Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

23 January 2026

పోస్టల్ శాఖలో 28,740 ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక, పరీక్ష లేదు! భారత పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల కోసం మొత్తం 28,740 ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రాంత వారీ పోస్టులు: తెలంగాణ: 519 ఆంధ్రప్రదేశ్: 1,215

 పోస్టల్ శాఖలో 28,740 ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక, పరీక్ష లేదు!

భారత పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల కోసం మొత్తం 28,740 ఖాళీలను భర్తీ చేయనుంది.

ప్రాంత వారీ పోస్టులు: 

తెలంగాణ: 519

ఆంధ్రప్రదేశ్: 1,215

ఎంపిక విధానం

ఎటువంటి రాత పరీక్ష లేదు.

అభ్యర్థుల పదో తరగతి (10th) మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక.

విద్యార్హత 

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత అవసరం.

వయోపరిమితి 

18 నుంచి 40 ఏళ్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో సడలింపు ఉంటుంది.

జీతం:

BPM: రూ. 12,000 – రూ. 29,380

ABPM / GDS: రూ. 10,000 – రూ. 24,470

దరఖాస్తు ఫీజు 

జనరల్ / OBC: రూ. 100

SC / ST / దివ్యాంగులు / మహిళలు: ఫ్రీ

నోటిఫికేషన్ & దరఖాస్తు:

ప్రారంభం: జనవరి 31, 2026

ముగింపు: ఫిబ్రవరి 14, 2026

మెరిట్ లిస్ట్ విడుదల: ఫిబ్రవరి 28, 2026

దరఖాస్తు విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇది ఒక సువర్ణావకాశం.

17 January 2026

 📢 IKS Outcome-Based Research Proposals 2026–27


The Indian Knowledge Systems Division, Ministry of Education, Government of India, invites applications under the IKS Competitive Research Proposals Program.


Last date: 30/01/2026

Apply here: https://iksindia.org/research-proposal-form.php



16 January 2026

User Awareness Programme on IRINS and INFLIBNET Services for Scholarly Communities organized by Information and Library Network (INFLIBNET) Centre Gandhinagar, Gujarat in collaboration with National Forensic Sciences University Goa Campus on February 23, 2026 at Goa.

 User Awareness Programme on IRINS and INFLIBNET Services for Scholarly Communities organized by Information and Library Network (INFLIBNET) Centre Gandhinagar, Gujarat in collaboration with National Forensic Sciences University Goa Campus on February 23, 2026 at Goa.

https://irins.org/flyers/nfsug.pdf

BA Hons Geography FREE Online Course| By Dr. VIGNESHWAR MEKHA, Head & Assistant Professor of Geography, Government Degree College for Women [autonomous], Begumpet, Hyderabad, Affiliated to Osmania University, Hyderabad. This course is provided in Audio-visual mode. Joining in this course has already started and the last date to Join this course is 28 February, 2026. The course will be launched on SWAYAM PORTAL on 6th January 2026 & end on 30 April 2026.

 https://youtu.be/2IsEbTeRs7Q?si=NX8OY6RvYd9zwRkR

BA Hons Geography FREE Online Course| 

By Dr. VIGNESHWAR MEKHA, Head & Assistant Professor of Geography, Government Degree College for Women [autonomous], Begumpet, Hyderabad, Affiliated to Osmania University, Hyderabad. 

This course is provided in Audio-visual mode.

*Join and share with others*.

 Join this course through  UGC website SWAYAM Portal We link provided below: https://onlinecourses.swayam2.ac.in/cec26_hs79/preview?user_email=cec26-hs79@cec2.swayam2.ac.in 

About the course Introduction video: https://youtu.be/2IsEbTeRs7Q?si=NX8OY6RvYd9zwRkR .

This FREE online course will be useful  for UPSC, TSPSC, APPSC, SSC, Gurukula, and other exam competitors.

Eminent professors from Delhi University, Aligarh Muslim University, Pule University, Goa University, Osmania University, Telangana University and Chakali Ilamma Women's University have contributed for this course. 

Joining in this course has already started and the last date to Join this course is 28 February, 2026. The course will be launched on SWAYAM PORTAL on 6th January 2026 & end on 30 April 2026.

This course is Presented by EMRC, OSMANIA UNIVERSITY, HYDERABAD.

With regards 

Dr Vigneshwar Mekha

📢 IKS Institutional Internship 2026–27 A unique opportunity for youth to engage in active research on Indian Knowledge Systems— ✔️ Learn through deep study of IKS ✔️ Work on real research projects ✔️ Contribute to knowledge dissemination in Bharatiya Bhashas 📅 Last Date: 30 January 2026.

 📢 IKS Institutional Internship 2026–27

A unique opportunity for youth to engage in active research on Indian Knowledge Systems

✔️ Learn through deep study of IKS

✔️ Work on real research projects

✔️ Contribute to knowledge dissemination in Bharatiya Bhashas

📅 Last Date: 30 January 2026

Apply here: https://iksindia.org/research-proposal-form.php



07 January 2026

సోషల్ మీడియా... మంచి టీచర్ కూడా!📱 ఇంటి వాతావరణం ఎలా ఉంటే పిల్లలు అలా పెరుగుతారో, సోషల్ మీడియా వాతావరణం కూడా మన ఆలోచనలు, అలవాట్లు, లక్ష్యాలను అంతే వేగంగా మార్చగలదు. 🌱

 సోషల్ మీడియా... మంచి టీచర్ కూడా!📱

ఇంటి వాతావరణం ఎలా ఉంటే పిల్లలు అలా పెరుగుతారో, సోషల్ మీడియా వాతావరణం కూడా మన ఆలోచనలు, అలవాట్లు, లక్ష్యాలను అంతే వేగంగా మార్చగలదు. 🌱

ప్రపంచంలో 4.8 బిలియన్ మంది సోషల్ మీడియా వాడుతున్న ఈ సమయంలో దానిని చెడు అన్నవాళ్ళు ఒక వైపు. ❌

దాన్ని పూర్తిగా వదలలేని వాళ్ళు మరో వైపు. 🤷‍♂️

నిజం మాత్రం మధ్యలో ఉంది. ⚖️


సోషల్ మీడియా ఒక సాధనం మాత్రమే. 🛠️

అది మన సమయాన్ని, మనసును మింగేయగలదు లేదా మన ప్రగతిని వేగవంతం చేయగలదు. 🚀

దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే అసలు విషయం.


ఈ కాలమ్‌లో సోషల్ మీడియాను మన గ్రోత్, కెరీర్, మైండ్‌సెట్ అభివృద్ధి కోసం పాజిటివ్‌గా ఎలా మలచుకోవచ్చో చూద్దాం. 👇


1️⃣ సోషల్ మీడియా ఒక అద్దం 🪞

సోషల్ మీడియా ఎవరినీ కంట్రోల్ చేయదు.

అది కేవలం మిమ్మల్ని అద్దంలో చూపిస్తుంది.


మీరు ఏ కంటెంట్ చూస్తారో, ఆల్గోరిథం అదే రకమైన కంటెంట్ మీకు పంపిస్తుంది. 🔁

అందుకే నెగటివ్ కంటెంట్ ఉన్న పేజీలు, అసహ్యం, అవమానం, విభేదాలను పెంచే అకౌంట్లు, టైం వేస్ట్ చేసే మీడియా పేజీలు అన్‌ఫాలో చేయండి. 🚫


ఫీడ్‌ని శుభ్రం చేయడం అంటే మనసును శుభ్రం చేసుకున్నట్టే. 🧹🧠


2️⃣ మీ ఫీడ్ మీ కోచ్ 🎓

సైకాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, కెరీర్ గ్రోత్, లీడర్‌షిప్ వంటి అంశాలను నేర్పించగల పేజీలను ఫాలో చేయండి. 📚


అవి రోజూ మీకు ఎన్నో విషయాలు చేర్పిస్తాయి.

రోజుకు ఐదు నిమిషాలు నేర్చుకున్నా ఒక సంవత్సరం లో 30 గంటల విద్యను ఇస్తుంది. ⏳✨


3️⃣ తక్కువ చూడండి, ఎక్కువ క్రియేట్ చేయండి ✍️

సోషల్ మీడియాలో ఎక్కువ మంది కన్సూమర్స్, చాలా కొద్దిమంది క్రియేటర్స్.


మీరు నేర్చుకున్న పాయింట్లు, మీ ఫీల్డ్‌కు సంబంధించిన చిన్న చిన్న టిప్స్, మీ ప్రయాణం, మీ అభిప్రాయాలు, మీ పని ఫలితాలు, మీ స్కిల్స్… 🎯


ఇవన్నీ పంచుకోండి.

