Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

15 April 2025

జానపదం.. మనకు జ్ఞానపథం ---------------------------- యావత్ ప్రపంచంలోనే.. మన నడిగడ్డ తెలంగాణం, జానపదానికి పెద్ద భాండాగారం..! దక్షిణ భారతదేశంలోనే మొదటి జానపదపు Ph.D. మనదే. మన బిరుదురాజు రామరాజు గారు 1962లో ఉస్మానియా యూనివర్సిటీలో జానపద గేయసాహిత్యంపై తొలి పట్టా పొందిండ్రు. ఉస్మానియా తెలుగుశాఖలో ఇదే తొలి సిద్ధాంతవ్యాసం. వారికి శతజయంతి నమస్కృతిగా.. మా యీ జాతీయసదస్సు. ముట్టింది ముచ్చం గావాలె - పట్టింది పవుడం గావాలె.. అని జానపదం నుడివే ఫలశృతి. ఇంతకంటె గొప్పమాటెక్కడ...!! -డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి

 


తెలివైనవారి పది అలవాట్లు ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్.. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా, గాలిలోకి చూస్తూ, తమలో తామే ఆలోచించుకుంటూ... తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారు దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని అనుకుంటారని, వినయపూర్వకంగా ఉంటారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థంచేసుకుని, ఆచరిస్తే.. తెలివితేటలను మనందరమూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ పది అలవాట్లేమిటో తెలుసుకుందాం.

 

1️⃣ తమ తెలివితేటల గురించి మాట్లాడరు

అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు.

2️⃣ విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు

తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు.

3️⃣ పరిష్కారంలో ముందుంటారు

తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో, సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు.

4️⃣ ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు

'మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు' అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు, తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్ధం చేసుకుంటారు.

5️⃣ డాట్స్ ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు

తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని సలుపు-తెలుపులుగా, మంచి-చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్ ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్ధం చేసుకుంటారు.

6️⃣ చాలా ప్రశ్నలు అడుగుతారు

తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు.

7️⃣ చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధ పెడతారు

తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్జెక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి అర్ధంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు.

8️⃣ లోతుగా అధ్యయనం చేస్తారు

తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్ధంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు.

9️⃣ ఇతరుల పనుల గురించి ఆలోచించరు

తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు.

🔟 చేసేముందు ఆలోచిస్తారు

తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్ధం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు. 



 'ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి' అని ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు చెప్పినట్లు తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు.

12 April 2025

🔊‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం* *🍥దిల్లీ: పద్మ అవార్డులు-2026 నామినేషన్ల ప్రక్రియను హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ పురస్కారాలకు 2025 జులై 31 లోపు నామినేషన్లు, సిఫార్సులను పంపాలని శుక్రవారం ఓ అధికార ప్రకటనలో పేర్కొంది.

 * వాటిని రాష్ట్ర్రీయ పురస్కార్‌ పోర్టల్‌ https://awards.gov.in లో స్వీకరిస్తామని తెలిపింది. ఏటా ప్రదానం చేసే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా నిలుస్తాయి. మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ https://mha.gov.in పద్మ అవార్డుల పోర్టల్‌ https://padmaawards.gov.in లో అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.*

11 April 2025

జానపదసాహిత్యం - పునర్మూల్యాంకనం ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ #అంతర్జాల_జాతీయసదస్సు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పాండిచ్చేరి, గుజరాత్... అన్ని ప్రాంతాలూ తెలుగు జానపద సాహిత్యానికి కాపుగాస్తున్న కన్నతల్లులే. ఒకప్పుడు జీవనసూత్రంగా నిలిచిన జానపదం, ఆధునికసాహిత్యకాలంలో అశిష్టమని చిన్నబుచ్చబడ్డది. కానీ సర్వం విధ్వంసంగా మారుతున్న ప్రస్తుతకాలంలో మరోమారు ప్రజాసాహిత్యం వైపు మనం తొంగిచూస్తున్నము. కొత్త చూపుతో చూస్తున్నము. పాతదాన్నే కొత్తగచూసి ఊరటపడుతున్నము. కోల్పోయిన మంచిని తిరిగి పొందుటానికి ఆరాటపడుతున్నము. జానపదసాహిత్యంలోని వైజ్ఞానికసంపదను వెతుక్కుంటున్నము. జానపద విజ్ఞాన ప్రాసంగికతను పునర్వివేచన చేస్కుంటున్నము. ఈ ఆలోచనల సారసమాహారమే.. మన జానపదసాహిత్య అంతర్జాల సదస్సు. జానపదంలోని జ్ఞానపథాన్ని వెలికితీయగల పరిశోధకమిత్రులందరికీ... ఇదే మా సాదర ఆహ్వానం ! -తెలుగుశాఖ, ప్రభుత్వ డిగ్రీకళాశాల (స్వ.ప్ర.), సిద్దిపేట - తెలంగాణ.

