నుంచి మాస్టర్ కేబుల్ ఆపరేటర్ (MSO) సేకరించి వారికి అందుబాటులో ఉన్న కేబుల్ ఆపరేటర్ల ద్వారా వారి వినియోగదారులకు అందించడం జరుగుతుంది
*2)వెబ్ చానల్* : ప్రసార కేంద్రం నుంచి ఇంటర్నెట్ సదుపాయంతో వెబ్ సైట్ లోకి స్ట్రీమింగ్ ద్వారా వెబ్సైట్ వినియోగదారులకు అందించడం జరుగుతుంది.
*3)ఆండ్రాయిడ్ చానల్* : ప్రసార కేంద్రం నుంచి ఇంటర్నెట్ సదుపాయంతో స్ట్రీమింగ్ విధానంతో ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ప్రత్యేక యాప్ లు ఓటిటి యాప్ లు ద్వారా వినియోగదారులకు అందించటం జరుగుతుంది.
*4)సోషల్ మీడియా చానల్* : ప్రసార కేంద్రం నుంచి ఇంటర్నెట్ సదుపాయంతో సోషల్ నెట్వర్క్ లో స్ట్రీమింగ్ చేసి తద్వారా ఫేస్బుక్ యూట్యూబ్లో మాధ్యమాలలో వినియోగదారులకు అందించటం జరుగుతుంది.
*5)కేబుల్ టీవీ చానెల్* : సొంతంగా కేబుల్ టీవీ కేంద్రంలో ప్రసార కేంద్రం ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్న కేబుల్ టీవీలో ఇంజెక్ట్ చేసి మిగిలిన చానల్స్ తో కేవలం తమ వినియోగదారులకు మాత్రమే చూపించడం జరుగుతుంది.
1)వీటి మీద ప్రజలకు ప్రభుత్వ అధికారులకు సరియైన అవగాహన లేక రకరకాల అప్పోహాలు పడుతుంటారు. ఏది కరెక్ట్.. ఏది కరెక్ట్ కాదు.. ఎవరూ చెప్పలేరు. ఇవన్నీ వినియోగదారులకు అందించే సేవలే..
2)తెలిసి తెలియని మూర్ఖపు ఆలోచనలతో ఉన్నవారు నాది పెద్ద ఛానల్ లు నీది చిన్న ఛానల్ అని మాట్లాడుకోవడం వివేకవంతుల లక్షణం కాదు.
3)స్థానికంగా ఉన్న కేబుల్ టీవీ ద్వారా ఇచ్చే ఛానెల్స్ కొంతవరకు కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే వినియోగదారులకు అందించగలరు.
4)సాటిలైట్ ద్వారా మరియు ఇంటర్నెట్ ద్వారా అందించే ఛానెల్స్ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా చూపించడం జరుగుతుంది.
5)అలాగే సోషల్ మీడియా ద్వారా అందించే ఛానల్ కూడా ప్రపంచంలో అందరూ చూడవచ్చు.
6)ఈ విషయాలు తెలియక నీది పొట్టిది నాది పొడుగు అని పిచ్చి పిచ్చి బ్రమలతో ఒకరిని ఒకరు కామెంట్ చేసుకుంటూ వారికి వారే మోసపోతున్నారు..
No comments:
Post a Comment