రోజుకు ఒక చిన్న పోస్టు రాసినా మీకు స్పష్టత వస్తుంది. 💡


4️⃣ మీ పోర్ట్‌ఫోలియో 💼

ఇప్పటి కంపెనీలు మీ రెస్యూమే కన్నా మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను ఎక్కువ చూస్తున్నాయి. 👀


మీరు ప్రతిరోజు నేర్చుకున్నది, చేసిన పని, మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్…

ఇవన్నీ పోస్ట్ చేస్తే మీ ప్రొఫైల్ ఒక చక్కని డిజిటల్ రెజ్యూమ్ అవుతుంది. 🌐


ఒక మంచి LinkedIn ప్రొఫైల్,

ఒక మంచి Instagram professional page,

ఒక మంచి YouTube ప్లేలిస్ట్ —

మీ భవిష్యత్ అవకాశాలను గట్టిగా మార్చగలవు. 🔑


5️⃣ కమ్యూనిటీలనుంచి నేర్చుకోండి 🤝

సోషల్ మీడియాలో మంచివాళ్ళు ఉన్నారు.

పొజిటివ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. 🌈


మీలా ఆలోచించే మంచి మైండ్‌సెట్ ఉన్నవాళ్లు ఉన్నారు.

రైటర్స్ గ్రూప్స్ ✍️

పేరెంటింగ్ కమ్యూనిటీలు 👨‍👩‍👧

సైకాలజీ పేజీలు 🧠

ఆంట్రప్రెన్యూర్ సర్కిల్స్ 🚀


ఇవి మీకు సపోర్ట్ ఇస్తాయి.

మీ ప్రయాణాన్ని ఒంటరితనం నుంచి బయటకు తీస్తాయి. 🌍


6️⃣ మంచి కామెంటేటర్ అవ్వండి 💬

కేవలం లైక్ కొట్టడం కంటే ఒక మంచి కామెంట్ చేయడం మీ డిజిటల్ ప్రెజెన్స్‌ను వేగంగా పెంచుతుంది.


మీ పేరును గుర్తుంచుకుంటారు.

మీ ఆలోచనల్ని గౌరవిస్తారు.

మీ ప్యాషన్‌ను చూడగలుగుతారు. 🔥


వంద అర్థంలేని లైక్స్ కన్నా ఒక అర్థవంతమైన కామెంట్ మీ గ్రోత్‌కి ఎక్కువ ఉపయోగపడుతుంది. 📈


7️⃣ లెర్నింగ్ ఇంజిన్ 🚂

YouTube, Instagram, LinkedIn —

ఇవన్నీ ప్రపంచంలోని ఉత్తమ నిపుణులు ఉచితంగా మార్గనిర్దేశం చేసే లైబ్రరీలాంటివి. 📚


రీల్స్‌లో సైన్స్ ఛానల్స్ 🔬

యూట్యూబ్‌లో కోచింగ్ 🎥

సైకాలజీ టాక్స్ 🧠

లింక్డిన్‌లో లీడర్షిప్ & కమ్యూనికేషన్ పోస్టులు 🗣️


ఇవి మీ ఆలోచనను మార్చుతాయి.


8️⃣ మీ మనసును కాపాడుకోండి 🛡️

సోషల్ మీడియా వల్ల పోల్చుకోవడం పెరుగుతుంది.

ఇదే డిప్రెషన్, యాంగ్జయిటీ, ఇన్‌సెక్యూరిటీకి మూలం. ⚠️


మనం చూసేది వాళ్ల హైలైట్ రీల్. 🎬

మనం అనుభవించేది నిజ జీవితం. 🌱


ఈ వాస్తవం గుర్తుంచుకుంటే సోషల్ మీడియా ప్రెజర్ 80 శాతం తగ్గుతుంది. 📉

9️⃣ సమయ పాలన ముఖ్యం ⏰

ఇంట్లో సింపుల్ రూల్ పెట్టుకోండి.

ఉదయం గంటసేపు — నో సోషల్ మీడియా 🌅

భోజన సమయంలో — నో స్క్రీన్ 🍽️

నిద్రకు గంటముందు — నో సోషల్ మీడియా 🌙

ఈ మూడు అలవాట్లు మీ

mental clarity ✨

emotional stability 💙

sleep quality 😴

అన్నింటినీ మెరుగుపరుస్తాయి.

✍️ సైకాలజిస్ట్ విశేష్

06 January 2026

The Indian Knowledge Systems (IKS) Division, Ministry of Education, Government of India, invites applications for the IKS Competitive Research Proposals Program.

 #proposal 


 Call for Research Proposals | Indian Knowledge Systems (IKS)

The Indian Knowledge Systems (IKS) Division, Ministry of Education, Government of India, invites applications for the IKS Competitive Research Proposals Program.

🔍 This program supports original, in-depth, and high-quality scholarly research aimed at strengthening and rejuvenating research in Indian Knowledge Systems. Selected proposals will receive catalytic research grants to advance the IKS research mission.

🗓 Last date to apply: 30 January 2026

📝 Apply here: https://iksindia.org/research-proposal-form.php

Researchers and scholars working in IKS-related domains are encouraged to apply.



✨ Be a part of shaping the future of Indian Knowledge Systems research!

04 January 2026

⭐ సీయూఈటీ–పీజీ మార్గదర్శక వెబినార్ , మీకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ లేదా ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పీజీ చదవాలనే ఆకాంక్ష ఉంటే, తప్పనిసరిగా CUET-PG పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

 మీకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ లేదా ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పీజీ చదవాలనే ఆకాంక్ష ఉంటే, తప్పనిసరిగా CUET-PG పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

CUET-PG పరీక్ష గురించి అవగాహన కల్పించడం, పరీక్ష విధానం, సిద్ధత పద్ధతులు, కోర్సులు మరియు అడ్మిషన్ వివరాలను తెలియజేయడం కోసం మేము వెబినార్ నిర్వహిస్తున్నాము.

⭐ సీయూఈటీ–పీజీ మార్గదర్శక వెబినార్ ⭐

తెలంగాణ డిగ్రీ విద్యార్థుల కోసం

తేదీ: 05.01.2026

సమయం: సాయంత్రం 7:00 – రాత్రి 9:00 గంటలు

జూమ్ మీటింగ్ లింక్ 👇

https://us06web.zoom.us/j/74604173247?pwd=WZVL5py8biXCTKKDn8huCASUFEipTw.1

మీటింగ్ ID: 746 0417 3247

పాస్‌కోడ్: GDCKP



31 December 2025

టీవీ న్యూస్ చానల్స్ లో మొత్తం 5 రకాలు *1)శాటిలైట్ చానల్* *2)వెబ్ చానల్* *3)ఆండ్రాయిడ్ చానల్* *4)సోషల్ మీడియా చానల్* *5)కేబుల్ టీవీ చానెల్*

 టీవీ న్యూస్ చానల్స్ లో మొత్తం 5 రకాలు 

 *1)శాటిలైట్ చానల్* 

 *2)వెబ్ చానల్* 

 *3)ఆండ్రాయిడ్ చానల్* 

 *4)సోషల్ మీడియా చానల్* 

 *5)కేబుల్ టీవీ చానెల్* 

 *1)శాటిలైట్ చానల్* : ప్రసార కేంద్రం నుంచి శాటిలైట్ కు చేరి అక్కడ నుంచి మాస్టర్ కేబుల్ ఆపరేటర్ (MSO) సేకరించి వారికి అందుబాటులో ఉన్న కేబుల్ ఆపరేటర్ల ద్వారా వారి వినియోగదారులకు అందించడం జరుగుతుంది

 *2)వెబ్ చానల్* : ప్రసార కేంద్రం నుంచి ఇంటర్నెట్ సదుపాయంతో వెబ్ సైట్ లోకి స్ట్రీమింగ్ ద్వారా వెబ్సైట్ వినియోగదారులకు అందించడం జరుగుతుంది.

 *3)ఆండ్రాయిడ్ చానల్* : ప్రసార కేంద్రం నుంచి ఇంటర్నెట్ సదుపాయంతో స్ట్రీమింగ్ విధానంతో ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ప్రత్యేక యాప్ లు ఓటిటి యాప్ లు ద్వారా వినియోగదారులకు అందించటం జరుగుతుంది.

 *4)సోషల్ మీడియా చానల్* : ప్రసార కేంద్రం నుంచి ఇంటర్నెట్ సదుపాయంతో సోషల్ నెట్వర్క్ లో స్ట్రీమింగ్ చేసి తద్వారా ఫేస్బుక్ యూట్యూబ్లో మాధ్యమాలలో వినియోగదారులకు అందించటం జరుగుతుంది.

 *5)కేబుల్ టీవీ చానెల్* : సొంతంగా కేబుల్ టీవీ కేంద్రంలో ప్రసార కేంద్రం ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్న కేబుల్ టీవీలో ఇంజెక్ట్ చేసి మిగిలిన చానల్స్ తో కేవలం తమ వినియోగదారులకు మాత్రమే చూపించడం జరుగుతుంది.

1)వీటి మీద ప్రజలకు ప్రభుత్వ అధికారులకు సరియైన అవగాహన లేక రకరకాల అప్పోహాలు పడుతుంటారు. ఏది కరెక్ట్.. ఏది కరెక్ట్ కాదు.. ఎవరూ చెప్పలేరు. ఇవన్నీ వినియోగదారులకు అందించే సేవలే..

2)తెలిసి తెలియని మూర్ఖపు ఆలోచనలతో ఉన్నవారు నాది పెద్ద ఛానల్ లు నీది చిన్న ఛానల్ అని మాట్లాడుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. 