 


08 April 2025

PG ENTRANCE Previous QP & Answers of TGCPGET&CUET-2024,2023,20222021, 2020,2019,2018 ALL SUBJECTS-2017,2016,2015 & UOH, BHU, KU, PU BY A DURGAPRASAD LIBRARIAN GOVT DEGREE COLLEGE HAYATHNAGAR, OU, HCU, PU,BHU, KURUKSHTETRA UNIVERSITY

2024https://drive.google.com/drive/folders/154b5eMBxJd_yZ2Cf9oHv86MA7HGHNXTB

2023https://drive.google.com/drive/folders/1Otk7mYJchNywIB_2CxDwx3VVKOlKH8RW

2022https://drive.google.com/drive/folders/15NoELXQ9RcjK6e5itjtnvxitVAwNHOrO

2021https://drive.google.com/drive/folders/1AR2GL22fmuxA1qHVlPS4HLDV0kQPcI5N

2020https://drive.google.com/drive/folders/1fLmG3pCS1KaCLGyGlxa70TwrPA4nEIaq

2019 https://drive.google.com/drive/folders/1t9wOpkVNp4YpMPGs1YdS8MLYSSOror2p




2024/2023:CUET PG SYLLABUS& PREVIOUS QUESTION PAPERShttp://ndl.iitkgp.ac.in/cd_document/cuetpg/02_laqp

2021-2010 University of Hyderabad  PREVIOUS  PG Entrance QP (Last 11 Yers): http://igmlnet.uohyd.ac.in:8000/question-papers.htm 
Pondichery University  PREVIOUS  PG Entrance Question papers :  http://lib.pondiuni.edu.in/eoldqp.php 
Banarus Hindhu University  PREVIOUS  PG Entrance Question papers  :  http://bhuonline.in/old-qus-paper-entr.html 
 Kurukshetra University  PREVIOUS  PG Entrance Question papers  https://www.kuk.ac.in/information.php?direction=Vertical&L01_id=MTQ=&L01_direction=V&L02_id=MTAy  


CBT: COMPUTER BASED TEST MOCKTEST FOR PRACTICE:TRY IT 

TGCPGET-2024 Question Papers & Answers

TGCPGET-2024 Question Papers & Answers

M.A./M.Com./M.S./MLISC./MCJ./MHRM./MTM

International Webinar: Revisiting and Revitalizing Communicative Language Teaching in Undergraduate Classrooms in Telangana: Mapping the 20-Year Journey,Date: Tuesday, April 8, 2025 Time: 10:25 AM – 1:30 PM IST , Government Degree College for Women, Gajwel.

 Government Degree College for Women, Gajwel warmly invites you to the International Webinar:

Revisiting and Revitalizing Communicative Language Teaching in Undergraduate Classrooms in Telangana: Mapping the 20-Year Journey

Date: Tuesday, April 8, 2025

Time: 10:25 AM – 1:30 PM IST

Zoom Link to Join:

https://us06web.zoom.us/j/9866411211?pwd=Wq9SpfRB1IyeFdEMoL7OSUw7HD9p9h.1&omn=84903494096

Meeting ID: 986 641 1211

Passcode: GDCWG

We look forward to seeing you there for this reflective and enriching session!

