Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

23 April 2024

పుస్తకం: @ మహోన్నత వారధి @

ఒంటరిగా మనం చదవడం

నేర్చుకుంటే సమాజానికి నిన్ను

ఆత్మీయులుగా మార్చుతుంది

నలుగురితో కలిసి పంచుకుంటే

సమాజాన్ని మనకు స్వంతం చేస్తుంది


తనలో పొందు పరిచిన

ఒక్కొక్క అక్షరం 

మన అభ్యున్నతికి మూలమంత్రం

ప్రతి పుట ఉన్నత మార్గానికి దిక్సూచి


అధ్యయనమైనా పరిశోధనైనా

వికాసమైనా వినోదమైనా

ఒకసారి తన హృదయాన్ని

ఆవిష్కరించి పరిశీలిస్తే..పఠిస్తే

కొత్త అనుభూతి..అభివృద్ధి తథ్యం


మనం ఇంకొకరిని గమనించాలన్నా 

మనం మనల్ని అన్వేషించుకోవాలన్నా

పుస్తకాన్ని చదవడం కన్నా

గొప్ప అభిరుచి లేదన్నది వాస్తవం

జరిగిన తాతల ముచ్చట నీకు

నీ మాట భావితరాలకు తెలిపే

మహోన్నత వారధి పుస్తకం.

 *ప్రపంచ పుస్తక దినోత్సవం*

 సందర్భంగా..

 మీకు శుభాకాంక్షలు.

**

23-4-2024

పుస్తకం

పుస్తకం 

విజ్ఞాన కాంతుల్ని ప్రసరించే

 అక్షర రత్న పేటిక

 కోట్లాది మెదళ్లను రగిలించే 

చైతన్య దీపిక 

తరతరాల చరిత్రను

 తన గుండెల్లో నింపుకొని

 భావితరాలకు అందించే

 విజ్ఞాన కలిక

 జీవపరిణామాన్ని

 విశ్వ వీధుల నిగూఢత్వాన్ని

 పంచభూతాల స్వాభావికతను

 సమస్త విషయ పరిజ్ఞానాన్ని

 అక్షరాక్షరాన నిబిడీకరించుకున్న 

రసోద్దీపన వాక్య తంత్రిక 

జీవన వేదాన్ని నిర్వేదాన్ని

 అమృతత్వాన్ని మృతత్వాన్ని

 అల్పత్వాన్ని అనల్పత్వాన్ని

సూక్ష్మాన్ని స్థూలాన్ని

 వ్యక్తిగతాన్ని సమిష్టిగతాన్ని 

ఒకటేమిటి? సమస్తమును

పద పదాన ఇముడ్చుకున్న 

విషయ భాండాగారం 

అమ్మ దనంతో పాటు కమ్మదనాన్ని

 మానవతా పరిమళాల్ని గుబాళింప జేసే

 జ్ఞాన సుమమాలిక 

పుస్తకం 

సమస్త మానవాళికి మూడో కన్ను

 జ్ఞానాగ్నిని ప్రజ్వరిల్ల జేసి

 అజ్ఞానాన్ని కాల్చివేయడమే కాదు

 విజ్ఞానసుధల్ని కురిపించి

 వివేకత్వాన్ని ప్రసాదించగలదు

(ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా…)

                                            - డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య

18 April 2024

TS CETS 2024


✍️ టెట్ లాస్ట్ డేట్ :
* 20-04-2024
* అర్హత : TTC, BEd

✍️ పాలీసెట్ లాస్ట్ డేట్ :
* 22-04-2023
* అర్హత : పదవతరగతి

✍️ ఎడ్ సెట్(Bed)లాస్ట్ డేట్:
* 06-05-2024
* అర్హత : డిగ్రీ

✍️ లా సెట్ లాస్ట్ డేట్:
* 25-04-2024
* అర్హత : డిగ్రీ

✍️ ఐ సెట్ (Mba,Mca)
- లాస్ట్ డేట్ :
* 30-04-2024
* అర్హత : డిగ్రీ 

✍️ పీజీ ఈ సెట్ :
* 10-05-2024
* అర్హత : ఇంజినీరింగ్  డిగ్రీ 

✍️ డిఎస్సి లాస్ట్ డేట్ :
* 20-06-2024
* అర్హత : TTC or BE.d

🌷🌷🌷🌷🌷🌷🌷

🌷🌷🌷🌷🌷🌷🌷🌷 TS CETS 2024 ✍️ టెట్ లాస్ట్ డేట్ : * 20-04-2024 * అర్హత : TTC, BEd ✍️ పాలీసెట్ లాస్ట్ డేట్ : * 22-04-2023 * అర్హత : పదవతరగతి ✍️ ఎడ్ సెట్(Bed)లాస్ట్ డేట్: * 06-05-2024 * అర్హత : డిగ్రీ ✍️ లా సెట్ లాస్ట్ డేట్: * 25-04-2024 * అర్హత : డిగ్రీ ✍️ ఐ సెట్ (Mba,Mca) - లాస్ట్ డేట్ : * 30-04-2024 * అర్హత : డిగ్రీ ✍️ పీజీ ఈ సెట్ : * 10-05-2024 * అర్హత : ఇంజినీరింగ్ డిగ్రీ ✍️ డిఎస్సి లాస్ట్ డేట్ : * 20-06-2024 * అర్హత : TTC or BE.d 🌷🌷🌷🌷🌷🌷🌷