3)స్థానికంగా ఉన్న కేబుల్ టీవీ ద్వారా ఇచ్చే ఛానెల్స్ కొంతవరకు కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే వినియోగదారులకు అందించగలరు. 

4)సాటిలైట్ ద్వారా మరియు ఇంటర్నెట్ ద్వారా అందించే ఛానెల్స్ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా చూపించడం జరుగుతుంది.

5)అలాగే సోషల్ మీడియా ద్వారా అందించే ఛానల్ కూడా ప్రపంచంలో అందరూ చూడవచ్చు.

6)ఈ విషయాలు తెలియక నీది పొట్టిది నాది పొడుగు అని పిచ్చి పిచ్చి బ్రమలతో ఒకరిని ఒకరు కామెంట్ చేసుకుంటూ వారికి వారే మోసపోతున్నారు..

The UGC – Malaviya Mission Teacher Training Centre (MMTTC), National Institute of Educational Planning and Administration (NIEPA), New Delhi, proudly announces the Refresher Course (Online) E-content, MOOCs, Artificial Intelligence in Education February 09-22, 2026, 10.00 to 17.15 hrs. for the Faculty members of college and university (including Professors, Associate Professors, and Assistant Professors).


Refresher Course (Online) February 09-22, 2026, 10.00 to 17.15 hrs.

The UGC – Malaviya Mission Teacher Training Centre (MMTTC), National Institute of Educational Planning and Administration (NIEPA), New Delhi, proudly announces the Refresher Course (Online) February 09-22, 2026, 10.00 to 17.15 hrs. for the Faculty members of college and university (including Professors, Associate Professors, and Assistant Professors).

This Course is designed to provide in-depth insights into the E-content, MOOCs, Artificial Intelligence in Education and foster professional capacity building for educators and administrators in higher education.

All interested participants are invited to register and join this online program.

There is no registration fee.

Programme Title: Refresher Course (Online)

Program Dates:  February 09-22, 2026

Session Timings: 10.00 to 17.15 hrs.


As a mandatory requirement, all participants are required to register on the portal through https://www.niepa.ac.in/MMC/home or directly through the UGC portal from the following link: https://mmc.ugc.ac.in/registration/Index

30 December 2025

హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నాం. ఈ నేపథ్యంలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)లో పౌరసేవలకు పునరంకితమవుతూ... పరిపాలనా యంత్రాంగానికి ఈ రోజు స్పష్టమైన దిశానిర్దేశం చేశాను.

 హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నాం. ఈ నేపథ్యంలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)లో పౌరసేవలకు పునరంకితమవుతూ... పరిపాలనా యంత్రాంగానికి ఈ రోజు స్పష్టమైన దిశానిర్దేశం చేశాను.

కీలకాంశాలు :

* నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో అతి సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. ఈ విషయంలో అలసత్వం వద్దు. జోనల్ కమిషనర్లు దీనికి బాధ్యత తీసుకోవాలి. ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే.


* నగరంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించాం. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి. 


* CURE పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని నిర్ణయించాం. నగరంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలి. 


* చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నెలకు మూడు రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదు. రోడ్లపై గుంతలు కనిపించొద్దు.


* జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర పౌరసేవలకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి.


* కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలి.


* హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు సమన్వయంతో పని చేయాలి. జనవరిలో నాలాల పూడిక తీత పనులు మొదలు పెట్టాలి. నగరంలో వీధి దీపాల నిర్వహణలో లోపం ఉండొద్దు. CURE ఏరియాలో వివిధ విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకోవాలి. 


*  దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్లు వారి పరిధిలో చర్యలు చేపట్టాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వీలయినంత వేగంగా స్పందించాలి. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి.


#VisionHyderabad #UrbanGovernance #TelanganaRising #cmrevanthreddy #anumularevanthreddy

Govt Reorganizes Police Commissionerates 🚨 In line with GHMC expansion and the Telangana Rising 2047 vision, the Telangana Government has reorganized the police administration, constituting four Police Commissionerates to strengthen law & order and improve public service delivery.

 Govt Reorganizes Police Commissionerates 🚨

In line with GHMC expansion and the Telangana Rising 2047 vision, the Telangana Government has reorganized the police administration, constituting four Police Commissionerates to strengthen law & order and improve public service delivery.

🔹 Hyderabad Commissionerate: Assembly, Secretariat, Begumpet, Shamshabad Airport, Budvel High Court

🔹 Cyberabad Commissionerate: IT hubs including Gachibowli, Financial District, Nanakramguda, Madhapur, Raidurg, and major industrial areas such as Patancheru, Genome Valley, RC Puram, and Ameenpur

🔹 Malkajgiri Commissionerate (New): Keesara, Shamirpet, Quthbullapur, Kompally

🔹 Future City Commissionerate (New): Chevella, Moinabad, Shankarpally, Maheshwaram, Ibrahimpatnam, and surrounding areas


➡️ Yadadri–Bhongir district has been excluded from commissionerate jurisdiction and will function as a separate police unit with an SP.


This reorganisation aligns with GHMC zoning reforms and the CURE–PURE–RARE regional development strategy under Telangana Rising 2047.

The Government has also issued orders appointing Police Commissioners for all four Commissionerates.


#TelanganaRising2047 #PoliceReforms #GHMC #FutureCity #LawAndOrder #Telangana #iprtelangana Anumula Revanth Reddy

*దగ్గు నుంచి గుండెజబ్బుల వరకు ఈ ఒక్క పోస్ట్‌లో దాదాపు 30కి పైగా మొండి జబ్బులకు ఆయుర్వేద పరిష్కారాలు*

 *దగ్గు నుంచి గుండెజబ్బుల వరకు  ఈ ఒక్క  పోస్ట్‌లో దాదాపు 30కి పైగా మొండి జబ్బులకు ఆయుర్వేద పరిష్కారాలు*

ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన విలువైన జ్ఞానం.ఈ పోస్ట్ నా పబ్లిసిటీ కోసం కాదు అండి  మీ ఆరోగ్యం కోసం మాత్రమే.

కొంచెం ఓపికతో పూర్తిగా చదవండి.

మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. 🙏 

*శ్వాసకోశ వ్యాధులు*:-

1.జిల్లేడు మొగ్గను కషాయం బెట్టి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు-దమ్ము తగ్గుతాయి.

2.మిరియాల కషాయం లేదా అల్లం రసం తేనెతో కలిపి సేవించినా శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.

3.అడ్డసరం ఆకు కషాయం రోజు చెంచాడు తీసుకున్నా లేదా మద్దిచెక్క చూర్ణం పాలలో కలుపుకుని తీసుకున్నా ఫలితముంటుంది.

4.సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు-దమ్ము తగ్గుతాయి.

*రక్తహీనత*:

1.నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణం, చిటికెడు మిరియాల చూర్ణం, ఆవుపాలతో కలిపి సేవించాలి. క్రమంగా రక్తవృద్ధి జరుగుతుంది.

2.నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణాన్ని ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు రెండు చెంచాలు తినాలి.

4.విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగిన వాళ్ళు గలిజేరు ఆకును కూర లేదా పచ్చడిగా తీసుకుంటే మంచి ఫలితముంటుంది.

5.విష్ణుకాంత సమూలం నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. దానిని పాలతో కలిపి తీసుకుంటే రక్త క్షీణత తగ్గుతుంది.

*మూర్ఛ*:

1.తులసి ఆకురసం సైందవ లవణంతో కలిపి 1 లేదా 2 చుక్కలు వేస్తే స్పృహ వస్తుంది.

2.పసుపు పొడి పొగ వేసినా మూర్చ నుండి మెలకువ వస్తుంది.

3.తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛవ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి.

4.కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడాలి.

5.మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి 5 లేక 6 చుక్కల వావిలాకు రసం ముక్కులో వేస్తే ఫలితముంటుంది.

6.సీతాఫలం ఆకులు నలిపి వాసన చూపితే మూర్ఛ వ్యక్తికి మెలుకువ వస్తుంది. లేదా ఉల్లి రసం ముక్కులో వేసినా మంచి ఫలితం ఉంటుంది.

*తెల్లమచ్చలు*:

1.వేపకాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా నూరుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు అరతులం చొప్పున తింటే నలభై రోజుల్లో తెల్లమచ్చలు తగ్గుతాయి.

2.పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని తులసి ఆకుల రసంతో కలిపి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడుతాయి.

3.తంగేడు చెట్టు పట్టను ఆవుపాలలో దంచి తెల్లమచ్చల మీద రాస్తే తగ్గుతాయి.

*నిద్రలేమి*:

1.శతావరి చూర్ణం, బెల్లంతో కలిపి తింటే చక్కని నిద్ర వస్తుంది.

2.కలమంద నూనె తలకు మర్దన చేయాలి లేదా మోది చూర్ణం, బెల్లంతో కలిపి తిన్నా సుఖనిద్ర వస్తుంది.

3.మరాటి మొగ్గ పొడి చేసి పాలలో కలిపి పడుకునే ముందు తాగాలి. అలాగే, వేడి పాలు తాగినా సుఖనిద్ర వస్తుంది.