04 April 2025

ONE DAY NATIONAL SEMINER On "Integrating Artificial Intelligence in Education: Opportunities andh Challenges" Organized by BASIRHAT MAHABODHI COLLEGE OF EDUCATION April 25, 2025 (Hybrid Mode) Last date of abstract submission - 15.04.2025 Last date of registration: 23.04.2025


Submit your abstract and full paper at

Email: iaieoc2025@gmail.com

Registration Link: https://forms.gle/x1FZHx89VRxMvY3AA






తెలంగాణా ప్రాంతంలోని వివిధ భాషలను డిజిటల్‌గా అభివృద్ధి చేయడానికి ఒక అద్భుతమైన ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని IndicWiki ప్రాజెక్ట్ @ IIIT Hyderabad, అందజేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధానంగా స్థానిక, వనరులు తక్కువగా ఉన్న తెగల భాషల డిజిటల్ పరిరక్షణ మరియు అభివృద్ధిపై కేంద్రీకరిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా, వికీపీడియా సోదర ప్రాజెక్టుల వంటి స్వేచ్ఛా జ్ఞాన వనరుల అభివృద్ధిలో పాల్గొనవచ్చు. భవిష్యత్ తరాల కోసం విలువైన భాషా సంపదను సంరక్షించి, అందించడంలో మీ సహకారాన్ని అందించండి! #IndicWiki #IIIT #Hyderabad #Internship వ్యవధి: మే 12 – జూన్ 30, 2025


 అర్హత: కనీసం ఒక భాష (గొండి, కోయ, కోలామి, నాయక్, చెంచు, కైకాడి, యెరుకుల, లంబాడి, నక్కల, కొండ కమ్మర) మాట్లాడగలిగే మరియు తెలుగు లిపిలో వ్రాయగలిగే (UG/PG) విద్యార్థులు లేదా ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పైన పేర్కొన్న భాషలను మాతృభాషగా కలిగిన, మీకు తెలిసిన విద్యార్థులు, ఔత్సాహికులతో ఈ అవకాశాన్ని పంచుకోండి. భాషా పరిరక్షణలో భాగం అవ్వండి! 

🌟 ఇక్కడ అప్లై చేయండి: https://forms.gle/FhF8GhKViRjeR3BY8

📌 అప్లికేషన్ చివరి తేదీ: April 30, 2025

📩 సంప్రదించండి: pm.indicwiki@iiit.ac.in



02 April 2025

*నల్లగొండ వన్ టౌన్ పిఎస్ పట్టణ పరిధి నిరుద్యోగ యువతీ యువకులకు ఒక గొప్ప అవకాశం* నల్లగొండ జిల్లా గౌరవ ఎస్ పి శ్రీ. శరత్చంద్ర పవార్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో *మిషన్ పరివర్తన్ యువ తేజం* కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తారీఖున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతీ యువకుల కోసం నిర్వహించబడుతుంది. ఇట్టి జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ యొక్క నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు పొందాలని వన్ టౌన్ పోలీస్ వారు కోరుతున్నారు. దీనికి నిరుద్యోగ యువతీ యువకులు చేయవలసింది 1. కనీస విద్య అర్హత పదవ తరగతి ఉండి వారి యొక్క వివరాలను పోలీస్ స్టేషన్లో వెంటనే నమోదు పరుచుకోవాలి. 2. వందకు పైగా కంపెనీలు, 2500 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించ నున్నాయి. 3. జాబ్ లో సెలెక్ట్ అయిన వారందరికీ, ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే అపాయింట్మెంట్ లెటర్ మంచి శాలరీ ప్యాకేజ్ తో ప్రకటించ బడుతుంది. 4. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రతి వార్డు నుండి కనీసం 20 మంది పైగా జాబ్ మేళాలో పాల్గొని అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తున్నాము 5. యువత ఖాళీగా ఉంటూ చెడు ధోరణి వైపు వెళ్లకుండా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ, వారి కుటుంబానికి సమాజానికి మేలు చేసేలా ఈ అవకాశం కలగజేస్తుందని ఆశిస్తున్నాము. ఇట్లు *వన్ టౌన్ ఇన్స్పెక్టర్* *నల్గొండ వన్ టౌన్ పిఎస్*