*నోటి సమస్యలు*:

1.లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.

2.వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి. 

3.పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.

4.నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.

5.లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.

6.గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూట ఇట్టే తగ్గిపోతుంది.

*తల తిప్పటం*:

1.అల్లం, ఉప్పు కలిపి పొద్దున తింటే తగ్గుతుంది.

2.10 గ్రాముల అల్లం, 10 గ్రాముల బెల్లం దంచి ముద్ద చేసి నోట్లో పెట్టుకోవాలి. దాని నుండి వచ్చే ఊటను మింగాలి. ఇలా వారం రోజులు చేస్తే తల తిప్పుట తగ్గిపోతుంది.

3.మునగ ఆకులు మిరియాలు కలిపి మెత్తగా నూరి తలకు పట్టువేస్తే తలదిమ్ము తగ్గుతుంది.

*రక్తపోటు* (బి.పి.):

1.సుగంధపాల, మారేడు కలిపి వాడితే బి.పి. అదుపులో ఉంటుంది.

2.మారేడు ఆకుల కషాయం రోజూ తాగాలి. లేదా రోజూ చెంచెడు కల్యమాకు రసం తాగినా రక్తపోటు నిలకడగా ఉంటుంది.

3.ఈశ్వరి వేరు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.

4.కాచి చల్చార్చిన నీటిలో అల్లం రసాన్ని కలిపి పొద్దున్నే తాగితే బి.పి. అదుపులో ఉంటుంద.

*మలబద్దకం*:

1.అరటి పండు రోజూ ఉదయం పరిగడుపున తింటే మలబద్దకం పోతుంది.

2.రాత్రి పడుకునే ముందు వేడి నీటితో త్రిఫల చూర్ణం తీసుకుంటే ఫలితముంటుంది.

3.రోజూ రెండుపూటల కలబంద గుజ్జు తింటే వారం రోజుల్లో ఈ సమస్యను అధిగమించవచ్చు.

*అతిమూత్రం నివారణకు*:

1.నేరెడు గింజల చూర్ణం 40 రోజులు పొద్దున చెంచాడు పొడిని నీళ్లలో కలిపి తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులో కొస్తుంది.

2.అరటిపండ్లు ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని అధిగమించవచ్చు.

3.ధనియాల కషాయంలో ఉప్పు కలిపి కొద్ది రోజులు తీసుకున్నా లేదా మెంతుల కషాయం తాగినా మంచి ఫలితముంటుంది.

4.వెల్లుల్లి రసాన్ని 15 రోజులపాటు తీసుకున్నా అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది.

5.కామంచి గింజల చూర్ణం కషాయం కాచి తాగినా అతిమూత్రం తగ్గుతుంది. అంతేకాదు, మధుమేహం వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.

6.మర్రిచెక్క కషాయం లేదా మెంతుల కషాయం క్రమం తప్పకుండా తీసుకున్నా మంచి ఫలితముంటుంది.


*తల వెంట్రుకలు పెరుగడానికి*

1.మందార పువ్వులు,మైదాకు, కలమంద గుజ్జు, నల్ల నువ్వుల నూనెలో వేసి కాచి వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా పెరగడమే కాదు తలనొప్పి కూడా తగ్గుతుంది.

2.కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టు నల్ల నువ్వుల నూనెలో కాచి పెట్టుకున్నా వెంట్రుకలు పెరుగుతాయి.

3.గుంటగలగర ఆకురసం నువ్వుల నూనెలో వేడి చేయాలి. తర్వాత తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి.


*ఉబ్బసం*:

1.తెల్ల జిల్లేడు పువ్వుల చూర్ణాన్ని బెల్లంతో కలిపి తింటే ఉబ్బసం తగ్గుతుంది.

2.అడ్డసరం ఆకులు ఎండబెట్టి చూర్ణం చేయాలి. అందులో శొంఠి, మిరియాల చూర్ణాలు కలిపి దానిలో తిప్పతీగ రసంతో మాత్రలు తయారు చేసి వీటిని ఇరవై రోజులు వాడితే ఎంత ఉబ్బసం, ఆయాసం ఉన్నా తగ్గుతాయి.

3.వెల్లుల్లి రసం వేడి నీళ్లలో వేసి తాగినా లేదా మిరియాల చూర్ణం తేనెలో కలిపి సేవించినా ఫలితముంటుంది.

4.నేపాల గింజలు నిప్పుల మీద వేసి ఆ పొగ పీలిస్తే ఉబ్బసం తగ్గుతుంది.


*గుండెజబ్బులు*:

1.తేనె వేడి నీళ్లలో కలిపి తాగితే గుండె జబ్బులు దరిచేరవు.

2.మద్ది చెక్క (తెల్లది) యష్టిమధుక చూర్ణాలను కలిపి నీళ్లలో కలుపుకుని తాగితే గుండె జబ్బులను నివారించవచ్చు.

3.స్వచ్ఛమైన తేనె అంటే వేప చెట్టుకు పెట్టిన తేనె తుట్టె నుంచి తీసింది.

4.మనం తీసుకునే ఆహారం వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించాలి.


*ఎసిడిటీ*:

1.ఎసిడిటీకి దూరంగా ఉండాలనుకుంటే వేపుడు కూరలు, మసాలాలతో చేసిన వంటకాలను మానేయాలి.

2.పచ్చబొట్టు ఆకు, నాగదమని ఆకు రెండూ కలిపి దంచిన ముద్దను తిన్న తరువాత గ్లాస్ నీళ్ళు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.

3.దానిమ్మ రసం తీసుకుంటే ఎసిడిటీ రాదు. ఒకవేళ ఉన్నా తగ్గుతుంది. రోజూ అరటి పండు తిన్నా ఫలితముంటుంది.

4.అల్లం ముక్క వేసిన పాలను బాగా మరిగించి తాగితే చక్కని ఫలితముంటుంది.

5.ఈ సమస్యతో బాధపడుతున్న వారు తరచూ మంచి నీళ్ళు తాగుతుండాలి.


*ఆకలి పుట్టడానికి*:

1.అల్లం ముక్కలు, సైందవ లవణం కలిపి భోజనానికి ముందు నమిలి ఆ రసాన్ని మింగితే ఆకలి పుడుతుంది.

2.మిరియాల చారుతో అన్నం తింటే ఆకలి లేదు అన్న సమస్యే రాదు.

3.నేపాళ గింజల చూర్ణం, జీలకర్రను చక్కెరతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి పుడుతుంది.

4.ఉత్తరేణి బియ్యం, మేకపాలలో కలిపి నూరి మాత్రలుగా చేసి పాలతో తీసుకుంటే ఆకలి ఆధిక్యాన్ని తగ్గించవచ్చు.


*అధిక రుతుస్రావం*:

1.ఉసిరికాయ, కరక్కాయ, రసాంజనం మూడింటినీ కలిపి చూర్ణం చేసి తాగితే నెలసరిలో అధికస్రావాలు తగ్గుతాయి.

2.ఇంటి ముందు అందం కోసం పెంచుకునే ఎర్రమందారం పువ్వులు కూడా ఆరోగ్య ప్రదాయనిగా పనిచేస్తాయి. ఈ పవ్వుల కషాయం తాగినట్లయితే అధిక రక్తస్రావం తగ్గిపోతుంది.


*కడుపు ఉబ్బరం*:

1.ఒక గ్రాము సైందవ లవణం, 5 గ్రాముల అల్లం కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

2.అన్నం తిన్న తర్వాత వాము, ఉప్పు కలిపి తీసుకున్నా ఈ సమస్యను అధిగమించ వచ్చు.


*తలవెంట్రుకలు ఊడిపోకుండా*

1.ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల వెంట్రుకలు రాలవు.

2.తల వెంట్రుకలకు కొబ్బరి నూనెలో కలమంద గుజ్జు కలిపి వేడి చేసి రాయాలి. ఇది వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది.

3.బాధం, కరక్కాయ నూనె రాసినా కూడా మంచి ఫలితముంటుంది.


*దంత సమస్యలు*:

1.నల్ల నువ్వులు తిని వెంటనే నీళ్ళు తాగితే కదులుతున్న దంతాలు గట్టి పడుతాయి.

2.వేపపుల్లతో పండ్లు తోమినా దంతాలు పటిష్టంగా ఉంటాయి.

3.జిల్లేడు పాలను నొప్పి ఉన్న పన్నుపై వేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.


*కాళ్ళ పగుళ్ళు*:

1.పసుపు, నువ్వుల నూనె కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.

2.మెంతులు, మైదాకు కలిపి రుబ్బి పెట్టుకుంటే త్వరగా నయమవుతుంది.

3.మర్రిచెట్టు పాలు పట్టి వేసినా చక్కని ఫలితం ఉంటుంది.

4.త్రిఫలచూర్ణం వాడితే పగుళ్ళు రావు.


*అజీర్ణం*:

1.రోజూ రెండు కప్పుల పెరుగు తింటే అజీర్ణం రాదు.

2.ఉల్లిగడ్డను కాల్చి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరి తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కసారి వారం రోజులు చేస్తే మరీ మంచిది.

3.జీలకర్ర కషాయం తాగితే అజీర్ణపు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

4.నేల తంగెడు చూర్ణం 1 లేదా 2 చెంచాలు అల్లం రసంతో కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.


*అతి బరువు* (ఊబకాయం):

1.రోజుకు రెండు కరివేపాకు రెమ్మలు తింటే ఒబేసిటి రాదు. పచ్చి కూరగాయల సూపు తాగినా ఫలితం ఉంటుంది.

2.కలమంద గుజ్జులో పసుపు కలిపి పరిగడుపున తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.


*అలసట*:

1.రోజువారీ జీవితంలో అందరూ ఎదుర్కొనే సమస్య అలసట. దీనిని అధిగమించేందుకు ద్రాక్షపండ్లు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తినాలి. 

2.అలాగే, ఖర్జూర పండ్లను కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి తింటే చాలా మంచిది.

3.బాదం పాలు కూడా అలసటను దూరం చేస్తాయి.


*నెలసరి నొప్పి*:


1.స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ఉత్తరేణి రసం రోజూ చెంచా చొప్పున మూడు రోజులు పరికడుపున తీసుకుంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.

2.టీ డికాషన్‌లో నిమ్మరసం పిండుకుని తాగినా ఉపశమనం కలుగుతుంది.

3.రేలకాయ గుజ్జు చూర్ణం చేసి గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే నొప్పి తగ్గడమే కాదు, నెలసరి క్రమపడుతుంది.


*తలనొప్పి*:


1.పొద్దున లేవగానే రాగి చెంబులో నిల్వ ఉంచిన నీళ్ళను తాగడం వల్ల తలనొప్పి రాదు. ఉన్న నొప్పి కూడా మటుమాయం అవుతుంది.

2.ఒక చెంచాడు మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తాగాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల వాతంతో వచ్చే తలనొప్పి తగ్గుతుంది.


*నడుం నొప్పి*:


1.రాత్రి పడుకునే ముందు వేడినీటిలో ఆముదం కలిపి తీసుకోవాలి. ఉదయం సుఖవిరేచనం అయి నడుం నొప్పి తగ్గుతుంది.

2.రస కర్పూరం, నల్లమందు, కొబ్బరి నూనెలో కలిపి నడుంకు రాస్తే ఫలితముంటుంది.


*బట్టతల*:


1.సీతాఫలం ఆకులు నూరి మేక పాలలో కలిపి తలకు రాస్తుండాలి. ఇలా చేయడం వల్ల బట్టతల తగ్గే అవకాశం ఉంది.

2.గురిగింజ ఆకురసం నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి తలకు రాసుకున్నా బట్టతల తగ్గే అవకాశం ఉంది.


*కీళ్ళ నొప్పులు*:


1.నొప్పి ఉన్న కీలుపై జిల్లేడు ఆకు వేడి చేసి కట్టాలి.

2.మిరియాలు, బియ్యం రెండింటిని బాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కడితే తగ్గుతుంది.

3.ఆహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తపడ్డా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.


*గుండె జబ్బులు*:


1.మంచి తేనె గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు మీ దరిచేరవు.

2.దానిమ్మ, పచ్చి ఉసిరికాయ రసం తాగినా కూడా హదయానికి ఎంతో మేలు చేస్తుంది.

3.మన ఆహార నియమాలతోనే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే, కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించడం చాలా మంచిది.

28 December 2025

*CUET–PG Orientation Webinar* ⭐ For Telangana Degree Students *Date: 30th December 2025* *Time: 7:00 PM – 9 :00 PM*, Organised by GDC Kukatpally.

 *Greetings from GDC Kukatpally*

⭐ *CUET–PG Orientation Webinar* ⭐

For Telangana Degree Students

*Date: 30th December 2025*

*Time: 7:00 PM – 9 :00 PM*

*Join Zoom Meeting*👇

https://us04web.zoom.us/j/74604173247?pwd=WZVL5py8biXCTKKDn8huCASUFEipTw.1

*Meeting ID: 746 0417 3247*

*Passcode: GDCKP

*Organised By:*

Government Degree College, Kukatpally

(Affiliated to Osmania University)

*In Collaboration With:*

Youth for Inclusive and Sustainable Society (YISS)

University of Hyderabad

*Programme Leads*

*G Kiran Kumar

National President 

All India OBC Students Association and PhD Scholar, Department of Political Science, University of Hyderabad

*Dr. R. Praveen Kumar Reddy*

Convenor, Career Guidance Cell

*Dr. Chandana N*

Chairperson & Principal

GDC Kukatpally 

📚 *Objective:*

To guide and support UG  students in understanding and preparing for CUET–PG 2026 and to help them plan their higher education pathways.


*Best wishes*

25 December 2025

మంచి మనిషి అవ్వడం అంటే డబ్బు, హోదా, చదువు కాదు… మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో అదే అసలైన అర్హత. కింద చెప్పిన గుణాలు ఉన్నవారు నిజంగా బెస్ట్ హ్యూమన్ అని చెప్పొచ్చు👇

 మంచి మనిషి అవ్వడం అంటే

డబ్బు, హోదా, చదువు కాదు…

మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో అదే అసలైన అర్హత.

కింద చెప్పిన గుణాలు ఉన్నవారు

నిజంగా బెస్ట్ హ్యూమన్ అని చెప్పొచ్చు👇

🌿 1. మానవత్వం (Humanity)

ఎదుటివాడు ఎవరో కాదు,

అతని పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని

సహాయం చేయగలగడం – ఇదే మానవత్వం.

ప్రయోజనం లేకుండా చేసిన సహాయం

దేవుడికే ఇష్టం.

🌿 2. దయ (Kindness)

ఒక చిరునవ్వు,

ఒక మృదువైన మాట,

ఒక చిన్న సహాయం…

ఎవరి జీవితాన్నైనా మార్చగల శక్తి దయకు ఉంటుంది.

దయ చూపించడం బలహీనత కాదు,

అది గొప్పతనం.

🌿 3. నిజాయితీ (Honesty)

ఎవరూ చూడకపోయినా

సరైనదే చేయగలగడం

నిజాయితీ గుణం.

డబ్బుతో కొనలేనిది

ఈ లక్షణం మాత్రమే.

🌿 4. ఓర్పు (Patience)

ప్రతి పరిస్థితిలోనూ

ఆత్మ నియంత్రణ కోల్పోకుండా

నిలబడగలగడం ఓర్పు.

ఓర్పు ఉన్నవాడే

జీవితంలో గెలుస్తాడు.

🌿 5. కృతజ్ఞత (Gratitude)

చిన్న సహాయానికైనా

హృదయపూర్వకంగా

“ధన్యవాదాలు” చెప్పగలగడం

మనిషిని మరింత గొప్పవాడిగా చేస్తుంది.

కృతజ్ఞత ఉన్న చోట

అహంకారం నిలవదు.

🌿 6. క్షమ (Forgiveness)

తప్పు చేసినవారిని

ఎప్పటికీ ద్వేషించకుండా

ముందుకు సాగగలగడం

క్షమ గుణం.

క్షమించడమంటే

మరిచిపోవడం కాదు,

మనసుకు భారాన్ని దించుకోవడం.

🌿 7. వినయం (Humility)

ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా

నేను గొప్పవాడిని అని

ఎప్పుడూ చెప్పుకోకపోవడం

వినయం.

నిజంగా గొప్పవాళ్లే

ఎప్పుడూ సింపుల్‌గా ఉంటారు.

🌿 8. సానుభూతి (Empathy)

ఎదుటివారి బాధను

మనదిగా భావించగలగడం

సానుభూతి.

మాటలకంటే ముందు

మనసుతో వినడం

మంచి మనిషి లక్షణం.

🌿 9. బాధ్యత (Responsibility)

తన మాటలకు, పనులకు

తానే బాధ్యత తీసుకోవడం

నిజమైన మగతనం / నిజమైన వ్యక్తిత్వం.

తప్పును ఒప్పుకోవడంలో

గొప్పతనం ఉంటుంది.

🌿 10. సంతృప్తి (Contentment)

ఎంతో ఉన్నా

ఇంకా కావాలి అనే ఆశతో కాదు,

ఉన్నదానిలో ఆనందం కనుగొనగలగడం

సంతృప్తి.

ఇది ఉంటే జీవితం ప్రశాంతం.

24 December 2025

The INFLIBNET Centre, Gandhinagar, Gujarat, with Providence Women’s College (Autonomous), Kozhikode, Kerala, are organizing a User Awareness Programme on ORCID, IRINS, and INFLIBNET Services on January 19, 2026, at Providence Women’s College (Autonomous), Kozhikode, Kerala.

 📢 Announcement!

The INFLIBNET Centre, Gandhinagar, Gujarat, with Providence Women’s College (Autonomous), Kozhikode, Kerala, are organizing a User Awareness Programme on ORCID, IRINS, and INFLIBNET Services on January 19, 2026, at Providence Women’s College (Autonomous), Kozhikode, Kerala. 

📝 Register on or before: January 15, 2026 

🔗 Registration Link: https://irins.inflibnet.ac.in/irins-outreach


Each participant has to submit a nomination letter from the HOD, institute, or research guide to register online.



#INFLIBNET #IRINS #SheRNI #ORCiD #ScholarlyCommunication #AwarenessProgramme

NEP Orientation and Sensitisation Programme (Online) January 12-20, 2026, 14.00 to 17.15 hrs. The UGC – Malaviya Mission Teacher Training Centre (MMTTC), National Institute of Educational Planning and Administration (NIEPA), New Delhi, proudly announces the NEP Orientation and Sensitisation Programme (Online) January 12-20, 2026, 14.00 to 17.15 hrs for the Faculty members of college and university (including Research Scholars, Professors, Associate Professors, and Assistant Professors).


NEP Orientation and Sensitisation Programme (Online) January 12-20, 2026, 14.00 to 17.15 hrs.

The UGC – Malaviya Mission Teacher Training Centre (MMTTC), National Institute of Educational Planning and Administration (NIEPA), New Delhi, proudly announces the  NEP Orientation and Sensitisation Programme (Online) January 12-20, 2026, 14.00 to 17.15 hrs for the Faculty members of college and university (including Research Scholars,  Professors, Associate Professors, and Assistant Professors).

This programme is designed to provide in-depth insights into the National Education Policy (NEP) 2020 and foster professional capacity building for educators and administrators in higher education.

All interested participants are invited to register and join this online program.

There is no registration fee.

Programme Title: NEP Orientation and Sensitisation Programme (Online)

Program Dates:  January 12-20, 2026

Session Timings: 14.00 to 17.15 hrs

As a mandatory requirement, all participants are required to register on the portal through https://www.niepa.ac.in/MMC/home or directly through the UGC portal from the following link: https://mmc.ugc.ac.in/registration/Index



Topic: Life and Movement of Mata Savitribai Phule - Relevance to Contemporary Society వ్యాస రచన పోటీ అంశం: మాతా సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర - నేటి సమాజానికి అన్వయింపు Venue : CSB IAS Academy Gandhinagar, RTC XRoads Hyderabad. Date : 28-12-2025 Sunday 2PM

 Essay Writing Competition 

Topic: Life and Movement of Mata Savitribai Phule - Relevance to Contemporary Society 

వ్యాస రచన పోటీ అంశం: 

మాతా సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర - నేటి సమాజానికి అన్వయింపు 

Venue : CSB IAS Academy Gandhinagar, RTC XRoads Hyderabad.

Date : 28-12-2025 Sunday 2PM

Rules and Regulations : (నియమ నిబంధనలు)

1.  Essay writing    should not exceed 2000 Words (వ్యాసరచన 2000 పదాలు మించకూడదు). 

2. Can be written in Telugu or English  (వ్యాసరచన తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో మాత్రమే వ్రాయాలి).

3. Students should reach the examination center at 1.00 PM on 28-12-2025 Sunday.( విద్యార్థులు పరీక్ష కేంద్రంకు 28-12-2025 మధ్యాహ్నం 1 గంటలలోపు చేరుకోవాలి)

4. Booklet will be provide in the Examination Hall to write the Essay.( వ్యాసరచన వ్రాయడానికి బుక్లేట్ పరీక్ష కేంద్రంలో ఇవ్వబడుతుంది).

5. Students should bring their ID Card without fail.( విద్యార్థులు ID కార్డు తప్పకుండా తీసుకొనిరావాలి)

6. Maximum 10  students from one Government degree College are alllowed.ఒక ప్రభుత్వ కళాశాల నుండి గరిష్టంగా 10 మంది విద్యార్థినిలు మించరాదు.

Share Google form to student gropus in respective colleges.

Registration through online : https://docs.google.com/forms/d/e/1FAIpQLScExPeH5B8FIXobSmL4zPrGMLjCCaWve8HNfgCRan0LcTozCw/viewform?usp=header

7. Prizes will be distributed to winners on 03-01-2026 Saturday in Hyderabad. (విజేతలకు బహుమతులు 03-01-2026 శనివారం రోజున హైదరాబాద్ లో ఇవ్వడం జరుగుతుంది).





22 December 2025

TG AP SET PAPER 1: TEACHING AND RESEARCH APTITUDE MODEL QUESTION PAPER WITH ANSWERS DEC 2025

 NTA NET TG AP SET MODEL PAPER1

https://docs.google.com/document/d/1t-rHIHSOt5rjvPzv5YEuh_AIg9d25kuM/edit?usp=drivesdk&ouid=109727980277120636556&rtpof=true&sd=true

చూడాల్సిన చారిత్రక పర్యాటక కేంద్రం-- రాష్ట్రపతి నిలయం!, RASHTRAPATHI NILAYAM, Hyderabad. ----- డాక్టర్ మామిడి హరికృష్ణ 8008005231.

 RASHTRAPATHI NILAYAM, Hyderabad.

చూడాల్సిన చారిత్రక పర్యాటక కేంద్రం-- రాష్ట్రపతి నిలయం!

                          -- డాక్టర్ మామిడి హరికృష్ణ 8008005231

రాష్ట్రపతి నిలయం అనే పేరే ఒక లాంటి వైబ్రేషన్! భారత రాజ్యాంగ అధినేతగా అత్యంత ఉన్నత స్థానంలో ఉండే ప్రముఖ పదవిగా, భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతినిధిగా ఉండే పదవి గా మనకు తెలుసు. అలాంటి రాష్ట్రపతి సాధారణంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఉంటాడనే విషయం కూడా మనకు తెలుసు. ఐతే రాష్ట్రపతి కి ఢిల్లీ తో పాటు, వేసవి విడిదికి, శీతాకాల విడిది కి వేర్వేరు సందర్భాలలో, దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఆయన స్థాయికి, ఆ పదవిలోని ఔన్నత్యాన్ని కి గంభీరంగా ఉండేలాగా కొన్ని నివాసాలని భారత దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. వాటిలో దక్షిణాదిలో ఏర్పాటైన రాష్ట్రపతి నివాసం-- రాష్ట్రపతి నిలయం!

నాలుగు విడిదులు::

 రాష్ట్రపతి నివాసం ఉండడానికి ఢిల్లీ, హైదరాబాద్ మాత్రమే కాకుండా, హిమాచల ప్రదేశ్ లోని మాషోబ్రా లో "రాష్ట్రపతి నివాస్ " పేరిట రాష్ట్రపతి విడిది కేంద్రం ఉంది.

ఇది 1850 ప్రాంతంలో నిర్మించడం జరిగింది. 

అలాగే "రాష్ట్రపతి నికేతన్" అనే పేరిట ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో ఒక నివాసాన్ని నిర్మించారు. ఇది 1920ల్లో నిర్మాణమైంది. 

ఇలా రాష్ట్రపతి దేశవ్యాప్తంగా నివాసం ఉండటానికి నాలుగు ప్రాంతాలలో నాలుగు విడిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో రాష్ట్రపతి భవన్ ఢిల్లీ తర్వాత ప్రాచీనత విషయంలోనే కాకుండా ప్రాముఖ్యత దృష్ట్యా పేరెన్నికగన్న ఆవాసం మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి నిలయం హైదరాబాద్ దే!

Residency House నుండి రాష్ట్రపతి నిలయం::

 నిజానికి ఇది సికింద్రాబాద్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే బొల్లారంలో నిర్మాణమైంది. ఈ రాష్ట్రపతి నిలయం తనకి తాను ఒక చరిత్రగా, సంప్రదాయానికి కొలువు గా ఉండటం విశేషంగా అనిపించింది.

 1850 ప్రాంతంలో మొదలెట్టి, 10 ఏళ్ళ కు 1860 లో దీని నిర్మాణం పూర్తయింది. దీనిని ఆనాటి నిజాం నాజిర్ ఉద్ దౌలా నిర్మించారు. నిజానికిది అప్పట్లో బ్రిటిష్ ప్రతినిధి ఉండడానికి వీలుగా నిర్మించడం జరిగింది. అందుకే అప్పట్లో దాన్ని "రెసిడెన్సి హౌస్" అని పిలిచేవారు. ఎందుకంటే అప్పుడు నిజాం ప్రభుత్వానికి బ్రిటిష్ వైస్రాయ్ కి మధ్య "సైన్య సహకార ఒడంబడిక" జరిగింది. దానిలో భాగంగా బ్రిటిషు సైన్యం ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఒక క్యాంప్ ను ఏర్పాటు చేయడం, వారు వివిధ పిరంగి, తుపాకులు రైఫిల్స్ షూటింగ్, ఆయుధాలలో శిక్షణ ఇవ్వడం చేసేవారు.

హైదరాబాద్ నిజాం రక్షణ సాకుగా, ఆ పేరుతో బ్రిటిష్ కంటోన్మెంట్ సైనిక యంత్రాంగమంతా ఇక్కడ తిష్ట వేసిందన్న మాట. దాని కేంద్రంగా రెసిడెన్సి హౌస్ ఉండేది.

అందుకే ఈ భవన నిర్మాణ రీతులు, అక్కడ ఉన్న ఇతర కట్టడాలన్నీ "ఇండో ఇస్లామిక్ అండ్ యూరోపియన్ స్టైల్ "తో ఉండటం విశేషం!

కట్టడాలు, భవనాలు, నిర్మాణాలు, ఆలయాలు ఆయా కాలాల నాటి చరిత్రని, వారసత్వాన్ని, వాస్తు శిల్ప రీతుల ఔన్నత్యాన్ని వెల్లడి చేసే భౌతిక ఆధారాలు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అలానే 170 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ రాష్ట్రపతి నిలయం లోని ప్రతీ ఇసుక రేణువు కథలు కథలుగా ఎన్నో విషయాలు చెబుతుంది.

ఇది మొత్తం 90 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉంది.

కాగా రాష్ట్రపతి నివాసం ఉండే ప్రధాన భవనం లో మొత్తం 16 గదులు ఉన్నాయి. Southern sojourn గా పిలిచే ఈ భవనంలో రాష్ట్రపతి విడిది చేసినపుడు రాష్ట్రపతి తో పాటు వారి పర్సనల్ అధికార యంత్రాంగం వుండడానికి వీలుగా ఈ గదులు ఏర్పాటు అయ్యాయి. దానికి తోడు ఈ భవనంలో ఒక ప్రధాన ఆకర్షణ "డైనింగ్ హాల్ "అని చెప్పొచ్చు. రాష్ట్రపతి భోజనం చేయడానికి వీలుగా ఏర్పాటైన ఈ డైనింగ్ హాల్ కు దిగువన "కిచెన్ టన్నెల్" ఏర్పాటు కావడం విశేషం. నాకు తెలిసి వంట చేసిన పదార్థాలను డైనింగ్ హాల్ కు తీసుకురావడం కోసం ఒక సొరంగం లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక భవనం బహుశా ఈ రాష్ట్రపతి నిలయమే!

అప్పట్లో డైనింగ్ హాల్ కు కిచెన్ దూరంగా ఉండేది. వంటశాలలో వండిన పదార్థాలన్నీ చాలా పకడ్బందీగా అత్యంత రక్షణతో అక్కడి నుండి టన్నెల్ ద్వారా నేరుగా డైనింగ్ హాల్ కి తీసుకొచ్చే ఫెసిలిటీ ని ఇక్కడ రూపొందించారు. అయితే కాలక్రమంలో ఈ మార్గం నిరుపయోగమై పోయింది.

మూసివేసిన ఈ టన్నెల్ ను 2020 లో పునః ప్రారంభించాలని అనుకున్నారు. అలా దానిని పునరుద్ధరణ చేసి ఇప్పుడు సందర్శకుల కోసం అనుమతించారు. అయితే ఆ టన్నెల్ లోని గోడలను ఖాళీగా ఉంచకుండా సుందరీకరించాలని 2023లో అనుకుని ఆ గోడలపై తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించే చేర్యాల నకాష్ చిత్రాలు చిత్రించారు. Ajanta cave paintings, Vatican St Peter's Basillica గోడల పైన వేసిన fresco paintings మాదిరిగా ఆ గోడల పైన నకాషీ పెయింటింగ్స్ చిత్రించారు.  

ఇక రాజసం, వైభవం, చారిత్రకత, అధికారంల నిదర్శనంగా నిలిచిన రాష్ట్రపతి నిలయం లో కొన్ని ప్రముఖ స్థలాల విశేషాలు::::.

 1. FLAG POST:: జాతీయ పతాకం ఆవిష్కరించే ప్రత్యేక ప్రదేశం ఇది.1948 లో 120 అడుగుల ఎత్తులో బర్మా టేక్ తో రూపొందించబడిన జాతీయపతాక కేంద్రం ఇది.

1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో విలీనం అయిన సందర్భంగా జనరల్ జయంతినాధ్ చౌదరి త్రివర్ణపతాకాన్ని తొలిసారిగా ఆవిష్కరించి విలీనాన్ని సంకేతాత్మకంగా ప్రపంచానికి చాటి చెప్పిన ప్రదేశం ఇది..... అందుకని ఇది భారతదేశ సార్వభౌమత్వానికి హైదరాబాద్ రాజ్య స్వతంత్రతకు చరమ గీతం పాడి, విలీనత్వానికి తెర లేపిన సంకేత స్థలంగా నాకనిపించింది. 

2) Jai Hind Step Well అనే భారీ మోట బాయి:

 నన్ను చాలా ఆకట్టుకున్న నిర్మాణాలలో భారీ మోట బాయి ఒకటి. step wells అని కూడా అంటున్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో కరెంటు, ఇతర మోటార్ పరికరాలు లేని సందర్భంలో బావిలోంచి నీళ్లను ఎత్తిపోయడానికి ఉపయోగించిన ప్రాచీన సంప్రదాయ నీటి పారుదల విధానం ఇది. లోతైనబావిలో ఉన్న నీటిని పెద్ద పరిమాణంలో పైకి తోడటానికి భారీ ఇనుప గంగాలాన్ని తాళ్ళతో కట్టి బావిలోకి దింపి, ఆ గంగాలం నీళ్లతో నిండిన తర్వాత, దానికి కట్టిన తాళ్ళను ఎద్దుల కాడితో అనుసంధానించి, ఎద్దులను "మోట " లోకి ముందుకు నిండిపించడం ద్వారా బావిలోపల నీళ్లతో నిండి ఉన్న గంగాలం ను పైకి తీసుకు వస్తారు. అయితే ఈ గంగాలంలోని నీళ్లు బావిలోంచి పైకి వస్తున్నపుడు కారిపోకుండా తోలు తిత్తి ని గంగాలానికి ఒక వైపున బిగించి, దానికి ఎద్దుల కాడితో తాళ్ళతో అనుసంధానిస్తారు.

దీని వల్ల ఏక కాలంలో గంగాలం బావి లోని నీళ్లలోకి మునిగేపుడు నీళ్లు గంగాలం లోకి సులువుగా ప్రవేశించి, నిండిన తర్వాత పైకి లాగుతున్నపుడు తోలు తిత్తి మూసుకుపోయి నీళ్లు జారిపోకుండా నిరాటంకంగా పై వరకు వస్తాయి. అలా పైకి తెచ్చిన నీటిని ఒక చిన్న తటాకం లో నిల్వ చేసి, ఆ తర్వాత పొలంలోకి లేదా చేన్లలోకి నీటిని పారిస్తారు. 

అయితే ఇక్కడి మోటబావి చాలా పెద్దది. సాధారణంగా ఎక్కడైనా మోటబాయి, కాడి మోస్తున్న రెండు ఎద్దులు నడవడానికి వీలుండే ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మూడు జంట ఎద్దులు ఏకకాలంలో ఆ బావిలో నీళ్ళు పైకి తోడడానికి వీలుగా ఉండే అంత విశాలంగా ఉండటం ఆశ్చర్యమనిపించింది. నాకు తెలిసి తెలంగాణ ప్రాంతం మొత్తంమీద బహుశా అతిపెద్ద మోటబాయి ఇదేనేమో!

 అయితే ఈ మోటబాయి కాలక్రమేణా పూడుకుపోయి, మూసుకుపోయి శిధిలమైపోయింది. దాన్ని ఇటీవలి కాలంలోనే పునరుద్ధరించి ఇప్పుడు ఒక మోడల్ గా ప్రదర్శన విశేషంగా చూపిస్తున్నారు. దీని పైన నిర్మించిన ramp భూమికి 45°కోణంలో వాలుగా నిర్మిస్తున్నపుడు, ఒక వైపున చింత చెట్టు ఉంటే, దానిని కొట్టి వేయకుండా ఆ ramp లో ఒదిగిపోయేలా చక్కగా కలుపుతూ ఈ నిర్మాణాన్ని పునరుద్ధరించారు. 

దాని వల్ల తెలంగాణ ప్రాంతంలో దాదాపు 170 సంవత్సరాల క్రితం పంటలు పండించడానికి, వ్యవసాయం చేయడానికి ఎలాంటి నీటిపారుదల వ్యవస్థని ఎంత నైపుణ్యంతో నిర్మించుకున్నారో ఆధారాలతో సహా చెప్పడానికి ఈ మోటబావి ఒక అద్భుతమైన సజీవ ఉదాహరణగా నిలుస్తుంది అని నేను భావిస్తాను.

 3) నక్షత్ర వాటిక :

ఇటీవలి కాలం అనే కాకుండా చాలా కాలం నుంచి భారతీయుల జీవన సంస్కృతిలో జన్మ నక్షత్రాలు, జాతక చక్రం, జ్యోతిషశాస్త్రం వంటి వాటి పట్ల అమితమైన ఆసక్తి, విశ్వాసం ఉంది. అయితే ఆయా నక్షత్రాలలో జన్మించిన వ్యక్తులకి శుభాలను, మేలును చేకూర్చే శక్తి గ్రహాలు, అంతరిక్షం లో మాత్రమే కాక, భూమి పైన మన చుట్టూ ఉండే ప్రకృతి పరమైన చెట్ల జాతులకి కూడా ఉంటాయనేది ఒక గమ్మత్తయిన నమ్మకం. దీనిని నేపథ్యం గా చేసుకుని రాష్ట్రపతి నిలయంలో "నక్షత్ర గార్డెన్" అనే పేరిట ఒక తోట ని ఏర్పాటు చేసారు. దీంట్లో భారతీయ జాతక శాస్త్రం లో ఉన్న మొత్తం 12 రాశులు, 27 జన్మ నక్షత్రాలు, 9 గ్రహాలు తో, ఏ నక్షత్రానికి ఏ ఏ చెట్టు జాతి అనుకూలంగా ఉంటుంది అనే "పురా శాస్త్రీయ దృక్పథం"తో ఈ నక్షత్ర వాటిక ని ఏర్పాటు చేశారు.

4) అమ్మవారి ఆలయం

 దాని పక్కనే దుర్గ భవాని ఆలయం కొలువై ఉంది. అమ్మవారు కొలువైన ఆలయం 

ప్రజలకీ, వచ్చే సందర్శకులు అందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉంటుంది. 

5) Herbal Garden:

ఇక దానికి కొద్ది దూరంలోనే వన మూలికల తోట ఒకటి ఉంది. భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేద, ప్రాకృతిక చికిత్స లో ఉపయోగించే అరుదైన అద్భుతమైన 116 జాతులకు సంబంధించిన చెట్లను ఒకే చోట హెర్బల్ గార్డెన్స్ అనే పేరిట ఏర్పాటుచేశారు. దాంట్లో ప్రతి ఒక్క జాతీ చెట్టు, మనిషి ఎదుర్కొనే వివిధ రకాల రోగాలు, వ్యాధుల నివారణకు ఉపయోగించే చెట్ల జాతులు గా ఉండటం విశేషం. 

ప్రకృతిలో అంతర్భాగంగా ఉన్న మానవుడు ప్రకృతిని ధిక్కరించి, ప్రకృతిని అధిగమించి, తను సృష్టించుకున్న కాంక్రీట్ జంగిల్ లోకి వెళ్ళిపోయి తనని తాను కోల్పోయాడనేది కాదనలేని సత్యం. ఇలా తను ఏమి కోల్పోయాడో తెలుసుకోవడానికి ఈ వనం ఉపయోగపడుతుంది. ప్రకృతిలో ఉన్నంతకాలం మానవుడిని ఏ వ్యాధి, ఏ రోగము పెద్దగా బాధించిన దాఖలాలు లేవు. కానీ ప్రకృతికి ఆవల వెళ్ళినప్పుడు మాత్రమే మానవుడికి సకల సమస్యలు, రోగాలు వచ్చిన స్థితిని మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడికి వచ్చే సందర్శకులకి ప్రకృతిలో అంతర్భాగంగా ఉండటం వల్ల జరిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఏంటో ఈ చెట్లు మనకు చెప్పకనే చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.

6) Amphi Theatre:: 

హెర్బల్ గార్డెన్ కు stepwells అనబడే మోటబావి ప్రాంతానికి మధ్య ఓపెన్ ప్రదేశంలో ఒక యాంఫీ థియేటర్ ని నిర్మించారు. ఈ యాంఫీ థియేటర్లో ప్రతీ వీకెండ్ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దాదాపు 100 మంది ప్రేక్షకులు 

కూర్చొని చూసే అవకాశం ఉన్న ఈ థియేటర్ బ్యాక్ డ్రాప్ గా step well arches కనిపిస్తాయి. దీనికి తోడు చుట్టూ ఉన్న ప్రాకృతిక సౌందర్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది.

7) మ్యూజియం :

శతాబ్దాల కాలం క్రితం నుంచి ఈ రెసిడెన్సీ కి అవసరమైన నీటిని అందించే ఈ మోట బావులలో ఉపయోగించిన వివిధ వస్తువులు, పరికరాలు, బిందెలు, గంగాళాలు, ఇతర సామాగ్రి అంతటినీ ఒకచోట భద్రపరిచి సందర్శకులకు ఆ కాలం నాటి పరికరాల పరిచయం కోసం ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.

ఇందులో గోడకి వివిధ రకాల బిందెలను అమర్చిన తీరు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాగా ఈ బిందెలు, గంగాళాలు అన్ని ఇనుముతో తయారవడం విశేషం.

8) టీవీ హాల్ :

ఈ నాలెడ్జ్ సెంటర్ కు పక్కనే పది మంది కూర్చొని చూసే వీలుండే ఒక ఆడియో విజువల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఇందులో గోడ కు అమర్చిన టీవీ స్క్రీన్ లో రాష్ట్రపతి నిలయం కు సంబంధించిన వివిధ అంశాల వీడియోని ప్రదర్శన చేస్తారు. ఈ గది లో పైకప్పు నిర్మాణం ఒక ఇంజనీరింగ్ విశేషం అని చెప్పవచ్చు. చుట్టూ గోడల తో కప్పబడి నప్పటికీ ఆ పై కప్పు నిర్మించిన తీరు, లోపలికి వెలుతురు ప్రసరించేలాగా నిర్మించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది.

9) Rock Garden :

కొద్ది దూరంలో అక్కడ సహజంగానే రూపొందిన పెద్ద పెద్ద కొండలు, చిన్న రాళ్లగుట్ట లాంటి నిర్మాణాన్ని, వాటి సహజ రీతిలోనే ఎలాంటి విరూపణలు చేయకుండా వాటి చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ చేయడం ద్వారా వాటికి ఒక ఒక సౌందర్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక ఆకర్షణ ఏమిటంటే, ఒక పెద్ద రాతి కొండపైనే శిల్పుల చేత శివ రూపమైన మేధా దక్షిణామూర్తి, నంది ప్రతిమలను చెక్కించి, ఆ కొండ పైనుంచి కృత్రిమంగా ఒక జలపాతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 24 గంటలు రాళ్లగుట్ట మీద నుంచి కింది తటాకం వరకు నిరంతరం ప్రవహిస్తూ మేధా దక్షిణమూర్తిని, నందిని అభిషేకం చేస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. 

 దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉండే చెట్లు అన్నీ అరుదైన జాతికి సంబంధించిన చెట్లు కావడం, బ్రహ్మ జముడు, నాగ జముడు, జట్రాప కార్కస్ లాంటి ఇతర జాతుల కు సంబంధించిన మొక్కలు ఉండడం గొప్పగా అనిపించింది. 

10) ఇతర తోటలు:

ఇవే కాక "PALMATUM" అనే పేరుతో పామ్ చెట్ల లో ఉండే దాదాపు ఎనిమిది రకాలకు సంబంధించిన చెట్లు ఏర్పాటు చేశారు.

దాంతో పాటు సీతాఫలం, రామఫలం, ఆంజనేయ ఫలము, లక్ష్మణ ఫలం అని నాలుగు రకాల సీతాఫల జాతికి సంబంధించిన చెట్లు అన్నీ ఒక చోట ఉండటం ఆశ్చర్యం అనిపిస్తుంది.

అలాగే జామ, ఉసిరి తోటలు, వివిధ రకాల మామిడి జాతులతో కూడిన తోట చాలా అద్భుతంగా ఉంటుంది.

 మరొకవైపున తెలంగాణ ప్రభుత్వం పక్షాన రూపొందిన హరితహారం లో అంతర్భాగంగా దాదాపు 14 వేల మొక్కలు రాష్ట్రపతి నిలయంలో అప్పుడు నాటారని తెలిసింది. ఇప్పుడు చాలా విస్తారమైన చెట్లు, వన సంపద తో ఆకర్షణీయంగా ఉంటుంది. 

Talking Tree :

 కొన్ని వందలాది సంవత్సరాల చరిత్ర కి మౌన సాక్షిగా నిలిచిన ఒక మర్రి చెట్టు ఇక్కడ ఉంది. ఊడల మర్రి చెట్టు వద్ద సౌండ్ సిస్టం ను ఏర్పాటు చేసి అందులోంచి ఒక రికార్డెడ్ వాయిస్ ను వినిపిస్తారు. ఇది ఒక విధంగా sound & light show లాంటిది. సందర్శకులు అందరికీ రాష్ట్రపతి నిలయం విశేషాలని చెప్పడానికి మర్రిచెట్టునే ఒక వ్యాఖ్యాత గా మారిపోయి తన ఆత్మకథగా అక్కడి చారిత్రక, వాస్తు శిల్ప విశేషాలను అందిస్తుంది. ఈ టెక్నీక్ ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పవచ్చు.  

సందర్శనా స్థలం:

కాగా ఇది 2023 నుంచి ప్రజలకు నగర పౌరులందరికీ సందర్శన కోసం ఓపెన్ చేసి పెట్టడం జరిగింది ఇది ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఏ రోజైనా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా సందర్శించవచ్చు. హైదరాబాదులో సందర్శించదగిన, చారిత్రిక వాస్తు శిల్ప రీతికి సంబంధించిన నిర్మాణాలలో రాష్ట్రపతి నిలయం కూడా ఒకటి గా మన మిత్రులకు గర్వంగా చెప్పవచ్చు...

---- డాక్టర్ మామిడి హరికృష్ణ

8008005231